Khammam

News September 6, 2024

మళ్లీ సాగు చేయండి: మంత్రి తుమ్మల

image

ఎర్రుపాలెం మండలం మీనవోలులోని వరద ముప్పు ప్రాంతాలలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. పంట పొలాలను పరిశీలించి నష్ట వివరాలను తెలుసుకున్నారు. వరద ప్రభావంతో నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వం ఆదుకుంటుందని అన్నారు. నష్టపోయిన పంటలను తిరిగి వేసుకోవాలని రైతులకు సూచించారు.

News September 5, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి ముఖ్యంశాలు

image

☆ గత నెలలో డయల్-100 కు 4,119 కాల్స్: పోలీస్ కమిషనర్
☆ ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి: భద్రాద్రి జిల్లా ఎస్పీ
☆ వరద బాధితులకు ఎంపి పార్థసారధి రెడ్డి కోటి విరాళం
☆ ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం
☆ వరద ప్రభావిత ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎంపీ బలరాం నాయక్
☆ ఖమ్మం వరద బాధితులకు మాజీ మంత్రి హరీష్ రావు సహాయం
☆ ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు

News September 5, 2024

మణుగూరుకు మావోయిస్టు మృతదేహాలు తరలింపు

image

కరకగూడెం మండల పరిధిలో ఇవాళ జరిగిన పోలీసులు- మావోయిస్టుల ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. కాగా ఎదురు కాల్పుల్లో మృతి చెందిన మావోయిస్టుల మృతదేహాలను మణుగూరు వంద పడకల ఆసుపత్రికి జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తరలించారు. ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు నిర్వహించారు.

News September 5, 2024

ఖమ్మం: గత నెలలో డయల్-100కు 4,119 కాల్స్

image

సమాజంలో పెరిగిపోతున్న నేర ప్రవృత్తి నేపథ్యంలో ప్రజల దాన, మాన, ప్రాణాల రక్షణే ధ్యేయంగా ఏర్పాటైన డయల్-100కు గత నెలలో 4,119 కాల్స్ వచ్చినట్లు సీపీ సునీల్ దత్ తెలిపారు. వాటిపై 91 FIR నమోదు చేశామని, వీటిలో మహిళలపై వేధింపులు-3, దొంగతనాలు-15, సాధారణ ఘాతాలు-33, అనుమానస్పద మరణాలు-4, ఇతర కేసులు-25 అన్నారు. డయల్-100కు ఫేక్ కాల్స్ చేయొద్దని, అత్యవసర సమయంలో మాత్రమే ఫోన్ చేయాలని పేర్కొన్నారు.

News September 5, 2024

నవరాత్రి ఉత్సవాలకు డిప్యూటీ సీఎంకు ఆహ్వానం

image

ఖైరతాబాద్ గణేశ్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో శనివారం నుంచి జరుగునున్న గణేశ్ నవరాత్రి ఉత్సవాలకు ముఖ్యఅతిథిగా హాజరు కావాల్సిందిగా రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లును ఆహ్వానించారు. స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, పార్టీ నాయకులు ఉత్సవ కమిటీ చైర్మన్ మరియు కమిటీ సభ్యులు ఉన్నారు.

News September 5, 2024

KMM: మీ ఫేవరెట్ టీచర్ ఎవరు..? కామెంట్ చేయండి!

image

విద్యార్థుల్లో విజ్ఞాన వెలుగులు నింపుతూ, వారు ఉన్నత స్థాయికి చేరేలా నిరంతరం కృషి చేసే వారే గురువులు. నేడు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాల్లోని అన్ని విద్యాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. సీనియర్ విద్యార్థులు టీచర్లుగా మారి జూనియర్లకు పాఠాలు బోధిస్తూ సందడి చేస్తున్నారు. మరి.. మీ ఫేవరేట్ టీచర్ ఎవరో కామెంట్ చేయండి. SHARE IT

News September 5, 2024

కొత్తగూడెం: ఎదురుకాల్పుల్లో కానిస్టేబుళ్లకు గాయాలు

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలో గ్రీవెన్స్ పోలీసులకు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో లచ్చన్న సహా దళానికి చెందిన ఐదుగురు మావోయిస్టులు మృతిచెందగా.. ఇద్దరు గ్రీవెన్స్ కానిస్టేబుళ్లకు గాయాలు కాగా వారిని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. వారం నుంచి లచ్చన్న దళం పినపాక మండలంలో సంచరిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు పోలీసులు వెల్లడించాల్సి ఉంది.

News September 5, 2024

వరద ప్రభావిత ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ఎంపీ, ఎమ్మెల్యే

image

భారీ వర్షాల కారణంగా గోదావరి వరద ప్రభావిత ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీ బలరాం నాయక్, ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్‌రావు సూచించారు. మొదటి ప్రమాద హెచ్చరికను దాటి గోదావరి ప్రవాహం పెరుగుతుండడంతో పరివాహక ప్రాంత ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. అన్ని శాఖల అధికారులు సహాయ సహకారాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అత్యవసరమైతే 100కు డయల్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు.

News September 5, 2024

వరద బాధితులను పరామర్శించిన మంత్రి పొంగులేటి

image

పాలేరు నియోజకవర్గంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పర్యటించారు. వరదల వల్ల ఇల్లు కోల్పోయి నిరాశ్రయులైన కుటుంబ సభ్యులతో మంత్రి మాట్లాడారు. ఆందోళన చెందవద్దని అందరికీ ప్రభుత్వ పరంగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ యువజన నాయకుడు రామ్ రెడ్డి, శ్రీ చరణ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

News September 5, 2024

బాధితుల ఖాతాల్లో రూ.10 వేల తాత్కాలిక సాయం: మంత్రి

image

మున్నేటి వరదతో సర్వస్వం కోల్పోయిన బాధితుల ఖాతాల్లో గురువారం నుంచి రూ.10వేల తాత్కాలిక సాయం జమ చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఖమ్మం కేఎంసీ కార్యాలయంలో బుధవారం ఆయన మాట్లాడారు. వరదలు తగ్గిన 40 గంటల్లోనే పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొచ్చామన్నారు. ముంపుతో పూర్తిగా దెబ్బతిన్న ఇళ్ల స్థానంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. జిల్లా యంత్రాంగాన్ని ఆయన అభినందించారు.