Khammam

News April 16, 2024

ఖమ్మం: ఈనెల 18 నుండి నామినేషన్ల స్వీకరణ

image

ఈ నెల 18 నుండి పార్లమెంట్ ఎన్నికల నామినేషన్లను స్వీకరించనున్నట్లు ఖమ్మం ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. కలెక్టరేట్ లోని కాన్ఫరెన్స్ హాల్లో గుర్తింపు పొందిన రాజకీయపార్టీల ప్రతినిధులతో జిల్లా ఎన్నికల అధికారి సమావేశం ఏర్పాటుచేసి, నామినేషన్ల ప్రక్రియపై అవగాహన కల్పించారు. 18 నుండి 25 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందన్నారు. నామినేషన్ వేసే అభ్యర్థికి 3 వాహనాలు మాత్రమే అనుమతి ఉందన్నారు.

News April 15, 2024

వైరా: నీటితొట్టెలో పడి చిన్నారి మృతి

image

నీటితొట్టిలో పడి చిన్నారి మృతిచెందిన ఘటన వైరా మండలం కేజీ సిరిపురంలో చోటుచేసుకుంది. కూరాకుల గోపి, భవాని దంపతులకు ఇద్దరు కుమారులు. వృత్తి రీత్యా తండ్రి కూరాకుల గోపి ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. తల్లి వైరాలోని ఒక షాపులో వర్కర్ గా పని చేస్తుంది. ఈ క్రమంలో చిన్న కుమారుడు యశ్వంత్ (16 నెలలు) వారి ఇంటి వద్ద ఆడుకుంటూ ఉన్న సమయంలో అదుపుతప్పి సమీపంలో ఉన్న నీటితొట్టిలో పడిపోయి మృతి చెందాడు

News April 15, 2024

ఖమ్మం: శ్రీరామనవమికి 238 ప్రత్యేక బస్సులు

image

భద్రాచలంలో ఈ నెల 17న జరగబోయే శ్రీసీతారాముల కళ్యాణ మహోత్సవానికి మొత్తం 238 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఖమ్మం రీజినల్ మేనేజర్ వెంకన్న తెలిపారు. అన్ని ప్రధాన బస్టాండ్‌ల నుంచి ఏప్రిల్ 16 నుండి ఏప్రిల్ 18 వరకు ఈ బస్సులు నడపనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులలో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం ఉంటుందన్నారు. హైదరాబాద్ నుండి భద్రాచలానికి రిజర్వేషన్ సౌకర్యం కలదని పేర్కొన్నారు.

News April 15, 2024

భద్రాచలం వద్ద రెండో బ్రిడ్జిని ప్రారంభించిన కలెక్టర్

image

భద్రాచలం గోదావరి నదిపై నిర్మించిన రెండవ వంతెనను జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా, ఎస్పీ సోమవారం మధ్యాహ్నం లాంఛనంగా ప్రారంభించారు. 2014లో అప్పటి రోడ్లు భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంతెనకు శంకుస్థాపన చేశారు. పదేళ్లుగా నిర్మిస్తున్న ఈ వంతెనను శ్రీరామనవమి నాటికి ప్రారంభిస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. వంతెనను రూ. 100 కోట్ల వ్యయంతో 2 కీ.మీ పొడవు నిర్మించారు.

News April 15, 2024

క్యూ ఆర్ కోడ్ రిలీజ్ చేసిన భద్రాద్రి జిల్లా ఎస్పీ

image

శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో ట్రాఫిక్ రూట్, పార్కింగ్ స్థలాలు, తలంబ్రాలు, లడ్డూ ప్రసాదం స్టాల్స్, కల్యాణ మండపం యొక్క సెక్టార్ ప్లాన్ కు సంబంధించిన పూర్తి సమాచారం కోసం క్యూఆర్ కోడ్ ని స్కాన్ చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ క్యూఆర్ కోడ్ లో పూర్తి సమాచారం లభిస్తుందని తెలిపారు.

News April 15, 2024

కొత్తగూడెం: ప్రాణం తీసిన ఈత సరదా

image

స్నేహితులతో సరదాగా ఈతకు వెళ్లిన ఓ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన కొత్త అంజనాపురం గ్రామంలో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన వినోద్‌(17) కొత్తగూడెంలోని ప్రభుత్వ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం స్నేహితులతో కలిసి స్థానిక చేపల చెరువుకు ఈతకు వెళ్లాడు. ఈత కొడుతూ.. ప్రమాదవశాత్తు చెరువులో మునిగి మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు.

News April 15, 2024

WOW.. భద్రాచలం సీతమ్మవారికి త్రీడీ చీర

image

భద్రాచలంలోని సీతమ్మవారికి రంగులు మారే త్రీడీ చీరను రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన చేనేత కళాకారుడు నల్ల విజయ్ రూపొందించారు. ఐదున్నర మీటర్ల పొడవు, 48 అంగుళాల వెడల్పు ఉన్న ఈ చీర బరువు 600 గ్రాములు. 18 రోజులు శ్రమించి బంగారు, వెండి, ఎరుపు వర్ణాలతో తయారు చేసినట్లు విజయ్ తెలిపారు. ఈ చీరను మంగళవారం భద్రాచలం సీతమ్మకు కానుకగా అందించనున్నట్లు వెల్లడించారు.

News April 15, 2024

ఖమ్మం: ఓటు నమోదుకు నేటితో ముగియనున్న గడువు

image

ఓటు హక్కును నమోదు చేసుకునేందుకు నేటితో గడువు ముగియనుంది. ఏప్రిల్‌ 1వ తేదీ నాటికి 18 ఏళ్లు నిండినవారు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. కొత్తగా నమోదు చేసుకునేవారు మే నెల 13న జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశముంది. ముఖ్యంగా 18 ఏళ్లు నిండిన ఇంటర్మీడియట్‌, డిగ్రీ, ఇంజినీరింగ్‌ విద్యార్థులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

News April 15, 2024

దమ్మపేట: ప్రమాదవశాత్తు కుంటలో పడి వ్యక్తి మృతి

image

తాగునీటి కోసం వ్యవసాయ క్షేత్రంలో గల నీటికుంట వద్దకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు అందులో పడి మృతిచెందిన ఘటన భద్రాద్రి(D) దమ్మపేట(M) అల్లిపల్లిలో జరిగింది. గంగుల గూడెం గ్రామానికి చెందిన పెనుబల్లి నాగరాజు మరో ఐదుగురితో కలిసి ఆదివారం అల్లిపల్లి గ్రామంలో కొబ్బరి బొండాలు కోత కోసే పనికి వెళ్లాడు. నాగరాజుకు దాహం వేయగా, అదే తోటలో ఉన్న నీటి కుంట వద్దకు వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలు జారిపడి మృతి చెందాడు.

News April 15, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓పలు శాఖలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యాటన
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
✓మణుగూరు పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
✓సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
✓అశ్వారావుపేటలో BJP కార్యకర్తల సమావేశం