India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం మిర్చి, పత్తి ధరలు ఈ విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ.18,650 పలికింది. క్వింటా పత్తి ధర రూ.7,200 జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు కొత్త మిర్చి ధర రూ.150 పెరగగా.. అటు పత్తి ధర స్థిరంగా ఉన్నట్లు వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్లో రైతులను ఇబ్బందులను గురి చేయకుండా క్రయవిక్రయాలు జరుపుకోవాలని మార్కెట్ అధికారులు పేర్కొన్నారు.
నేడు పదోతరగతి ఫలితాలు ఉదయం 11గంటలకు వెలువడనున్నాయి. ఖమ్మం జిల్లాలో 16,577 మంది, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 12341 మంది పదో తరగతి విద్యార్థులున్నారు. అందరి కంటే ముందుగా రిజల్ట్స్‌ను Way2News యాప్‌లో సులభంగా, వేగంగా పొందవచ్చు.
కేసీఆర్ మాజీ మంత్రి పువ్వాడ అజయ్ నివాసంలో ఖమ్మం జిల్లా నేతలతో సమీక్షించారు. లోక్ సభ ఎన్నికల్లో రాష్ట్రంలో బీఆర్ఎస్ సునామీ ఖాయమని.. 12 ఎంపీ సీట్లు గెలవబోతున్నామని కేసీఆర్ తెలిపారు. ఖమ్మం సీటు గెలుస్తున్నామని, మిగతా పార్టీల అభ్యర్థుల కంటే నామ ముందంజలో ఉన్నట్లు సర్వే రిపోర్ట్‌లు చెబుతున్నాయని పేర్కొన్నారు. నేతలంతా కష్టపడి పని చేస్తే మంచి మెజార్టీ వస్తుందని దిశానిర్దేశం చేశారు.
ఎన్నికల ప్రచార క్షేత్రంలోకి మంత్రులు మల్లు భట్టి, పొంగులేటి, తుమ్మల దిగటంతో కాంగ్రెస్ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది. ఖమ్మం లోక్‌సభ స్థానం సీటును తమ కుటుంబీకులకు దక్కించుకోవాలని పోటీ పడిన విషయం తెలిసిందే. అనేక సంప్రదింపుల తర్వాత కాంగ్రెస్ అభ్యర్థిత్వం రఘురాంరెడ్డికి దక్కింది. ఈ స్థానంలో మెజార్టీ సాధించాలనే సంకల్పంతో ముగ్గురు ఒకే తాటిపైకి వచ్చారు. కాంగ్రెస్ గెలుపు ఖాయమని ప్రకటించారు.
ఖమ్మం నగరంలో సోమవారం రాత్రి నిర్వహించిన రోడ్‌షోలో కేసీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీకి ఓటేస్తే గోదావరిలో వేసినట్లేనన్నారు. పాలేరును ఎండబెట్టిన పాపం మంత్రులదేనన్నారు. కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమేనని.. ఖమ్మం ఎంపీగా నామా నాగేశ్వరరావును గెలిపిస్తే కేంద్రమంత్రి అవుతాడని పేర్కొన్నారు. నామా కేంద్రంలో మంత్రి అయితే తెలంగాణ రాష్ట్రానికి, ఖమ్మం జిల్లాకు చాలా మేలు జరిగే అవకాశం ఉందని వివరించారు.
∆} ఖమ్మం జిల్లాలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రోడ్ షో
∆} పలు శాఖలపై ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} మధిర నియోజకవర్గం లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
∆} కూసుమంచి మండలంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం
∆} కల్లూరు మండలంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
∆} భద్రాద్రిలో ప్రత్యేక పూజలు
MP ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. ఖమ్మంలో 41 నామినేషన్లు ఆమోదించగా.. ఆరుగురు విత్‌డ్రా చేసుకొన్నారు. 35 మంది బరిలో నిలిచారు. MHBD లోక్‌సభలో 25 నామినేషన్లు ఆమోదించగా.. ఇద్దరు విత్ డ్రా చేసుకొన్నారు. 23 మంది బరిలో ఉన్నారు. మే 13న పోలింగ్ జరగనుంది. జూన్ 4న ఓట్ల లెక్కింపు ఉంటుంది.
ఇదే జిల్లాలో వ్యవసాయ మంత్రి పక్కన నల్గొండ జిల్లాలో నీటి శాఖ మంత్రి.. ఇద్దరు మంత్రులుండగ కాలువలో నీళ్లెందుకు రాలేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. ఖమ్మం రోడ్ షో అయన మాట్లాడుతూ.. పాలేరు దగ్గర మేమే బద్దలు కొడతామని రైతులు ఎందుకుపోయి దండయాత్ర చేశారు? అలాంటి పరిస్థితులు ఎందుకు వచ్చినయ్. ఇవన్నీ చర్చించాలన్నారు. ఈ దేశం మీది.. రాష్ట్రం మీది..భవిష్యత్ మీది. యువత ఓ ఒరవడిలో కొట్టుకుపోవద్దన్నారు.
ఖమ్మంలో నిర్వహించినoచిన రోడ్ షోలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం రాబోతుందన్నారు. బీఆర్ఎస్‌కు 12 ఎంపీ సీట్లు వస్తాయని చెప్పారు. సంకీర్ణ ప్రభుత్వంలో నామా నాగేశ్వర్ రావు కేంద్ర మంత్రి అవుతారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీకి ఓట్లు, సీట్లు తప్ప ప్రజా సమస్యలు పట్టవని విమర్శించారు.
అశోక్ గులాటీ ఆగ్రో ఎకానమిస్ట్‌తో అనేక మాసాలపాటు చర్చించి ఓ నిర్ణయం తీసుకొని రైతులను నిలబెట్టాలని నాలుగైదు కార్యక్రమాలు చేశామని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. సోమవారం రోడ్‌షోలో భాగంగా ఖమ్మం కార్నర్ మీటింగ్‌లో పాల్గొని మాట్లాడారు. గత ప్రభుత్వంలో రైతుబంధు ఇచ్చామని, కరెంటు, నీటి తీరువా లేకుండా చేశామని, పాత బకాయిలు రద్దు చేశామని, ధాన్యం కొనుగోలు చేసి రైతులను ఆదుకున్నామని పేర్కోన్నారు.
Sorry, no posts matched your criteria.