Khammam

News May 3, 2024

కొత్తగూడెం: కుటుంబ కలహాలతో వ్యక్తి ఆత్మహత్య

image

బూర్గంపాడు మండలం సారపాకలో కుటుంబ కలహాల నేపథ్యంలో అమర్ జీవ్ అనే వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. స్థానికుల నుంచి పలు వివరాలు సేకరించారు. ఆత్మహత్యకు గల కారణాలు, పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News May 3, 2024

ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల బరిలో గెలిచేది ఎవరు?

image

ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల బరిలో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, BRS, BJP అభ్యర్థులు తలపడనున్నారు. ఇప్పటికే ఆయా పార్టీల ఎంపీ అభ్యర్థులు కార్నర్ మీటింగ్, ఆత్మీయ సమ్మేళనాలతో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. అటు రేపు కొత్తగూడెంలో సీఎం రేవంత్ రెడ్డి సభ ఉంది. తానంటే తాను స్థానికుడని తనను ప్రజలు ఓటు వేసి గెలిపించాలని ఆయా పార్టీల అభ్యర్థులు ప్రజలను వేడుకుంటున్నారు. కాగా ఎన్నికల బరిలో గెలిచేది ఎవరు కామెంట్ చేయండి.

News May 3, 2024

‘బీజేపీ గెలిచే 400 సీట్లలో ఖమ్మం ఒకటిగా ఉండాలి’

image

బీజేపీ గెలిచే 400 సీట్లలో ఖమ్మం సైతం ఒకటిగా ఉండాలని ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు. ఖమ్మం 2టౌన్ లో శుక్రవారం జరిగిన రోడ్ షోలో అయన మాట్లాడుతూ.. కుటుంబ రాజకీయాలతో ఇక్కడ ప్రజలు ఎన్నో బాధలు పడుతున్నారని, అభివృద్ధికి ఖమ్మం జిల్లా ఆమడ దూరంలో ఉన్నదని అన్నారు. తనకు ఈసారి ఎంపీగా అవకాశం ఇస్తే కేంద్రం నుండి ప్రత్యేక నిధులతో ఖమ్మం అభివృద్ధి చేసేలా తాను చూసుకుంటానని అన్నారు.

News May 3, 2024

పట్టభద్రులై ఉండి ఓటు చెల్లలేదు

image

2021లో జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో 5,05,565 మందికి 3,87,969 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. వీరిలో 21,636 మంది ఓట్లు చెల్లకపోవటం గమనార్హం. సాధారణ ఓటుహక్కు మాదిరిగా కాకుండా పట్టభద్రులు తమ ఓటుహక్కును ప్రాధాన్య క్రమంలో వినియోగించుకోవాలి. అంటే పోటీలో నిలిచిన అభ్యర్థులకు ప్రాధాన్య క్రమంలో ఓటేయాలి. ఈ విధానంపై కొందరికి అవగాహన లేకపోవటంతో వారి ఓట్లు చెల్లకుండా పోతున్నాయి.

News May 3, 2024

ఖమ్మం జిల్లాలో పెరుగుతున్న పొలిటికల్ హీట్!

image

లోక్ సభ ఎన్నికల గడువు తేదీ దగ్గర పడుతుండడంతో ఖమ్మం జిల్లాలో ప్రచారం ఊపందుకుంది. అన్ని రాజకీయ పార్టీలు ప్రచారాన్ని వేగవంతం చేశాయి. విమర్శలు, ప్రతి విమర్శలు చేస్తూ ఓటర్లు ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బిజెపి, బీఆర్ఎస్ పార్టీలు తమ ప్రచారాలకు మరింత పదును పెట్టాయి. ఆయా పార్టీల అధినేతలు కూడా ప్రచారానికి వస్తుండడంతో జిల్లాలో పొలిటికల్ హీట్ మరింత పెరుగుతోంది.

News May 3, 2024

ఖమ్మం MP బ్యాలెట్ నమూనా విడుదల

image

ఖమ్మం లోక్‌సభ నియోజకవర్గ ఎన్నికల నమూనా బ్యాలెట్‌ను గురువారం ఎన్నికల అధికారులు అధికారికంగా విడుదల చేశారు. వారు మాట్లాడుతూ.. ఖమ్మంలో 32 మంది పోటీలో ఉన్నట్లు తెలిపారు. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. 

News May 3, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో నేటి ధరలు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,500 జెండాపాట పలకగా, క్వింటా నాన్ ఏసీ మిర్చి ధర రూ. 19,050 జెండాపాట పలికింది. అలాగే, పత్తి ధర రూ.7, 100జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు మిర్చి, పత్తి ధరలు స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్తులు తెలిపారు. రైతులు మార్కెట్ నిబంధనలు పాటించాలని సూచించారు.

News May 3, 2024

పట్టభద్రుల పోలింగ్ శాతం ఈసారైనా పెరిగేనా..

image

ఓటర్లను పోలింగ్‌ కేంద్రాలకు రప్పించేలా ఈసీ చర్యలు తీసుకుంటోంది. 2015లో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల పట్టభద్రుల స్థానంలో 54.62 శాతం పోలింగ్‌ నమోదైతే 2021లో 76.35శాతానికి పెరిగింది. ఈసారి పట్టభద్రుల ఓటర్లు తగ్గటంతో పోలింగ్‌ శాతం ఏ మేరకు నమోదవుతుందనే అంశంపై ఆసక్తి నెలకొంది.

News May 3, 2024

KMM: ప్రభుత్వ ఆసుపత్రుల్లో పెరుగుతున్న ప్రసవాలు!

image

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. గతంలో ఈ ఆస్పత్రిలో కాన్పులు చేయించుకోవడానికి వెళ్లాలంటే గర్భిణులు భయపడేవారు. కానీ, ప్రస్తుతం ప్రభుత్వం ఆస్పత్రులను ఆధునీకరించి అత్యాధునిక పరికరాలతో పాటు మౌలిక వసతులు కల్పిస్తూ.. అన్నిరకాల పరీక్షలు చేస్తూ మెరుగైన వైద్యం అందిస్తోంది. ఈ నేపథ్యంలో గర్భిణులు ప్రభుత్వాస్పత్రుల్లో ప్రసవాలు చేయించుకునేందుకు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.

News May 3, 2024

వేసవిలో స్పెషల్ ట్రైన్ల జాడేది?

image

ఏటా వేసవి కాలంలో రైల్వే శాఖ ప్రధాన ప్రాంతాలకు అనుసంధానం చేసేలా ప్రత్యేక రైళ్లను నడిపించేది. కానీ ఈ ఏడాది ప్రత్యేక రైళ్లను ఇంత వరకు ఏర్పాటు చేయలేదు. ఇకనైనా ప్రత్యేక రైళ్లను నడిపించడమే కాక ఎక్స్ప్రెస్ రైలు బోగీల సంఖ్య పెంచాలని పలువురు కోరుతున్నారు. వేసవి సెలవుల్లో విహారయాత్రలకు, సెలవుల్లో బంధువుల ఇంటికి వెళ్లేందుకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.