Khammam

News April 9, 2024

KMM: ఉపవాస దీక్షాపరుల కోసం గరం గరం గంజి

image

రంజాన్‌ మాసంలో హలీమ్‌ను తినేందుకు ఎంతగా ఇష్టపడతారో.. గరం గరం గంజిని సేవించేందుకు కూడా అంతే ఇష్టం చూపిస్తారు. ఉపవాస దీక్ష సమయంలో బలవర్థకమైన ఆహారం తీసుకుంటూ ద్రవపదార్థమైన వేడివేడి గంజి(జావ)ను తాగితే మంచిదని భావిస్తారు. ప్రతి ఏటా రంజాన్‌ మాసంలో మసీదుల్లో ఈ పసందైన ఘమఘుమలాడే వంటకాన్ని మధ్యాహ్నాం నుంచి సాయంత్రం వరకు తయారు చేస్తారు.ఉపవాస దీక్షా పరులు ఈ గంజిని సేవిస్తే బడలిక తీరుతుంది.

News April 8, 2024

KMM: అనారోగ్యంతో బాలిక మృతి

image

అనారోగ్యంతో బాలిక మృతి చెందిన సంఘటన సోమవారం పినపాక మండలంలో చోటుచేసుకుంది. కరకగూడెం గ్రామానికి చెందిన బాలిక సౌమ్య (8)కు కామెర్లు రావటంతో మణుగూరులోనీ ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించారు. పరిస్థితి విషమించడంతో హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా మృతి చెందింది. విషయం తెలుసుకున్న పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు బాలిక మృతదేహన్ని సందర్శించి నివాళులర్పించారు.

News April 8, 2024

KCR నటిస్తున్నారు: పొంగులేటి

image

రైతులను రెచ్చగొట్టి పార్లమెంటు ఎన్నికల్లో సానుభూతి పొందేందుకు మాజీ సీఎం కేసీఆర్ రైతు దీక్షల పేరుతో నటిస్తూ పంట పొలాలను పరిశీలిస్తున్నారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. వైరాలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి పొంగులేటి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని వివరించారు.

News April 8, 2024

రాములోరి కళ్యాణానికి గవర్నర్‌కు ఆహ్వానం

image

భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగే సీతారాముల కళ్యాణానికి తెలంగాణా రాష్ట్ర గవర్నర్ సిపి. రాధాకృష్ణన్‌ ను సోమవారం ఆలయ ఈవో రమాదేవి ఆహ్వానించారు. ఈనెల 17న జరిగే సీతారాముల కళ్యాణం, 18న జరిగే మహాపట్టాభిషేక మహోత్సవానికి హాజరు కావాలని గవర్నర్‌కు దేవస్థానం ఈఓ రమాదేవి, అర్చకులు ఆహ్వాన పత్రికను అందజేశారు.

News April 8, 2024

రామయ్య పెళ్లికి ఆహ్వానం

image

శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను దేవస్థాన అధికారులు సోమవారం విడుదల చేశారు. కళ్యాణోత్సవానికి ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే అని పేర్కొన్నారు.

News April 8, 2024

భద్రాచలం: నిత్యకళ్యాణాలు , పవళింపు సేవలు రద్దు

image

భద్రాచలంలో ఉగాది మరుసటి రోజు నుంచి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈనెల 9 నుంచి 23 వరకు బేడా మండపంలో జరిగే నిత్యకళ్యాణాలు, దర్బారు సేవలను రద్దు చేసినట్లు ఆలయ ఈవో రమాదేవి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మే 2వ తేదీ నుంచి పర్యంతోత్సవం , పవళింపు సేవలు ప్రారంభమవుతాయన్నారు.

News April 8, 2024

మధిరలో బాలికను వేధించిన యువకుడి రిమాండ్

image

మధిరలోని మైనర్ బాలికను వేధించిన యువకుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. మధిర రాయపట్నంకు చెందిన మల్ల కార్తీక్ అనే యువకుడిపై మైనర్ బాలికను వేధించిన కారణంగా పోక్సో కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ ఎస్సై సంధ్య తెలిపారు.

News April 8, 2024

పొంగులేటి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా..!

image

పొంగులేటి ఏ పార్టీలో ఉంటే.. ఆ పార్టీ అభ్యర్థి ఖమ్మం ఎంపీగా గెలవడం పరిపాటిగా మారింది. 2014లో ఆయన YCPలో ఉండగా ఖమ్మం MPగా గెలిచారు. 2019లో TRSలో చేరగా.. ఆ పార్టీ నుంచి బరిలో నిలిచిన నామా విజయం సాధించారు. ప్రస్తుతం పొంగులేటి కాంగ్రెస్‌లో ఉండటంతో హస్తం పార్టీనే ఖమ్మం సీటును గెలుస్తుందని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. మరి పొంగులేటి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా.. కామెంట్ చేయండి.

News April 8, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

✓ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
✓అశ్వారావుపేట మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
✓ఖమ్మంలో ఎంపీ రవిచంద్ర పర్యటన
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు
✓భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు

News April 8, 2024

KMM: వడదెబ్బతో ఇద్దరు మృతి

image

వడదెబ్బ కారణంగా జిల్లాలో ఇద్దరు వృద్ధులు మృతి చెందారు. ముత్యాలగూడెంకు చెందిన చిన్నబాబు(58) ఎండ తీవ్రతకు రెండు రోజుల క్రితం తీవ్ర అస్వస్థతకు గురై చనిపోయాడు. అదే విధంగా ఇల్లెందు అడ్డరోడ్డు సమీపంలో గుర్తు తెలియని వృద్ధుడు రహదారి పక్కనే వడదెబ్బకు గురై మృతి చెందాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.