Khammam

News May 3, 2024

KMM: తగ్గిన ఎమ్మెల్సీ ఓటు నమోదు.

image

2021లో జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్‌ జిల్లాల్లో 5,05,565 మంది ఓటర్లు ఉండగా.. ఇటీవల ఎన్నికల సంఘం వెలువరించిన ఓటరు తుది జాబితా ప్రకారం 4,61,786 మంది ఓటర్లుగా నమోదయ్యారు. గతంలో పోల్చితే ఓటర్ల సంఖ్య తగ్గింది. పట్టభద్రులు ఓటు నమోదుపై ఆసక్తి చూపకపోవటమే దీనికి కారణం. సాధారణ ఓటుహక్కు మాదిరిగా కాకుండా ఎన్నికలు జరిగే ప్రతిసారీ పట్టభద్రులు కొత్త ఓటరుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

News May 3, 2024

ముగిసిన ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు: డీఈఓ

image

గత నెల 25 నుంచి ప్రారంభమైన ఓపెన్ పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారంతో ముగిశాయి. భద్రాద్రి జిల్లాలో పదో తరగతి అభ్యర్థులకు మూడు సెంటర్లు, ఇంటర్ అభ్యర్థులకు నాలుగు పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయగా, పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఓపెన్ ఇంటర్మీడియట్ జనరల్, ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు నేటి నుంచి 10వ తేదీ వరకు జరుగుతాయని డీఈఓ వెంకటేశ్వరచారి తెలిపారు.

News May 3, 2024

ఖమ్మం: అరచేతిలో సమగ్ర సమాచారం

image

ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించడమే కాక ఓటర్లకు సులువుగా సమాచారాన్ని అందించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా వివిధ రకాల యాప్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. తద్వారా ఓటరు ఎక్కడ నుంచైనా సెల్ఫోన్ ద్వారా పలు వివరాలు తెలుసుకునే వెసలుబాటు కలుగుతోంది. అంతేకాక పలు వెబ్సైట్ల ద్వారా కూడా వివ రాలు తెలుసుకోవచ్చు. ఓటర్ హెల్ప్ లైన్, కేవైసీ యాప్, సక్షం యాప్ అందుబాటులోకి తీసుకొచ్చింది.

News May 3, 2024

వడదెబ్బకు ఖమ్మం జిల్లాలో ముగ్గురి మృతి

image

చింతకాని మండలం పందిళ్లపల్లికి చెందిన వృద్ధుడు పూనాటి రామయ్య (83) వడదెబ్బతో గురువారం మరణించారు. రెండు రోజులుగా ఎండ తీవ్రతను తట్టుకోలేక తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. స్థానికంగా చికిత్స పొందుతూ మరణించారు. అలాగే దుమ్ముగూడెం మండలంలో తోడెం వెంకటేశ్(28), ములకలపల్లి మండలం చౌటిగూడెం గ్రామానికి చెందిన ప్రసాద్(57) వడదెబ్బకు గురై గురువారం మృతి చెందారు.

News May 3, 2024

ప్రచారానికి మిగిలింది.. ఇంకా 9 రోజులే

image

ఖమ్మం లోక్‌సభ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో అభ్యర్థుల ప్రచారం ఒక్కసారిగా ఉధృతమైంది. ప్రచారానికి ఇంకా 9 రోజులే మిగలడంతో అభ్యర్థులు హోరాహోరీగా పర్యటిస్తున్నారు. ఓ వైపు ఎండలు మండుతున్నప్పటికీ సమయం తక్కువగా ఉండడంతో ప్రచారంపైనే దృష్టిసారిస్తున్నారు . ప్రత్యక్షంగా ప్రజలను కలుస్తూ తమను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. ఎవరికి వారు ధీమాగా ప్రచారాన్ని ఉధృతం చేశారు.

News May 3, 2024

పోస్టులు పెడుతున్నారా.. జాగ్రత్త సుమా!

image

ఖమ్మం జిల్లా సామాజిక మాధ్యమాల్లో ప్రచార కార్యక్రమాలను అణువణువు పరిశీలించడానికి మీడియా మానిటరింగ్ బృందాలను అధికారులు ఏర్పాటు చేశారు. ఇందులో కలెక్టర్, అదనపు కలెక్టర్, పోలీస్ సిబ్బంది, సామాజిక మాధ్యమాల నిపుణుడు, మీడియా రిపోర్టర్, సీనియర్ సిటిజన్, జిల్లా పౌరసంబంధాల శాఖ అధికారి సభ్యులుగా ఉంటారు. వాట్సాప్ గ్రూప్ అడ్మిన్కు , రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వ్యక్తికి నోటీసులు జారీచేసి చర్యలు తీసుకుంటారు.

News May 3, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్య అంశాలు

image

✓పలు శాఖలపై ఖమ్మం జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
✓ఖమ్మంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
✓పెనుబల్లి మండలంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం
✓పార్లమెంట్ ఎన్నికలపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
✓భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
✓మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన

News May 3, 2024

ఖమ్మంలో రాహుల్ గాంధీ పర్యటన

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఖమ్మం జిల్లాకు రానున్నారు. ఆ పార్టీ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామ్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మంలో ప్రచారం చేస్తారని జిల్లా కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ఈనెల 6వ తేదీన రాహుల్ గాంధీ వస్తున్నారని కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున తరలిరావాలని వారు పిలుపునిచ్చారు.

News May 2, 2024

కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎక్కడ ఉంటారో ప్రజలకు తెలియదు: రవిచంద్ర

image

నేలకొండపల్లి మండల కేంద్రంలో గురువారం జరిగిన రోడ్ షోలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర మాట్లాడారు. BRS పార్టీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు పక్కా లోకల్ అని, ఇక్కడే షుగర్ ఫ్యాక్టరీ కూడా నడిపిస్తున్నారని చెప్పారు. నామా ఖమ్మం నెహ్రూ నగర్ నివాసి అని, ఎల్లవేళలా జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు. అలాంటి నాయకుడిని ఎంపిక గెలిపించుకోవాలని కోరారు. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ఎక్కడ ఉంటారో కూడా ప్రజలకు తెలియదన్నారు.

News May 2, 2024

నిప్పులగుండంగా ఖమ్మం జిల్లా

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గతంలో ఎన్నడు లేని విధంగా జిల్లాలో అత్యధికంగా 46 డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదైంది. భద్రాచలం 46.5, వైరా, ఖమ్మం 46.4, పమ్మి 46.2, ఖమ్మం ప్రకాశ్‌నగర్ 46.1, నేలకొండపల్లి 45.6, ముదిగొండ, పల్లెగూడెం 45.5, తిమ్మారావుపేట 45.3, కొణిజర్ల 45.2, తల్లాడ 45.1 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. ప్రజలు అవసరమైతే తప్ప మధ్యాహ్న సమయాల్లో బయటకి రావద్దని సూచిస్తున్నారు.