India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మోదీ అరాచక పాలన సాగిస్తున్నారని రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి విమర్శించారు. బుధవారం నగరంలోని శ్రీశ్రీ హోటల్‌లో జరిగిన ఏఎస్ఆర్ వృక్షం ఇన్ఫ్రా డెవలపర్స్ ఆత్మీయ సమ్మేళనానికి కాంగ్రెస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డితో కలిసి హాజరై ప్రసంగించారు. రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసేందుకు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలన్నారు.
DRDO, DWO, MEPMA వారి సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టరేట్లో ఓటర్ అవేర్నెస్ ‘స్వీప్’ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ ప్రియాంక అలా పాల్గొని మహిళల అందరితో ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటు ఎంతో విలువైనదని, దీనిని గమనించి అర్హులైన మహిళలందరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు
రాష్ట్రంలో కురిసిన అకాల వర్షాల వల్ల తడిసిన ధాన్యం కొనుగోళ్లపై మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు కీలక ప్రకటన చేశారు. బుధవారం ఖమ్మంలో కిసాన్ మోర్చా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన తమ్మల మాట్లాడుతూ.. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు ధాన్యం తడిసిందని రైతులెవరూ అధైర్యపడవద్దని.. ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేస్తుందని హామీ ఇచ్చారు. తమది రైతు ప్రభుత్వమని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం వందల పథకాలు అమలు చేస్తుంటే ఆ పథకాలు కొత్తగూడెం ప్రజలకు అందించే నాయకుడు లేరని బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు. బుధవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో తాండ్ర వినోద్ రావు మాట్లాడారు. తాను ఎంపీగా గెలిస్తే కొత్తగూడెం పట్టణానికి విమానాశ్రయం తెస్తానన్నారు. మోడీ లాగే తనకు రాజకీయ వారసులు లేరని, సేవ చేయడం కోసమే వచ్చానని చెప్పారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు వేసవి సెలవులు ప్రకటించినట్లు మార్కెట్ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 14 (మంగళవారం) నుంచి వచ్చే నెల 5 (బుధవారం) వరకు సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. తిరిగి 6 గురువారం నుంచి మార్కెట్లో పంట క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని తెలిపారు. ఎండల తీవ్రత, కార్మిక సంఘాల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రైతులు గమనించాలన్నారు.
మండుటెండను లెక్కచేయకుండా లోక్ సభకు పోటీ చేసే అభ్యర్థులతో పాటు ప్రధానపార్టీల నేతలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. ప్రచారానికి 4 రోజులే టైం ఉండడంతో అభ్యర్థులు సుడిగాలి పర్యటనలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఖమ్మం నుంచి పోటీ చేస్తున్న కాంగ్రెస్ అభ్యర్థి రాఘురాంరెడ్డి, బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, బీజేపీ అభ్యర్థి వినోదరావులు తమ గెలుపుకు పోటాపోటీగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
వరంగల్- ఖమ్మం- నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు మంగళవారం 14 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, తెలంగాణ సకల జనుల పార్టీ నందిపాటి జానయ్య, అలయన్స్ ఆఫ్ డెమోక్రటిక్ రీఫామ్స్ పార్టీ ఈడ శేషగిరిరావు, శ్రమజీవి పార్టీ జాజుల భాస్కర్, యువతరం పార్టీ నుంచి బండారు నాగరాజు నామినేషన్లు సమర్పించారు. అలాగే, మిగతా వారు స్వతంత్రులుగా నామినేషన్ వేశారు.
ఖమ్మం జిల్లాలో వర్షం బీభత్సం సృష్టించింది. శనివారం నుంచి ప్రతిరోజు ఈదురుగాలులు, వడగళ్ల వర్షం కురుస్తుంది. దీంతో చేతికందే దశలో ఉన్న పంటలకు నష్టం వాటిల్లుతోంది. పలుచోట్ల ఇళ్ల కప్పులు లేచిపోవడమే కాక విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు నేలకూలడంతో ఆస్తి నష్టం జరుగుతోంది. మంగళవారం పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. దీంతో 309 విద్యుత్ స్తంభాలు, తొమ్మిది ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి.
రఘురాంరెడ్డిని ఎంపీగా గెలిపిస్తే ఖమ్మం ప్రజలను తన కుతూరు లాగా జాగ్రత్తగా చూసుకుంటారని సినీ హీరో వెంకటేశ్ అన్నారు. కొత్తగూడెం క్లబ్‌లో మంగళవారం రాత్రి నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమానికి హాజరైనవారు డైలాగ్ చెప్పాలని కోరగా, ‘డైలాగ్‌లు సినిమాలకే పరిమితం. ఇప్పుడంతా ఒకటే డైలాగ్. 13న పోలింగ్ కేంద్రాలకు వెళ్లాలి. రఘురాం రెడ్డికి ఓటెయ్యాలి. అంతే..!’ అని తనదైన శైలిలో చెప్పారు
ఖమ్మం: జిల్లాలో ఎక్కడా త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఎంపిడిఓలు, మునిసిపల్ కమీషనర్లు, ఆర్డబ్ల్యుఎస్ ఇంజనీర్లతో త్రాగునీటి సరఫరాపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. వేసవి దృష్ట్యా అధికారులు త్రాగునీటి సరఫరాపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు.
Sorry, no posts matched your criteria.