Khammam

News April 17, 2024

ఉదయం 9:30 గంటలకే పెళ్లి పనులు మొదలు

image

ఉదయం 9:30 గంటల తర్వాత శంఖ, చక్ర ధనుర్బాణాలను ధరించి సీతతో శ్రీరాముడి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి పల్లకిలో మిథిలా స్టేడియంలోని కల్యాణ మండపానికి తీసుకొస్తారు. వేదికపై సీతారామ లక్ష్మణులను వేంచేపు చేస్తారు. అనంతరం పూజలు చేస్తారు. సీతమ్మను శ్రీరాముడికి ఎదురుగా కూర్చోబెడతారు. ఆపై కళ్యాణం కోసం తయారుచేసిన వస్త్రాలను ధరింప చేస్తారు. లక్ష్మణుడికి రామ మాడను ధరింప చేస్తారు.

News April 17, 2024

KTDM: బస్సు ఆపలేదని ప్రయాణికుల దాడి

image

అశ్వాపురం మండలంలోని కళ్యాణపురంలో ఆర్టీసీ డ్రైవర్‌పై ప్రయాణికులు దాడి చేశాడు. తోటి ప్రయాణికుల వివరాల ప్రకారం.. ఖమ్మం మీదుగా వస్తున్న బస్సులో కళ్యాణపురం గ్రామస్థులు ఎక్కారు. స్టాప్ వద్దకు రాగానే బస్ డ్రైవర్ బస్సు ఆపకుండా ముందుకు వెళ్లాడు. దాంతో ప్రయాణికులకి, బస్ డ్రైవర్ మధ్య వాగ్వాదం జరిగింది. కళ్యాణపురంలో బస్సును ఆపి అద్దాలు ధ్వంసం చేసి డ్రైవర్, కండక్టర్‌పై చేయి చేసుకున్నారు.

News April 17, 2024

అభిజిత్ లగ్నంలో సీతారాముల కళ్యాణం

image

శ్రీ సీతారాముల కళ్యాణానికి భద్రాచలం ముస్తాబైంది. చైత్ర శుద్ధ నవమి అభిషేక్ లగ్నం మధ్యాహ్నం 12 గంటలకు కాస్త అటు ఇటుగా రావడం పరిపాటి. ముహూర్త సమయం కాగానే వధూవరులైన సీతారాముల తలపై జీలకర్ర బెల్లం ఉంచుతారు. తరువాత శ్రీరామదాసు చేయించిన మూడు బొట్లు ఉన్న మంగళసూత్రానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మూడు సూత్రాలు ఉన్న తాళిని సీతమ్మ వారి మెడలో కట్టడంతో కళ్యాణ వేడుక కీలక ఘట్టం ముగుస్తుంది.

News April 17, 2024

ఖమ్మం: దంపతుల సూసైడ్ అటెంప్ట్.. భార్య మృతి

image

కల్లూరు చెందిన దంపతులు మంగళవారం రాత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. భార్య మృతి చెందగా భర్త పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి. బియ్యం వ్యాపారి చల్ల నరసింహారావు, ఆయన భార్య పుష్పావతి(40) ఇంట్లోనే పురుగుల మందు తాగారు. స్థానికులు చూసేసరికి పుష్పావతి మృతి చెంది ఉంది. నరసింహారావును ఆసుపత్రికి తరలించారు. ఎస్సై షాకీర్ ఘటన స్థలానికి చేరుకొని వివరాలు ఆరా తీస్తున్నారు.

News April 17, 2024

కొత్తగూడెం: బాలికతో పెళ్లి.. పోక్సో కేసు నమోదు

image

చండ్రుగొండ మండలంలోని ఓ మైనర్ బాలికను వివాహం చేసుకున్న వ్యక్తితో పాటు దానికి సహకరించిన మరో ఇద్దరు నిందితులను పోక్సో కేసులో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయ్యన్నపాలెంకి చెందిన సాంబశివరావు, సంగీత్, పెనుబల్లి మండలం చిన్నమ్మ గూడెంకు చెందిన వెంకటేశ్వర్లును అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు చండ్రుగొండ ఎస్ఐ మాచినేని రవి తెలిపారు.

News April 17, 2024

శ్రీరామనవమి వేడుకల విధుల్లో నిర్లక్ష్యం వద్దు: ఎస్పీ

image

శ్రీరామనవమి వేడుకల బందోబస్తులో నిర్లక్ష్యం వహించొద్దని ఎస్పీ రోహిత్‌రాజ్‌ సిబ్బందికి సూచించారు. భద్రాచలం టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఆయన సిబ్బందితో సమావేశమై పలు సూచనలు చేశారు. భక్తులకు అసౌకర్యం కలిగించకుండా అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో పని చేయాలని చెప్పారు. సమావేశంలో ఏఎస్పీలు సాయిమనోహర్‌, పరితోష్‌ పంకజ్‌, ఏఆర్‌ ఏఎస్పీ విజయబాబు, ట్రైనీ ఐపీఎస్‌ విక్రాంత్‌ సింగ్‌ పాల్గొన్నారు.

News April 17, 2024

హెచ్‌సీఏ ఆధ్వర్యాన ఉచిత క్రికెట్‌ శిక్షణ

image

హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్ సౌజన్యంతో ఖమ్మంలోని పటేల్‌ స్టేడియం, కొత్తగూడెంలోని గౌతంపూర్‌ మైదానంలో ఉచిత క్రికెట్‌ శిక్షణ శిబిరాలు నిర్వహించనున్నారు. భద్రాద్రి జిల్లా బాలబాలికలు www.hydcricket Asssociation (HCA) వెబ్‌సైట్‌లో పేర్లు నమోదు చేసుకోవాలని, ఖమ్మం జిల్లాకు సంబంధించి నెట్స్‌ మేనేజర్‌ ఎం.డీ.ఫారూఖ్‌ను సంప్రదించాలని తెలిపారు. 

News April 17, 2024

ఖమ్మం: ఆర్టీసీకి ఆదాయం అదుర్స్

image

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణికుల రద్దీ పెరుగుతుండడంతో సంస్థకు అదే స్థాయిలో ఆదాయం సమకూరుతోంది. ఈనెల 4వ తేదీన ఖమ్మం రీజియన్‌ నుంచి సంస్థకు రూ.1.35 కోట్లు ఆదాయం రాగా, సోమవారం అంతకుమించి రూ.1.50 కోట్లు ఆదాయం సమకూరింది. ఎండల తీవ్రత అధికంగా ఉన్నా శుభకార్యాలు, ఇతర పనుల కోసం ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తుండడం ఆదాయం పెరగడానికి కారణంగా అధికారులు చెబుతున్నారు

News April 17, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్యాంశాలు

image

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా శ్రీరామనవమి వేడుకలు
∆} ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
∆} ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యాటన
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన

News April 17, 2024

కరెంటు కోతలు అసత్య ప్రచారం: భట్టి

image

రాష్ట్రంలో కరెంటు కోతలున్నాయని ప్రతిపక్షాలు చేస్తున్న ప్రచారం బూటకమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక నాణ్యమైన కరెంటు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. ఎక్కడా పవర్ కట్లు లేవన్నారు. పదే పదే ప్రభుత్వాన్ని కూల్చుతామనడం బీఆర్ఎస్ పార్టీకి సరికాదన్నారు. అక్కడ విధానాలు నచ్చకే కాంగ్రెస్లోకి వస్తున్నారని పేర్కొన్నారు.