Khammam

News April 19, 2024

నామా గెలుపు చరిత్రాత్మకం‌ అవుతుంది: పువ్వాడ

image

ఎంపీ ఎన్నికల్లో నామా గెలుపు ఖమ్మం జిల్లాలో చరిత్రాత్మకం‌ అవుతుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. కేసీఆర్ ఆలోచనలను ప్రజల వద్దకు తీసుకెళ్లాలని పువ్వాడ అన్నారు. పార్టీ శ్రేణులంతా కష్టపడి పనిచేసి నామా గెలుపునకు సహకరించాలని ఆయన కోరారు. గతం కంటే అత్యధిక మెజార్టీతో గెలుస్తామని ధీమా వ్యక్తం‌ చేశారు. పార్టీ కోసం పనిచేసేవారికి ఎప్పటికైనా అవకాశాలు వస్తాయన్నారు.

News April 19, 2024

ఖమ్మంలో రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

ఖమ్మంలో ఇవాళ ఉదయం రోడ్డుప్రమాదం జరిగింది. లారీ ఢీకొని వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఖమ్మంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద వేగంగా వెళుతున్న లారీ ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 19, 2024

ఖమ్మం బీజేపీ ఎంపీ అభ్యర్థిగా తాండ్ర నామినేషన్

image

ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థిగా తాండ్ర వినోద్ రావ్ నామినేషన్ వేశారు. కలెక్టరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కేంద్రంలో తన నామినేషన్ పత్రాలను కలెక్టర్ గౌతమ్‌కు ఆయన అందించారు. తాండ్ర వెంట జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, పొంగులేటి సుధాకర్ రెడ్డి పలువురు నాయకులు ఉన్నారు. గెలుపుపై ఆ పార్టీ నాయకులు ధీమాతో ఉన్నారు.

News April 19, 2024

24న బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నామినేషన్

image

ఈనెల 24వ తేదీన బీఆర్ఎస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు నామినేషన్ దాఖలు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నుంచి ఆయన హైదరాబాదులో బీఫామ్ అందుకున్నారు. ఈ నామినేషన్ కార్యక్రమానికి మాజీ మంత్రులు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్ రానున్నట్లు తెలిసింది.

News April 19, 2024

ఖమ్మం: తగ్గిన మిర్చి, పత్తి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల ధరల వివరాలను మార్కెట్ శాఖ అధికారులు శుక్రవారం ఉదయం వెల్లడించారు. మిర్చి జెండా పాట క్వింట రూ.19500, పత్తి క్వింటా జండా పాట 7150 రూపాయలు ధర పలికినట్లు అధికారులు వెల్లడించారు. నిన్నటి కంటే ఈరోజు భారీగా ధర తగ్గడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్నటి కంటే ఈరోజు మిర్చి 500, పత్తి 150 రూపాయలు తగ్గింది.

News April 19, 2024

బీఆర్ఎస్ పరిస్థితి దారుణంగా ఉంది: మంత్రి తుమ్మల

image

పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ప్రస్తుతం దారుణంగా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీఆర్ఎస్ కు అభ్యర్థులు కూడా దొరకని పరిస్థితి ఉందని ఎద్దేవా చేశారు. 400 సీట్లు గెలుచుకుంటామంటూ బీజేపీ మ్యాజిక్ చేసే ప్రయత్నం చేస్తోందని రెండు సార్లు ప్రజలను మోసం చేసిన మోదీ మూడోసారి మోసం చేసేందుకు వస్తున్నారని విమర్శించారు.

News April 19, 2024

KMM: తాటి చెట్టు పైనుంచి పడి గీత కార్మికుడి మృతి

image

తాటి చెట్టు పై నుంచి పడి ఓ గీత కార్మికుడు మృతి చెందిన ఘటన తిరుమలాయపాలెం మండలంలో ఉదయం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాతర్లపాడుకి చెందిన వెంకన్న(55) కల్లు గీత కార్మికుడు రోజులాగే సమీప గ్రామమైన చంద్రుతండాలో తాడిచెట్టు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారి పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడి చనిపోయాడని తెలిపారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

News April 19, 2024

KTDM: ఎంపీటీసీ దారుణ హత్య

image

కన్నాయిగూడెం ఎంపీటీసీ పర్స బాలకృష్ణ దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు తలపై బండరాయితో మోది హత్య చేసినట్లు తెలుస్తోంది. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాజకీయ కక్షల నేపథ్యంలోని హత్య జరిగినట్లు తెలుస్తుంది.

News April 19, 2024

ఖమ్మం: కాంగ్రెస్ పార్టీలో అదే ఉత్కంఠ

image

ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడంతో అభ్యర్థిని ప్రకటనపై కార్యకర్తలు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని నియమించారు. అలాగే డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

News April 19, 2024

సింగరేణిలో 327 ఉద్యోగాలు.. అర్హతలివే

image

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(SCCL)లో ఖాళీగా ఉన్న 327 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను సింగరేణి అధికారులు విడుదల చేశారు. సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు మే 4వ తేదీలోపు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు, దరఖాస్తు చేయడం కోసం https://scclmines.com/ వెబ్ సైట్‌ను సందర్శించవచ్చని సింగరేణి అధికారులు తెలిపారు.