Khammam

News April 15, 2024

ఖమ్మం: వ్యవసాయ మార్కెట్ నేడు పునఃప్రారంభం

image

నాలుగు రోజుల సుదీర్ఘ విరామం అనంతరం ఖమ్మం వ్యవసాయ మార్కెట్ సోమవారం పునఃప్రారంభం కానుంది. గురువారం, శుక్రవారం రంజాన్ సెలవులు, శని, ఆదివారాలు వారాంతపు సెలవుల కారణంగా మార్కెట్ బంద్ ఉంది. దీంతో ఈరోజు మార్కెట్ ప్రారంభం కానుండగా.. నాణ్యమైన సరుకులు తీసుకుని వచ్చి మంచి ధర పొందాలని అధికారులు సూచించారు.

News April 15, 2024

నేడు భద్రాద్రిలో ధ్వజారోహణం

image

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి దేవస్థానంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలలో భాగంగా నేడు ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం బ్రహ్మోత్సవాలలో చాలా ముఖ్యమైనది. సంతానం లేని స్త్రీలకు గరుడ ప్రసాదం ఇస్తారు. ఈ ప్రసాదం తినడం వలన సంతానం కలుగుతుందనే నమ్మకంతో వేలాదిమంది సంతానార్ధులైన స్త్రీలు భద్రాద్రి వస్తారు.

News April 15, 2024

ఎన్నికల సహాయక కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలి : కలెక్టర్

image

లోకసభ ఎన్నికలు-2024 సహాయక కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన లోకసభ ఎన్నికల సహాయక కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. లోక్ సభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థుల సహాయార్థం సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కేంద్రంలో ఎన్నికల సంఘం నుండి పంపబడిన నామినేషన్ పత్రాలు అభ్యర్థులకు అందుబాటులో ఉంచినట్టు తెలిపారు.

News April 14, 2024

‘ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బందికి సెలవులు రద్దు’

image

రానున్న లోక్ సభ ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది సెలువులు కోరితే ఇవ్వవద్దని గతంలో పెట్టుకున్న సెలవులను రద్దు చేస్తున్నట్లు ఖమ్మం జిల్లా కలెక్టర్ గౌతమ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల విధులు కేటాయించిన సిబ్బంది తమకు సెలవులు కావాలని కోరుతున్నారని ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు ఎటువంటి సెలవలు మంజూరు చెయ్యొద్దని అన్ని శాఖల అధికారులకు తెలియజేశారు.

News April 14, 2024

విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించారు: భట్టి

image

విద్యుత్ రంగాన్ని భ్రష్టు పట్టించిన కేసీఆర్ చేవెళ్ల సభలో పచ్చి అబద్ధాలు మాట్లాడారని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విమర్శించారు. మిగులు బడ్జెట్‌తో ఉన్న రాష్ట్రాన్ని లక్షల కోట్ల అప్పులపాలు చేశారని మండిపడ్డారు. అదనంగా ఎకరం భూమికి కూడా నీరు ఇవ్వని కాళేశ్వరానికి ఏడాదికి రూ.10 వేల కోట్ల విద్యుత్ బిల్లులు కట్టేలా చేశారని ఆరోపించారు. ఒక్క గంట కూడా కరెంట్ పోకుండా సరఫరా చేస్తున్నాం అని మోసం చేశారన్నారు.

News April 14, 2024

ఏపీ సీఎంపై దాడి.. స్పందించిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క

image

ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏపీ సీఎం జగన్‌పై రాళ్ల దాడి జరిగిన విషయం తెలిసిందే. దీంతో సీఎం జగన్ కనుబొమ్మపైన గాయమైంది. దీనిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. ఖమ్మం పర్యటనలో ఉన్న ఆయన అక్కడ మీడియాతో మాట్లాడుతూ.. ప్రచారంలో హింసతో కూడిన కార్యక్రమాలు మంచివి కాదన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా ఇలాంటి ఘటనలను ఎవరూ సమర్థించరన్నారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకోవాలన్నారు.

News April 14, 2024

ఫోన్ ట్యాపింగ్‌‌లో ఉన్న వారు ఎంతటి వారైనా వదిలేది లేదు: మంత్రి

image

ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడ్డ వారిపై విచరణ జరుగుతుంది. ఆధారాలతో సహా బయటికి వస్తాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. వైరాలో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతూ.. టాపింగ్ వ్యవహారంలో సంబంధం ఉన్న ఎంతటి పెద్దవారైనా జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిందే అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటే కరువు అని ప్రగల్భాలు పలుకుతున్న నాయకులు కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి కనీసం తాగునీరు కూడా ఇవ్వలేదు అన్నారు.

News April 14, 2024

ఖమ్మం: బీఆర్ఎస్‌పై డిప్యూటీ సీఎం భట్టి ఫైర్

image

10 ఏళ్లు అధికారంలో ఉండి సెక్రటేరియట్‌కు రాకుండా ప్రజలను కలవకుండా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసిన గత బీఆర్ఎస్ పాలకులు ఇప్పుడు నీతి సూత్రాలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఖమ్మం కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యుత్తు రంగాన్ని గందరగోళంలోకి నెట్టేసి, రూ.7 లక్షల కోట్ల అప్పులు చేసి ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసిందన్నారు.

News April 14, 2024

నేడు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ప్రకటన!

image

ఖమ్మం కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థిపై నేడు స్పష్టత రానున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ స్థానానికి తీవ్ర పోటీ నెలకొనడంతో అభ్యర్థి ఎంపిక ఆలస్యమైంది. ఇప్పటికే ఇక్కడ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరావును ప్రకటించగా.. బీజేపీ ఎంపీ అభ్యర్థిగా తాండ్ర వినోద్ రావు బరిలో ఉన్నారు. ఓ వైపు వారు ప్రచారం చేసుకుంటుండగా.. కాంగ్రెస్ అభ్యర్థి ఎవరని ఆ పార్టీ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. దీనిపై మీ కామెంట్.

News April 14, 2024

ఖమ్మం: అనారోగ్యంతో ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి

image

ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన చింతూరు మండలంలో శనివారం చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతూరు మండలం మోతుగూడెం పంచాయతీ సుకుమామిడి మండల పరిషత్ యూపీ పాఠశాల ఉపాధ్యాయుడు కనకారావు(59) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు తెలిపారు.