Khammam

News September 10, 2024

మళ్ళీ పెరిగిన పత్తి ధర….ఎంతంటే!

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా ఏసీ మిర్చి ధర రూ.20,000, క్వింటా పత్తి ధర రూ.7,900 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. నిన్నటి కంటే ఈరోజు ఏసీ మిర్చి ధర స్థిరంగా ఉండగా, పత్తి ధర మాత్రం రూ.100 పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. మార్కెట్ కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.

News September 10, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

>వివిధ శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష
> వరదలపై వైరా ఎమ్మెల్యే అధికారులతో సమీక్ష
>భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి
>ఖమ్మం మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాల్లో కొనసాగుతున్న చర్యలు
>అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
>పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాయం పర్యటన
>సత్తుపల్లిలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News September 10, 2024

పార్టీ ఫిరాయింపులపై ఎమ్మెల్యే హాట్ కామెంట్స్

image

పార్టీ ఫిరాయించిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. హైకోర్టు తీర్పుకు అనుగుణంగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. రాజీనామా చేయకుండా పార్టీ మారితే ప్రజలను మోసం చేసినట్లుగా భావించాలని కూనంనేని కామెంట్స్ చేశారు.

News September 9, 2024

హైకోర్టు తీర్పు నేపథ్యంలో స్పందించిన భద్రాచలం ఎమ్మెల్యే

image

ప్రజల అభీష్టం మేరకే తాను ఎమ్మెల్యే అయ్యానని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు అన్నారు. BRS పార్టీని చూసి ప్రజలు ఓటు వేయలేదన్నారు. సోమవారం హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ఎమ్మెల్యే స్పందించారు. నియోజకవర్గ ప్రజలకు తన వ్యక్తిగతం తెలుసని, మారుమూల పల్లెల్లో పుట్టి ఎమ్మెస్ పూర్తి చేశానన్నారు. ఎన్నికల్లో పోటీ చేసి ప్రజల ఆశీర్వాదంతోనే గెలిచానని తెలిపారు.

News September 9, 2024

KMM: రూ.10లక్షలు గెలుచుకునే ఛాన్స్

image

RBI 90వ ఏడాదిలోకి అడుగుపెడుతున్న సందర్భంగా డిగ్రీ విద్యార్థులకు RBI-90 పేరిట క్విజ్ నిర్వహిస్తోంది. ఈ పోటీలో పాల్గొనేందుకు www.rbi90quiz.in వెబ్సైట్ ద్వారా ఈనెల17 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ఈనెల 19 నుంచి 21 వరకు ఉదయం 9 నుంచి రాత్రి 9 గంటల వరకు పోటీలు జరగనున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో మొత్తం 186 కళాశాలలు ఉన్నాయి. అందులో విద్యార్థులంతా పాల్గొనే అవకాశం ఉంది.

News September 9, 2024

సింగరేణిలో అప్రెంటిస్ షిప్ కోసం నోటిఫికేషన్ విడుదల

image

సింగరేణి సంస్థలో ఏడాది కాలానికి అప్రెంటిస్ షిప్ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. ఐటీఐ ఉత్తీర్ణులై నేషనల్ ట్రేడ్ సర్టిఫికెట్ కలిగిన వారు అర్హులని అధికారులు వెల్లడించారు. ఈనెల 9- 23వ తేదీ వరకు www.appre nticeshipindia.orgలో దరఖాస్తు చేసుకుని సంబంధిత పత్రాలు, సర్టిఫికెట్లతో ఈనెల 10 నుంచి ఆయా ఏరియాల ఎంవీటీసీ కార్యాలయాల్లో ఇవ్వాలని సూచించారు.

News September 9, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} మున్నేరు వరద ప్రభావిత ప్రాంతాలలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} మధిరలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన
∆} వరదలపై ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష
∆} అన్నపురెడ్డిపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం విద్యాసంస్థలు పున: ప్రారంభం
∆} భద్రాచలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఇల్లందులో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
∆} అశ్వాపురంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన

News September 9, 2024

అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

ఖమ్మం జిల్లాలోని SR&BGNR కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపకుల నియామకాలు జరపడానికి అర్హులైన అభ్యర్ధుల ‌నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ జాకీరుల్లా తెలిపారు. ఇంగ్లీష్ 1, హిస్టరీ 3, ఎకనామిక్స్ 1, పొలిటికల్ సైన్స్ 2,కామర్స్ 2,బి.బి.ఏ 2, బి.సి.ఏ 1, గణితం 3,కంప్యూటర్ సైన్స్ & అప్లికేషన్స్ 3,డేటా సైన్స్ 1, బయోటెక్నాలజీ 1,బాటనీ1ఉన్నాయ. ఈ నెల11నజరిగే ఇంటర్వ్యూకి హాజరు కావాలన్నారు.

News September 8, 2024

స్వల్పంగా తగ్గుతున్న మున్నేరు వాగు

image

ఖమ్మం నగరంలో ప్రవహిస్తున్న మున్నేరు వాగు స్వల్పంగా తగ్గుముఖం పడుతోంది. ఆదివారం మధ్యాహ్ననానికి 13.50 అడుగుల వద్ద నీటి ప్రవాహం కొనసాగుతోంది. 16 అడుగులకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. మధ్యాహ్నం ఒంటిగంటకు 13.75 అడుగుల వద్ద ఉన్న మున్నేరు వరద రెండు గంటలకు 13.50 అడుగులకు పడిపోయింది. స్వల్పంగా తగ్గుతుండడంతో ముంపు ప్రాంతాల ప్రజలు ఊపిరి పీల్చుకుంటున్నారు.

News September 8, 2024

వరదలపై రాజకీయం సరికాదు: కేంద్ర మంత్రి

image

ప్రకృతి వైపరిత్యాలు వంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజకీయాలకు అతీతంగా ప్రజలకు సేవ చేయాలన్నారు. ఆదివారం ఖమ్మం ముంపు ప్రాంతాల్లో పర్యటించి బాధితులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం అడ్వాన్స్ డిజాస్టర్ ఫండ్ కింద రూ.1,300 కోట్లు పంపిందని, వరదపై రాజకీయం చేయడం సరికాదన్నారు.