Khammam

News May 10, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఖమ్మంలో ఓటు నమోదుపై అవగాహన ర్యాలీ
∆} వివిధ శాఖలపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} కల్లూరు మండలంలో బీఆర్ఎస్ రోడ్ షో కార్నర్ మీటింగ్
∆} కూసుమంచి మండలంలో కాంగ్రెస్ కార్యకర్తల సమ్మేళనం
∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు

News May 10, 2024

ఖమ్మం జిల్లాలో టీడీపీ దారెటు..?

image

ఖమ్మం జిల్లాలో బలమైన ఓటు బ్యాంకు, క్యాడర్ కలిగిన పార్టీగా TDPకి చరిత్ర ఉంది. ఆ పార్టీ మద్దతిచ్చిన వారు ఇక్కడ గెలిచే అవకాశాలు ఎక్కువ. గత ఎన్నికల్లో వారు హస్తం పార్టీకి సపోర్ట్‌గా ఉన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో జిల్లా నాయకత్వం ఎన్డీఏకు మద్దతు ప్రకటించింది. కానీ తెలుగు తమ్ముళ్లు తలో దారి చూసుకోవడంతో టీడీపీ  వర్గాలుగా చీలిపోయింది. మరి జిల్లా నాయకత్వం కార్యకర్తలను సమన్వయం చేస్తుందో లేదో చూడాలి!

News May 10, 2024

ప్రభుత్వ అధికారులు, సిబ్బంది బైక్ ర్యాలీ: జిల్లా కలెక్టర్

image

స్వీప్ కార్యాచరణలో భాగంగా ఈరోజు సాయంత్రం 5.00 గంటలకు ప్రభుత్వ అధికారులు, సిబ్బందిచే బైక్ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ వి. పి. గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు ప్రాముఖ్యత తెలుపుతూ, ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరు వినియోగించుకొనేల అవగాహన, చైతన్యం కొరకు ఈ ర్యాలీ చేపడుతున్నట్లు ఆయన అన్నారు.

News May 9, 2024

పాల్వంచ: పిడుగుపాటుకు 17 గొర్రెలు మృతి

image

పిడుగుపాటుకు 17 గొర్రెలు మృత్యువాత పడిన సంఘటన పాల్వంచ మండల పరిధి బిక్కు తండా అటవీ ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళ్తే.. మున్సిపల్ పరిధి వెంగళరావు కాలనీకి చెందిన వేల్పుల పెద్దిరాజు మేతకు తన గొర్రెలను మండల పరిధి బిక్కు తండా ప్రాంతానికి తీసుకెళ్లాడు. గురువారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన అకాల వర్షానికి తోడు పిడుగు పడడంతో 17 గొర్రెలు మృతి చెందినట్లు బాధితులు తెలిపారు.

News May 9, 2024

గోదావరిలో పడి బాలుడి మృతి

image

ప్రమాదవశాత్తు గోదావరిలో పడి బాలుడు మృతి చెందిన ఘటన ఎటపాక మండలం గొమ్ముకొత్తగూడెంలో జరిగింది. టీడీపీ ఎంపీటీసీ పాయం దేవి కుమారుడు పాయం జితేంద్ర(15) నెల్లిపాక గోదావరి లిఫ్ట్ ఇరిగేషన్ వద్ద నుంచి గేదెలను ఇంటికి తోలుకుని వస్తూ ప్రమాదవశాత్తూ గోదావరిలో పడి మృతి చెందాడు. బాలుడి తలిదండ్రుల రోదనలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి.

News May 9, 2024

KTDM: ఎన్నికలు బహిష్కరిస్తాం: ఆదివాసీలు 

image

పార్లమెంట్ ఎన్నికల్లో తమ ఓటును బహిష్కరిస్తున్నామని గరిమెళ్ళపాడు గ్రామానికి చెందిన ఆదివాసీలు బ్యానర్ల ద్వారా తమ సమస్యలను విన్నవించారు. దీనిపై స్పందించిన పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులు వారిని కలిసి మాట్లాడారు. తమ సమస్యలు పరిష్కారం అవుతాయన్న ఉద్దేశంతో ఓటు బహిష్కరిస్తున్నామని ప్రకటించినట్లు వారు చెప్పారు. ఏళ్ల నాటి తమ భూములపై హక్కులు, ఐటీడీఏ నర్సరీలో ఉద్యోగాలు కల్పించాలని అధికారులను కోరారు.

News May 9, 2024

మున్నేరులో ముగ్గురు బాలురు గల్లంతు

image

ఖమ్మం గ్రామీణ మండలం ధంసలాపురంలో తీవ్ర విషాదం జరిగింది. మున్నేరులో ఈతకు వెళ్లి ముగ్గురు బాలురు గల్లంతయ్యారు. ఇద్దరి మృతదేహాలు వెలికితీయగా, మరో బాలుడి కోసం గాలిస్తున్నారు.

News May 9, 2024

ఖమ్మం: వైన్స్ బంద్.. బారులు తీరిన మందుబాబులు

image

సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11వ తేదీ నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా మద్యం దుకాణాలు మూతపడనున్నాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో మద్యం ప్రియులు ఇప్పటి నుంచి జాగ్రత్త పడుతున్నారు. దీంతో వైన్ షాపుల దగ్గర రద్దీ వాతావరణం నెలకొంది.

News May 9, 2024

మంత్రి తుమ్మల వాహనం తనీఖీ (VIDEO)

image

పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కోసం భద్రాచలం వెళ్లిన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వాహనాన్ని పోలీసులు తనిఖీ చేశారు. మంత్రి తుమ్మల సిబ్బందికి సహకరించారు. ఎన్నికలలో డబ్బు, మద్యం అక్రమ రవాణా కాకుండా ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల అధికారులు ముమ్మరంగా తనిఖీలు చేస్తున్నారు.

News May 9, 2024

ఆళ్ళపల్లి: పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తున్నాం

image

రానున్న పార్లమెంట్ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ఆళ్ళపల్లి మండల పరిధిలోని పెద్ద వెంకటాపురం గ్రామ ప్రజలు ప్రకటించారు. గురువారం మధ్యాహ్నం తమ గ్రామంలోకి ప్రచారానికి రావద్దు అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. తమ గ్రామంలో సమస్యలు పరిష్కరించడంలో కేవలం ఎన్నికల హామీలు ఇస్తున్నారు.. కానీ పరిష్కరించడం లేదన్నారు. తమ గ్రామం ఎన్నికలప్పుడే గుర్తుకు వస్తుందా అని ప్రశ్నించారు.