Khammam

News April 9, 2024

ఖమ్మం: ఫీజు చెల్లింపునకు ఏప్రిల్ 20 గడువు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో బీఫార్మసీ (సీబీసీఎస్) రెండు, నాలుగో, ఆరో (రెగ్యులర్, సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ ) ఏడాది అభ్యర్థులు ఏప్రిల్ 18 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఫీజులు చెల్లించుకోవాలని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ శ్రీరామోజు నరసింహచారి తెలిపారు.
రూ.250 అపరాధ రుసుంతో ఏప్రిల్ 20 వరకు ఫీజులు చెల్లించుకునే అవకాశం ఉందన్నారు.

News April 9, 2024

ఖమ్మం: ఫీజు చెల్లింపునకు ఏప్రిల్ 20 గడువు

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో బీఫార్మసీ (సీబీసీఎస్) రెండు, నాలుగో, ఆరో (రెగ్యులర్, సప్లిమెంటరీ, ఇంప్రూవ్‌మెంట్ ) ఏడాది అభ్యర్థులు ఏప్రిల్ 18 వరకు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఫీజులు చెల్లించుకోవాలని కేయూ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ శ్రీరామోజు నరసింహచారి తెలిపారు.
రూ.250 అపరాధ రుసుంతో ఏప్రిల్ 20 వరకు ఫీజులు చెల్లించుకునే అవకాశం ఉందన్నారు.

News April 9, 2024

నేటి నుంచి భద్రాద్రి బ్రహ్మోత్సవాలు

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో జరగనున్న రామయ్య కళ్యాణానికి భద్రాద్రి ముస్తాబైంది. నేటి నుంచి వసంత పక్ష ప్రయుక్త శ్రీరామనవమి తిరుకల్యాణ బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈసారి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారనే అంచనాతో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఉత్సవాలలో పాల్గొనాలని దేవస్థానం అధికారులు ప్రముఖులకు ఆహ్వాన పత్రికలు అందజేశారు.

News April 9, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్య అంశాలు

image

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఉగాది వేడుకలు
∆} మధిర నియోజకవర్గంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటన
∆} దమ్మపేటలో మంత్రి తుమ్మల పర్యటన
∆} ఖమ్మంలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} పలు శాఖలపై ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
∆} చింతకాని మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు

News April 9, 2024

ఎండల ఎఫెక్ట్… జిల్లాలో తగ్గుతున్న కూరగాయల సాగు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఓవైపు సాగు నీటి కొరత, దంచికొడుతున్న ఎండలు కూరగాయలు సాగు చేసే రైతుల పాలిట శాపంగా మారాయి. ఒకప్పుడు కూరగాయల సాగుకు నిలయాలుగా ఉన్న పల్లెలు ప్రస్తుతం సాగుకు దూరమయ్యాయి. గత వేసవి కంటే ప్రస్తుతం ఎండలు ఎక్కువగా ఉండటంతో పాటు నీటి వనరులు ఎండిపోవడంతో కూరగాయల సాగు విస్తీర్ణం తగ్గింది. బోరుబావులపై ఆధారపడి కూరగాయల సాగు ప్రారంభించినా ఎండ తీవ్రతతో నీరు అందక మధ్యలోనే పంటలను వదిలేస్తున్నారు.

News April 9, 2024

KTDM: కూలర్ కడుగుతుండగా కరెంట్ షాక్.. యువకుడి మృతి

image

కూలర్‌ కడుగుతుండగా కరెంట్ షాక్ తగిలి ఓ యువకుడు మృతిచెందాడు. కొత్తగూడెం టూటౌన్‌ పోలీసుస్టేషన్‌ పరిధి రామవరంలో ఈ విషాదం జరిగింది. మృతుడి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. మున్సిపాలిటీ పరిధిలోని రామవరం 7వ నంబర్‌ బజార్‌కు చెందిన సయ్యద్‌ షోయబ్‌ (28) ఇంట్లో మోటార్‌ ఆన్‌ చేసి కూలర్‌ను కుడుతున్నాడు. మోటార్‌ వైర్‌ తెగి కాలుపై పడగా విద్యుదాఘాతానికి గురై మృతి చెందినట్లు తెలిపారు.

News April 9, 2024

అడుగంటిన రిజర్వాయర్లు, చెరువులు

image

ఖమ్మం జిల్లాలో 984 చెరువులు ఉండగా.. వీటి పరిధిలో 1.50 లక్షల పైచిలుకు ఆయకట్టు ఉంది. వానాకాలం వర్షాలు లేక చాలా చెరువులు పూర్తిగా నిండలేదు. వానాకాలం సాగు బాగానే ఉన్నా.. యాసంగిలో మాత్రం సాగు తగ్గింది. దీంతో రైతులు 20వేల ఎకరాల్లోనే సాగు చేశారు. ఈ చెరువుల కిందే తాగునీటి పథకాలు ఉన్నాయి. కాగా, మొత్తం చెరువుల్లో కేవలం 11 చెరువుల్లోనే 75 శాతం లోపు, మూడు చెరువుల్లో 75 నుంచి 100శాతంలోపు నీటి మట్టం ఉంది.

News April 9, 2024

భద్రాచలం: రామయ్య కళ్యాణ వేదిక పెద్దలు వీరే

image

నవమి రోజున శ్రీ సీతారామ కల్యాణం నిర్వహించే వారిలో వైదిక పెద్దలు ప్రముఖ పాత్ర పోషిస్తారు. బ్రహ్మోత్సవాల ప్రారంభం నుంచి ఉత్సవాలు ముగిసే వరకు ప్రతీ క్రతువులో వీరు పాల్గొని ఎలాంటి ఆటంకాలు లేకుండా జరిగేలా శాస్త్రోక్త పాత్ర పోషిస్తారు. ఈ ఏడాది బ్రహ్మోత్సవాల్లో పొడిచేటి సీతారామానుజాచార్యులు, బ్రహ్మగా అమరవాది గోపాలకృష్ణమాచార్యులు , ఆచార్యులుగా కోటి శ్రీమన్నారాయణాచార్యులు వైదిక పెద్దలుగా  వ్యవహరిస్తారు.

News April 9, 2024

ఖమ్మం: రేషన్ దుకాణాలు సీజ్ 

image

బియ్యం స్టాక్‌లో తేడా ఉండడంతో తల్లాడ మండలంలోని మిట్టపల్లిలోని రెండు రేషన్‌ షాపులను సివిల్‌ సప్లయ్ అధికారులు సీజ్‌ చేశారు. జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి చందన్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. మిట్టపల్లిలోని 5వ నెంబర్ షాపు 13.10 క్వింటాళ్లు, 23వ షాపులో 12 .64 క్వింటాళ్ల బియ్యం తూకంలో తేడా ఉండడంతో సీజ్ చేసినట్టు తెలిపారు. ఈ షాపు బాధ్యతలను రామానుజవరం, నూతనకల్‌ డీలర్లకు అప్పగించారు.

News April 9, 2024

ఖమ్మం: మిర్చి రైతులను వెంటాడుతున్న కష్టాలు

image

ఖమ్మం జిల్లాలో మిర్చి రైతులను కష్టాలు వెంటాడుతున్నాయి. ఈ ఏడాది ఓ వైపు దిగుబడి లేక, మరోవైపు గిట్టుబాటు ధర లేకపోవడంతో మిర్చి రైతులు విలవిల్లాడిపోతున్నారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది ధరలు పడిపోయాయి. దీనికి తోడు ప్రస్తుతం ఎండలు పెరగడంతో కాయ రంగు మారుతోంది. దీంతో పెట్టుబడి కోసం తెచ్చిన అప్పు, మిర్చి రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తుంది. పెట్టుబడులకు సంబంధించి ఆదాయం కూడా వచ్చేలా లేదని వాపోతున్నారు.