Khammam

News April 16, 2024

రేపు వ్యవసాయ మార్కెట్‌కు సెలవు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు బుధవారం సెలవు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఈ నెల 17న శ్రీరామనవమి సందర్భంగా సెలవు ప్రకటించినట్లు తెలిపారు. తిరిగి 18న (గురువారం) నుంచి మార్కెట్లో పంట క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని పేర్కొన్నారు. జిల్లా రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని కోరారు.

News April 16, 2024

రోడ్డు ప్రమాదం.. వ్యక్తి మృతి

image

జూలూరుపాడు మండలం పడమట నర్సాపురంలో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న కిలారు నరసింహారావు అనే వ్యక్తి మృతి చెందాడు. బేతాళపాడుకి చెందిన కిలారు నరసింహారావు అనే వ్యక్తి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా ఆటో ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు.

News April 16, 2024

రామయ్య కళ్యాణానికి వైభవంగా ముస్తాబైన మిథిలా స్టేడియం

image

భద్రాద్రిలో సీతారాముల కళ్యాణానికి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. రేపు కళ్యాణానికి మిథిలా స్టేడియం వైభవంగా ముస్తాబైంది. ఇప్పటికే శ్రీరామ నామస్మరణతో భద్రాచలం పురవీధులు మార్మోగుతున్నాయి. అటు పోలీస్ శాఖ 2 వేల మందితో భారీ బందోబస్తు నిర్వహిస్తుంది. ఇరు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు భద్రాద్రి చేరుకుంటున్నారు.

News April 16, 2024

కొత్తగూడెం ఎమ్మెల్యే పై కేసు నమోదు

image

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుపై పాల్వంచ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల కోడ్ పాటించకుండా నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే సమావేశం నిర్వహిస్తున్నారంటూ బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎర్ర కామేశ్ ఎన్నికల అధికారి వికాస్ రాజుకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఫిర్యాదుతో పాల్వంచ ఎంపీడీవో విజయ భాస్కర్ రెడ్డి ఆదేశాల మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

News April 16, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ. 20,000 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,350 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈ రోజు మిర్చి ధర రూ.500, పత్తి ధర రూ.50 పెరిగినట్లు వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్లో రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.

News April 16, 2024

KMM:ఆన్ లైన్‌లో రాములవారి తలంబ్రాలు

image

భద్రాచలంలో ఈ నెల 17న శ్రీరామ నవమి సందర్బంగా జరిగే శ్రీసీతారామచంద్రుల వారి కల్యాణ తలంబ్రాలను ఆన్లైన్లో బుకింగ్ చేసుకునే సదుపాయాన్ని ఆర్టీసీ కల్పించింది. సంస్థ లాజిస్టిక్స్ విభాగ వైబ్ సైట్ tsrtclogistics.in సందర్శించి విశిష్టమైన రాములోరి కల్యాణ తలంబ్రాలను పొందవచ్చు. ఆఫ్లైన్లో తలంబ్రాల సేవను పొందాలనుకునే భక్తులు టీఎస్ఆర్టీసీ కాల్ సెంటర్ ఫోన్ నంబర్లపై 040-23450033ను సంప్రదించాలన్నారు.

News April 16, 2024

నాగారం ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్ వేటు!

image

నిత్యం బడికి డుమ్మాకొడుతూ, విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ మధ్యాహ్న భోజన బిల్లులు స్వాహా చేసిన ఓ ఉపాధ్యాయుడిపై సస్పెన్షన్‌ వేటు పడింది. గుండాల మండలంలోని నాగారం ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు శంకర్‌ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టకుండానే ఏడాది కాలంగా బిల్లులు స్వాహా చేస్తున్నాడు. సదరు ఉపాధ్యాయుడిని సస్పెండ్‌ చేస్తూ జిల్లా విద్యాధికారి వెంకటేశ్వరాచారి ఉత్తర్వులు జారీ చేశారు.

News April 16, 2024

భద్రాచలంలో బందోబస్తుకు 2వేల మంది పోలీస్‌ సిబ్బంది

image

భద్రాచలంలో 17, 18 తేదీలో జరిగే శ్రీరామనవమి, పట్టాభిషేకం వేడుకలకు రెండు వేల మంది పోలీస్‌ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ రోహిత్‌రాజ్‌ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. సీతారాముల కల్యాణానికి వీవీఐపీ, వీఐపీలతో పాటు సామాన్య భక్తులు అధిక సంఖ్యలో వస్తారని భద్రత దృష్ట్యా ఇప్పటి నుంచే కూంబింగ్‌ చేస్తున్నామని తెలిపారు.

News April 16, 2024

పొంగులేటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కాంగ్రెస్ అధిష్ఠానం?

image

ఖమ్మం పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరనేది క్లారిటీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల రేసులో పలువురు ఉండగా తాజాగా కాంగ్రెస్ అధిష్ఠానం పొంగులేటి ప్రసాద్ రెడ్డిని ఫైనల్ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. ప్రసాద్ రెడ్డి పేరును అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని ఆ పార్టీ నాయకులు తెలిపారు. కాగా అధికార పార్టీ అభ్యర్థి ప్రకటనతో జిల్లాలో ఎన్నికల ప్రచారం ఊపొందుకోనుంది.

News April 16, 2024

నేడు భద్రాద్రిలో ఎదుర్కొలు ఉత్సవం

image

నేడు భద్రాద్రిలో ఎదుర్కొలు ఉత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. రాత్రి 7 గంటల నుంచి 11 వరకు ఈ వేడుక ఉంటుంది. సీతారాములవారి గుణాలను వివరించే తీరు మంత్రముగ్ధులను చేస్తుంది. సీతమ్మవారి వైపు ఒకరు, రామయ్యతండ్రి వైపు ఇంకొకరు ఉండి ఇరు వంశాల గొప్పలను సుభాషించే తీరు ఆద్యంతం సంతోషాలను పంచుతుంది. ఈ ఉత్సవం తర్వాత స్వామివారి తిరువీధి సేవ ఉంటుంది.