Khammam

News May 4, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యంశాలు

image

> తిరుమలాయపాలెంలో మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి పర్యటన
> కొత్తగూడెంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బహిరంగ సభ
> సత్తుపల్లిలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి పర్యటన
> కామేపల్లిలో సీపీఎం మండల కమిటీ సమావేశం
> ఖమ్మం జిల్లాలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క పర్యటన
> కూసుమంచిలో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి పర్యటన

News May 4, 2024

ఖమ్మం: రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపు (REWIND)

image

లోక్‌సభ ఎన్నికలు మరో వారం రోజులుండగానే.. ఇటీవల ఖాళీ అయిన నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ ఎమ్మెల్సీ ఎన్నిక సందడి మొదలైంది. కాగా 2021లో గెలిచిన పల్లా రాజేశ్వర్ రెడ్డి జనగామ ఎమ్మెల్యేగా గెలవడంతో తాజా ఎన్నిక అనివార్యమైంది. ఆ ఎన్నికల్లో గెలుపుకోసం 1,83,167 ఓట్లు అవసరం కాగా మొదటి ప్రాధాన్యతా ఓట్లలో ఎవరికీ 50శాతానికి మించి రాలేదు. దీంతో రెండో ప్రాధాన్యత ఓట్లతో పల్లా గెలిచారు.

News May 4, 2024

ఈనెల 7న ఖమ్మంలో విక్టరీ వెంకటేష్ రోడ్ షో

image

ఖమ్మం నగరంలో ఈనెల 7న సా. 5 గంటలకు సినీ హీరో విక్టరీ వెంకటేష్ కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ రోడ్ షో నిర్వహిస్తారని కాంగ్రెస్ నేతలు తెలిపారు. విక్టరీ వెంకటేష్ రోడ్ షోలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ప్రజలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని జిల్లా నేతలు పేర్కొన్నారు. కాగా రఘురాం రెడ్డికి విక్టరీ వెంకటేష్‌కు వరుసకు వియ్యంకుడు.

News May 3, 2024

నేరాల నియంత్రణకు నిఘా వ్యవస్థ పటిష్ట పరచాలి: సీపీ

image

నేరాల నియంత్రణకు పోలీస్ పెట్రోలింగ్, నిఘా వ్యవస్థను మరింత పటిష్ట పరచాలని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అన్నారు. శుక్రవారం పోలీస్ కమిషనర్ కార్యాలయంలో వైరా డివిజన్ పోలీస్ అధికారులతో నేర సమీక్ష సమావేశం జరిగింది. పోలీస్ స్టేషన్ల వారిగా నమోదైన గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసుల్లో చేసిన దర్యాప్తు, విచారణ స్థితిగతులు, పెండింగ్ కేసుల పురోగతిపై పోలీస్ కమిషనర్ సమీక్ష జరిపారు.

News May 3, 2024

‘కాంగ్రెస్ కోఆర్డినేటర్ల జాబితా విడుదల’

image

కాంగ్రెస్ పార్లమెంటరీ నియోజకవర్గ కోఆర్డినేటర్ల జాబితా విడుదల చేసింది. పాలేరు స్వర్ణకుమారి (కాంగ్రెస్) సరళ (సిపిఎం) సురేష్ (CPI), ఖమ్మం జావేద్ (కాంగ్రెస్) శ్రీకాంత్ (CPM) జితేందర్ రెడ్డి (CPI), మధిర శ్రీనివాసరెడ్డి (కాంగ్రెస్) వేంకటేశ్వర్లు (CPM) జలందర్ రెడ్డి (CPI), వైరా రోశయ్య (కాంగ్రెస్) వీరభద్రం (CPM) బాబు (CPI), సత్తుపల్లి నరసింహారావు (కాంగ్రెస్) భారతి (CPM), ఆదినారాయణ (CPI)లను నియమించారు.

News May 3, 2024

ఖమ్మం: ఎర్లీ బర్డ్ రాబడి రూ.15.15 కోట్లు

image

ఐదు శాతం రాయితీతో ఆస్తి పన్ను చెల్లింపునకు పురపాలక శాఖ అవకాశం కల్పించిన నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నగర, పురపాలికల్లో ప్రజల నుంచి మంచి స్పందన లభించింది. ఈ అవకాశాన్ని 26,646 మంది భవన యజమానులు వినియోగించుకున్నారు. తద్వారా ఆయా నగర, పురపాలికలకు రూ.15.15 కోట్ల ఆదాయం సమకూరింది. అత్యధికంగా ఖమ్మం నగరపాలిక సంస్థ రూ.9.73 కోట్లు, అత్యల్పంగా ఇల్లెందు రూ. 30 లక్షలు వసూలు చేసింది.

News May 3, 2024

‘పిడుగుపాటుకు రైతు మృతి’

image

ములకలపల్లి: పూసుగూడెం గ్రామపంచాయతీ ఒడ్డు రామవరం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. ఈ క్రమంలో మార్కెట్ యార్డులో ఉన్న బోడ శివరాం అనే రైతు పిడుగుపాటుకు గురై మరణించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో గుగులోతు శ్రీను అనే మరో రైతుకు గాయాలయ్యాయి. పాల్వంచ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

News May 3, 2024

నిరుద్యోగుల పక్షాన నిలబడతా: పాలకూరి అశోక్

image

గెలిచినా.. ఓడినా నిరుద్యోగుల పక్షాన నిలబడతానని NLG- KMM-WGL స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి పాలకూరి అశోక్ కుమార్ అన్నారు. నల్లగొండలో ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వంలో 12 క్రిమినల్ కేసులు, చంచల్ గూడ జైలు జీవితం గడిపిన తాను విద్యార్థుల కోసం ఐదు రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశానని నిరుద్యోగులు తమకు మద్దతుగా నిలబడతానన్నారు. తనను గెలిపిస్తే అసెంబ్లీలో నిరుద్యోగుల పక్షాన ప్రశ్నించే గొంతుకనవుతానన్నారు.

News May 3, 2024

భద్రాద్రి రామయ్యకు స్వర్ణ కవచాలంకరణ

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో స్వామివారికి శుక్రవారం స్వర్ణ కవచాలంకరణ నిర్వహించారు. ముందుగా  ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, అభిషేకం నిత్య బలిహరణం, తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం మండపంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు.

News May 3, 2024

ఖమ్మం: కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఐదు ఏపీ గ్రామాల విలీనం 

image

తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల వేళ కాంగ్రెస్ ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ పునర్వవస్థీకరణ చట్టం 2014 ప్రకారం ఆంధ్రాలో విలీనం అయిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణలో విలీనం చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొంది. ఎటపాక , గుండాల, పురుషోత్తం  పట్నం, కన్నెగూడెం , పిచ్చుకలపాడు గ్రామాలను తెలంగాణలో విలీనం చేస్తామని హామీ ఇచ్చింది.