India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఈ నెల 13న జరగనున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం కమిషనరేట్ పరిధిలో రెండు రోజుల పాటు మద్యం విక్రయాలను నిలిపివేయాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుండి 13వ తేదీ రాత్రి 10 గంటల వరకు కమిషనరేట్ వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ చేయాలని సూచించారు. వైన్ షాపులు, బార్లు, మద్యం సరఫరా చేసే రెస్టారెంట్లు, కల్లు కంపౌండ్‌లు మూసివేయాలని ఆదేశించారు.
మధిర పట్టణంలోని అన్నపూర్ణ మెస్ పక్కన విజయవాడ నుంచి వచ్చిన ఓ యువతి (22) అద్దెకు నివాసం ఉంటోంది. ఈరోజు మధ్యాహ్నం సమయంలో ఉరి వేసుకుని అనుమానాస్పద స్థితిలో చనిపోయింది. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఆర్కే ఫౌండేషన్ దోర్నాల రామకృష్ణ సహకారంతో మధిర టౌన్ ఎస్ఐ సహకారంతో మృతదేహాన్ని మధిర ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
నేను బ్రతక లేక రాజకీయాలు చేయట్లేదు.. ప్రజలకు ఏదో ఒక సహాయం చేయాలనే రాజకీయాలు చేస్తున్నాను.. అని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాళ ఉపేందర్ రెడ్డి తెలిపారు. ఖమ్మం సాయి గణేష్ నగర్ క్యాంప్ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకు నామా నాగేశ్వరరావును అత్యధిక మెజారిటీతో గెలిపించాలని తెలిపారు.
ఖమ్మం MP స్థానంలో ఇప్పటి వరకు 17 సార్లు ఎన్నికలు జరిగాయి. సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు 4 సార్లు పోటీ చేసి 2 సార్లు గెలిచారు. ఆయన 2019 ఎన్నికల్లో సాధించిన మెజార్టీనే ఇప్పటి వరకు అత్యధికం. ఆయన తన సమీప ప్రత్యర్థి రేణుకా చౌదరిపై 1,68,062 ఓట్ల మెజార్టీ సాధించారు. ఆ ఎన్నికల్లో నామాకు 5,67,459 ఓట్లు రాగా, రేణుకా చౌదరికి 3,99,397 ఓట్లు వచ్చాయి.
భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఈనెల 11నుంచి 13వరకు అన్ని మద్యం షాపులను మూసివేయాలని భద్రాద్రి జిల్లా కలెక్టర్ ప్రియాంక అల ఉత్తర్వులు జారీ చేశారు. పార్లమెంటు ఎన్నికలు సజావుగా జరిగేందుకు, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా మద్యం షాపులను మూసివేయనున్నట్లు తెలిపారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా కూడా మద్యం దుకాణాలు మూసివేయాలని ఆదేశించారు.
ఒంటరిగా మహిళ ముఖంపై మత్తు మందు స్ప్రే చేసి బంగారు గాజుల అపహరించిన ఘటన తల్లాడలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తల్లాడకు చెందిన మహిళ రాధిక ఇంట్లో ఒంటరిగా కూర్చోని ఉండగా ఇంటి వెనుక వైపు నుంచి గుర్తు తెలియని దొంగ లోపలకు ప్రవేశించి రాధిక మొఖంపై మత్తు మందు స్ప్రే చేశాడు. ఆమె స్పృహ కోల్పోవడంతో చేతికి ఉన్న రూ.1.05 లక్షల విలువైన 3 బంగారు గాజులను ఎత్తుకెళ్లినట్లు తెలిపారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల ధరల వివరాలను మార్కెట్ శాఖ అధికారులు శుక్రవారం ఉదయం వెల్లడించారు. పత్తి జండా పాట క్వింటా రూ.7125, ఏసీ మిర్చి క్వింటా జండా పాట రూ.21100, నాన్ ఏసీ మిర్చి జండా పాట క్వింటా రూ.18 వేలు ధర పలికినట్లు వెల్లడించారు. ధరలు స్వల్పంగా పెరుగుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పత్తి నిన్నటి కంటే రూ.25 పెరగగా, ఏసీ మిర్చి 600 పెరిగింది. నాన్ ఏసీ మిర్చి ధర నిలకడగా ఉంది.
ఖమ్మం లోక్ సభ స్థానంలో 16,31,039 మంది, మహబూబాబాద్ లోక్ సభ స్థానం పరిధిలో 15,30,367 మంది ఓటర్లు ఉన్నారు. వీరందరినీ ప్రత్యక్షంగా కలవటం సాధ్యం కాకపోవటంతో ఎంపీ అభ్యర్థుల వాయిస్‌తో ఫోన్ కాల్స్ ద్వారా ఓట్లను అభ్యర్థిస్తున్నారు. అయితే మీకూ కాల్స్ వస్తున్నాయా.. కామెంట్ చేయండి.
లోక్‌సభ ఎన్నికల ప్రచార హోరు చివరి ఘట్టానికి చేరుకుంది. ఖమ్మం జిల్లా పరిధిలోని 5అసెంబ్లీ నియోజకవర్గాల్లో శనివారం సాయంత్రం 6 గంటలకు, భద్రాద్రి జిల్లాలోని 5 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సాయంత్రం 5గంటలకే ముగియనుంది. దీంతో ప్రధాన రాజకీయ పార్టీలు, అభ్యర్థులు పోటాపోటీగా హోరాహోరీగా ప్రచారం సాగిస్తున్నాయి. సభలు, సమావేశాలు, రోడ్ షోలు, ఆత్మీయ సమ్మేళనాలు సాగిస్తూనే ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఖమ్మం <<13215602>>మున్నేరులో పడి గురువారం ముగ్గురు చిన్నారులు మృతి<<>> చెందిన ఘటన తెలిసిందే. అయితే.. గురువారం మధ్యాహ్నం భోజనం చేశాక పక్క ఇంట్లో ఆడుకుంటానని గణేష్ తన తల్లి కళావతికి చెప్పి వెళ్లాడు. ఈతకని చెబితే వెళ్లనివ్వరని అలా చెప్పినట్లు తెలుస్తోంది. తీరా నీట మునిగి గణేశ్ మృతి చెందినట్లు సమాచారం అందడంతో కళావతి అక్కడకు చేరుకుని కొడుకు మృతదేహంపై పడి రోదిస్తున్న తీరు అందరినీ కంటతడి పెట్టించింది.
Sorry, no posts matched your criteria.