India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి విన్నూత్న ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ఖమ్మంలోని ఇవాళ ఉదయం టీడీపీ కార్యాలయం ఎదుట ఉన్న హోటల్‌లో ఇదీ ఆర్ఆర్ఆర్ ఛాయ్ స్పెషల్ అంటూ తనదైన శైలిలో అందరికి అందించారు. అనంతరం అక్కడే అల్పాహారం సేవించి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. కార్యక్రమంలో పువ్వాళ్ల దుర్గా ప్రసాద్, బేబీ స్వర్ణకుమారి, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
ఖమ్మం కాంగ్రెస్‌లో కుటుంబ పాలన నడుస్తోందని ఖమ్మం బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు. నిన్న రాత్రి లక్ష్మీదేవిపల్లిలో జరిగిన ఎన్నికల ర్యాలీలో మాట్లాడారు. ఇక్కడ ఉప ముఖ్యమంత్రి తన భార్య కోసం, ఒక మంత్రి తన తమ్ముడి కోసం, మరో మంత్రి తన కొడుకు టికెట్ కోసం పోరాడారని చివరకు ఒక మంత్రి వియ్యంకుడి దగ్గర ఆగిందన్నారు. మన అభివృద్ధి మన చేతుల్లో ఉండాలా? బయటి వ్యక్తి చేతిలో పెట్టాలా? ప్రజలే ఆలోచించాలన్నారు.
ఖమ్మం కాంగ్రెస్ పార్లమెంట్ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి ఎన్నికల ప్రచారంలో టాలీవుడ్ హీరో వెంకటేశ్ పాల్గొంటారని ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఇందుకు గాను రఘురామిరెడ్డి వర్గీయులు షెడ్యూల్ ఖరారు చేస్తున్నారు. దీనిపై కాంగ్రెస్ అధిష్ఠానం అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. తన వియ్యంకుడి గెలుపు కోసం ఎన్నికల ప్రచారంలో పాల్గొనాలని వెంకటేశ్
నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.
ఎంపీ ఎన్నికల్లో పోటీకి అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ల పరిశీలన శుక్రవారం ముగిసింది. ఖమ్మం పార్లమెంట్ స్థానానికి నామినేషన్ల పరిశీలన అనంతరం నలుగురి నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. 41మంది అభ్యర్థుల నామినేషన్లు అంగీకరించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. తిరస్కరించిన అభ్యర్థుల నామినేషన్ల వివరాలను ఎన్నికల సంఘం అధికారులు అధికారికంగా ప్రకటించారు.
ఖమ్మం: పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పోలింగ్ సిబ్బంది 2వ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేసినట్లు కలెక్టర్, ఖమ్మం పార్లమెంట్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి వీపీ గౌతమ్ తెలిపారు. శుక్రవారం నూతన కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్, పెద్దపల్లి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి గౌతమ్, పార్లమెంట్ ఎన్నికల సాధారణ పరిశీలకులు డా. సంజయ్ తో కలిసి పోలింగ్ సిబ్బంది 2వ దశ ర్యాండమైజేషన్ ప్రక్రియను నిర్వహించారు.
కాకతీయ విశ్వవిద్యాలయ పీడీసీ మొదటి సంవత్సరం (తెలుగు) పరీక్షలు మే 8 నుంచి ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య ఎస్.నరసింహ చారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ తిరుమల దేవి సంయుక్త ప్రకటనలో తెలిపారు. అదేవిధంగా రెండవ సంవత్సరం పరీక్షలు మే 15 నుంచి ప్రారంభమవుతాయన్నారు. వివరాలకు విశ్వవిద్యాలయ వెబ్ సైట్ www.kakatiya.ac.inలో సంప్రదించాలన్నారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ బస్సు యాత్రలో భాగంగా ఈనెల 29న సాయంత్రం 6 గంటలకు ఖమ్మంలో రోడ్ షో నిర్వహించనున్నారు. ఆ రాత్రి ఖమ్మంలో బస చేస్తారు. అనంతరం 30న సాయంత్రం 5.30 గంటలకు తల్లాడలో, 6.30 గంటలకు కొత్తగూడెంలో రోడ్ షో కొనసాగిస్తారు. 30న రాత్రి కొత్తగూడెంలో బస చేస్తారు. అనంతరం ఒకటో తేదీన మహబూబాబాద్ కు బయలుదేరి వెళ్లనున్నారు.
హైదరాబాద్ గాంధీభవన్లో శుక్రవారం ఖమ్మం, కొత్తగూడెం నేతలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కొత్తగూడెం నుండి ఎడవల్లి కృష్ణ, సత్తుపల్లి నుండి సంభాని చంద్రశేఖర్, రామచంద్రనాయక్, కామేపల్లి జడ్పీటీసీ బాణోత్ ప్రవీణ్ కుమార్ నాయక్ హస్తం గూటికి చేరారు. ఈ సందర్భంగా చేరికల కమిటీ చైర్మన్ జగ్గారెడ్డి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వీరు అసెంబ్లీ ఎలక్షన్ ముందు కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరారు.
ఉమ్మడి జిల్లాలోని గిరిజన సంక్షేమ శాఖ గురుకుల కళాశాలల విద్యార్థులు జేఈఈ మెయిన్స్‌లో ర్యాంకులు సాధించారని ITDA పీఓ ప్రతీక్ జైన్ ఓ ప్రకటనలో తెలిపారు. భద్రాచలం గిరిజన గురుకులంలో ఎంపీసీ ద్వితీయ సంవత్సరం చదివిన డీ.ఐశ్వర్య 79.06. శ్రావణి 74.57, నాగేశ్వరి 71.18. అర్హత సాధించారని తెలిపారు.
వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ గురువారం ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఈ మేరకు జిల్లాలో ఎన్నికకు సంబంధించిన ప్రక్రియలో అధికారులు వేగం పెంచనున్నారు. నల్గొండ కలెక్టర్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరిస్తారు. కాగా జిల్లాలోని 21 మండలాల పరిధిలో 83,600 మంది ఓటర్లు ఉండగా వీరిలో పురుషులు 50,513, మహిళలు 33,083, ఇతరులు నలుగురు ఉన్నారు.
Sorry, no posts matched your criteria.