Khammam

News May 9, 2024

ఖమ్మం: 2 రోజులు మద్యం దుకాణాలు బంద్

image

ఖమ్మం లోక్ సభ ఎన్నికల వేళ మందుబాబులకు మరోసారి బ్యాడ్ న్యూస్ వినిపించింది. మే 13న పోలింగ్ జరగనుండగా.. మే 11న సాయంత్రం 6 గంటల నుంచి మే 13న సాయంత్రం 6 గంటల వరకు ఉమ్మడి జిల్లాలోని అన్ని వైన్ షాపులు, బార్లు మూసేయాలని అధికారులు అదేశించారు. ఈ రెండు రోజులతో పాటు.. కౌంటింగ్ రోజైన జూన్ 4వ తేదీన కూడా మద్యం దుకాణాలు, బార్లు మూసేయాలని అధికారులు ముందే ఆదేశాలు జారీ చేశారు.

News May 9, 2024

కొత్తగూడెం: చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన కారు

image

ప్రమాదవశాత్తు ఓ కారు చెట్ల పొదల్లోకి దూసుకెళ్లిన ఘటన ఏటూరునాగారంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కొత్తగూడెం జిల్లా పాల్వంచ నుంచి మేడారం దర్శనానికి కారు వెళ్తోంది. ఈ క్రమంలో ఏటూరునాగారంలోని జీడివాగు సమీపంలో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న చెట్ల పొదల్లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న ఐదుగురు ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

News May 9, 2024

కొత్తగూడెం: రోడ్డు ప్రమాదంలో ఏఎన్ఎం మృతి

image

కొత్తగూడెం జిల్లా ములకలపల్లి మండలం మంగపేట PHC పరిధిలోని పొగళ్లపల్లి ఆరోగ్య ఉప కేంద్రంలో ఏఎన్ఎం-1గా విధులు నిర్వహిస్తున్న పుష్పలత(35)గత నెల 27న విధులకు భర్త శ్రీనివాస్‌తో కలిసి బైక్‌పై పాల్వంచ నుంచి బయల్దేరింది. పాతూరు శివారులో ఎదురుగా వచ్చిన స్కార్పియో ఢీకొంది. దీంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఖమ్మంలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పుష్పలత బుధవారం మృతిచెందారు.

News May 9, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
✓ఎన్నికల నిర్వహణపై ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
✓తల్లాడ మండలంలో కాంగ్రెస్ కార్నర్ మీటింగ్
✓ఇల్లందు నియోజకవర్గంలో మాజీ గవర్నర్ తమిళిసై పర్యటన
✓భద్రాద్రి జిల్లాలో మంత్రి తుమ్మల పర్యటన
✓వివిధ శాఖలపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
✓కొత్తగూడెం పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News May 9, 2024

ఇల్లెందులో నేడు తమిళిసై రోడ్ షో

image

మహబూబాబాద్ లోక్‌సభ స్థానం BJP అభ్యర్థి అజ్మీరా సీతారాం నాయక్‌కు మద్దతుగా ఆపార్టీ నాయకురాలు తమిళిసై ఇల్లెందులో నేడు రోడ్ షో నిర్వహించనున్నట్లు పార్టీ నియోజకవర్గ కన్వీనర్ గోపీకృష్ణ బుధవారం తెలిపారు. ఈ రోడ్ షో కార్యక్రమానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున తరలిరావాలని కోరారు.

News May 9, 2024

ప్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్

image

ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా పనిచేయాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ ఎన్నికల వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రసాత్ కృష్ణసామి , శంకర నంద్ మిశ్రాలతో కలిసి ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో రిటర్నింగ్ అధికారి సమీక్ష నిర్వహించారు. పోలింగ్ ప్రక్రియకు దగ్గర పడుతున్నందున నిబంధనలపై అధికారులు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.

News May 8, 2024

త్వరలో రైతు భరోసా: తుమ్మల

image

రైతు భరోసాపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే బడ్జెట్ సమావేశం తర్వాత రైతు భరోసా కింద రూ.15 వేలు ఇస్తామన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు రైతులెవరూ అధైర్యపడొద్దని.. ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. తడిసిన ధాన్యాన్ని మద్దతు ధరకే కొనుగోలు చేస్తామని తెలిపారు. ఇక నుంచి పంటలకు ప్రభుత్వమే బీమా ప్రీమియం చెల్లిస్తుందని.. ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తామని వ్యాఖ్యానించారు.

News May 8, 2024

దమ్మపేట: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

image

రోడ్డుపై కోతుల కారణంగా మహిళ మృతిచెందిన సంఘటన దమ్మపేట మండలంలో చోటుచేసుకుంది. గండుగులపల్లికి చెందిన సునీత(24) అనే మహిళ భర్త పిల్లలతో కలిసి ములకలపల్లి వెళ్తుండగా సుదాపల్లి గ్రామశివారులో రోడ్డుపై ఉన్న కోతుల మంద ఒక్కసారిగా దాడికి యత్నించటంతో వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ క్రమంలో సునీత తలకు తీవ్రగాయం కావడంతో అక్కడిక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.

News May 8, 2024

ఖమ్మం: ట్రాక్టర్ బోల్తా వ్యక్తి మృతి

image

ట్రాక్టర్ బోల్తా పడి ఒక వ్యక్తి మృతి ఘటన బుధవారం కారేపల్లి మండలం పోలంపల్లి వద్ద చోటు చేసుకుంది. ఎస్సై ఎన్.రాజా రామ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లందుకి చెందిన ముళ్లపాటి శ్రీనివాస్(55) పోలంపల్లి సమీపంలో ఇటుక బట్టి నిర్వహిస్తున్నాడు. ట్రాక్టర్ తీసుకొని ఇంటికి వెళుతుండగా పోలంపల్లి వద్ద ట్రాక్టర్ బోల్తా పడింది. దీంతో శ్రీనివాసరావుకు గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు.

News May 8, 2024

పాల్వంచలో వడదెబ్బతో వ్యక్తి మృతి

image

పాల్వంచలోని సీతారాంపట్నంకు చెందిన బోళ్ళ శ్రీనివాసరావు కిరాణా షాప్ నిర్వహిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం శ్రీనివాసరావు ఒక్కసారిగా కళ్లు తిరిగి కింద పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. శ్రీనివాసరావుకు భార్య రాధిక, కుమారుడు సాయికిరణ్ ఉన్నారు.