India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం జిల్లావ్యాప్తంగా 387 మంది పంచాయతీ కార్యదర్శులను బదిలీ బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ బుధవారం ఉత్తర్వులు వెలువరించారు. పరిపాలనాపరమైన అవసరాల మేరకు బదిలీ చేస్తున్నట్లు తెలిపారు. బోనకల్ మండలంలో 10, చింతకాని- 11, ఏన్కూరు-24 కల్లూరు-16, కామేపల్లి-22, ఖమ్మం గ్రామీణం- 19, కొణిజర్ల- 15, కూసుమంచి- 24, మధిర-19, ముది గొండ-14, నేలకొండపల్లి-20, పంచాయతీ కార్యదర్శులు బదిలీ అయ్యారు.

✓ భద్రాచలం వద్ద గోదావరి రెండో ప్రమాద హెచ్చరిక ఉపసంహరణ ✓ తాలిపేరు ప్రాజెక్టు కొనసాగుతున్న వరద ✓ అశ్వారావుపేటలో బీభత్సం సృష్టించిన దొంగలు ✓ అధికారులు సమన్వయంతో పనిచేయాలి: మంత్రి తుమ్మల ✓ ఖమ్మం: నిమర్జన ఏర్పాటును పరిశీలించిన సీపీ సునీల్ దత్ ✓ కూసుమంచిలో కేంద్ర బృందం పర్యటన ✓ ప్రతి పేదవాడికి కార్పొరేట్ విద్య: డిప్యూటీ సీఎం ✓ కారేపల్లి: సీఎం సహాయనిధి చెక్కు అందించిన మంత్రి పొంగులేటి

పత్తి కొనుగోలు కేంద్రాల ఏర్పాటు తీసుకోవలసిన చర్యలపై అధికారులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సమావేశం నిర్వహించారు. పత్తి కొనుగోలు కేంద్రాలు, జిన్నింగ్ మిల్లులను సీజన్ ప్రారంభానికి ముందే సిద్ధం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు కనిష్ట మద్దతు ధర, పత్తి సేకరణ మార్గదర్శకాల గురించి ప్రచార మాధ్యమాల ద్వారా ప్రచారం చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాలు వారానికి 6 రోజులు పనిచేయాలని సూచించారు.

భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం గంట గంటకు తగ్గుతూ వస్తుందని సీడబ్ల్యూసీ అధికారులు బుధవారం సా.6 గంటలకు ప్రకటించారు. గోదావరి నీటిమట్టం 48.7 అడుగులకు తగ్గిందని చెప్పారు. వర్షాలు తగ్గుముఖం పడటంతో వరద ప్రవాహం తగ్గుతుందని తెలిపారు. కాగా గణేష్ నిమజ్జనం గోదావరిలో కొనసాగడంతో జిల్లా పోలీసు అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. వరద ప్రవాహం తగ్గుతుండడంతో స్థానికులు ఊపిరి పీల్చుకుంటున్నారు.

కులమతాలకు అతీతంగా అందరూ కలిసి ఘనంగా జరుపుకునే పండుగల్లో గణేష్ నవరాత్రి వేడుక ఒకటని చెప్పవచ్చు. మధిర మండలం రాజీవ్ నగర్‌లో ఏర్పాటు చేసిన గణేష్ నవరాత్రి ఉత్సవ వేడుకల్లో ముస్లిం దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బుధవారం షేక్ నాగుల్ మీరా – బీజాన్ దంపతులు గణనాథుడికి కుంకుమ పూజ నిర్వహించారు. దాంతో కులమతాలకు అతీతంగా పండుగ జరుపుకోవడం సంతోషంగా ఉందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఖమ్మం జిల్లా టేకులపల్లి మోడల్ కెరీర్ కేంద్రంలో ఉద్యోగ మేళాను గురువారం నిర్వహిస్తున్నారు. ఓ ఫైనాన్స్ సంస్థలో లోన్ ఆఫీసర్ పోస్టులు మొత్తం 100 ఖాళీలు భర్తీ ఏర్పాటు చేస్తున్నారు. 18 నుంచి 28 ఏళ్లు విద్య హర్షత్ ఇంటర్ మీడియట్ పూర్తి చేసిన, డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నవారు. ఉ.10 గంటలలోగా హాజరు కాగలరని ఉపాధి కల్పన అధికారి మాధవి ఓ ప్రకటనలో తెలిపారు.

మున్నేరు, ఆకేరు, పాలేరు వరదలతో నష్టపోయిన ప్రాంతాలను పరిశీలించేందుకు కేంద్ర బృందం బుధవారం ఖమ్మం జిల్లాకు రానుంది. ఈ సందర్భంగా వివిధ విభాగాల అధికారులు 9 మందితో ఈ బృందం నేడు ఢిల్లీ నుంచి వస్తోంది. ఈ బృందంలోని అధికారులు రెండు బృందాలుగా ఏర్పడి నష్టాన్ని పరిశీలిస్తారు. ఒక బృందం దెబ్బతిన్న పంటలను, మరో బృందం రోడ్లు, ఎన్నెస్పీ కాలువలు, వంతెనలను పరిశీలించనుంది.

దుమ్ముగూడెం మండలం తూరుబాక ప్రధాన రహదారిపై బుధవారం గోదావరి వరద నీరు చేరింది. దీంతో స్థానిక ప్రజలకు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. గోదావరి నీటిమట్టం గణనీయంగా పెరుగుతుండడంతో స్థానిక ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధాన రహదారి వద్ద అధికారులు రాకపోకలను నిలిపివేశారు. గోదారి నీరు చేరిన రహదారులను దాటే ప్రయత్నం చేసి ప్రమాదాలకు గురి కావద్దని అధికారులు సూచించారు.

ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు, వరదలతో జరిగిన పంట నష్టంపై వ్యవసాయ శాఖ అధికారులు చేపట్టిన సర్వే ఓ కొలిక్కి వస్తోంది. సర్వేలో భాగంగా 12,014 మంది రైతులకు చెందిన 15,058 ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్లు మంగళవారం నాటికి గుర్తించారు. ఇందులో వరి 10,844 ఎకరాలు ఉంది. మధిర, కూసుమంచి మండలాల్లో సర్వే కొనసాగుతుండగా మరో రెండు, మూడు రోజుల్లో నష్టంపై స్పష్టత రానుంది.

ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం కొత్త లింగాలకి చెందిన బాలికపై లైంగిక దాడి కేసులో ఇద్దరు నిందితులు ఏ1. పండగ నాగేంద్రబాబు(22) ఏ2. పండగ రాంబాబు(24)లకు శిక్ష విధిస్తూ తీర్పు వెలువడింది. ఏ1.కు 20 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.50 వేలు జరిమానా.. ఏ2.కు 10 సంవత్సరాల శిక్ష విధిస్తూ ఖమ్మం మొదటి అదనపు జిల్లా న్యాయాధికారి కె. ఉమాదేవి మంగళవారం తీర్పు చెప్పారు. ఆటోలో వెళ్తున్న బాలికను అడ్డగించి అత్యాచారం చేశారు.
Sorry, no posts matched your criteria.