India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం నగరంలో వరద ముంపునకు గురైన ప్రాంతాల్లో జిల్లా అగ్నిమాపక శాఖాధికారి అజయ్ కుమార్ ఆధ్వర్యాన వివిధ ప్రాంతాల సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. వరదలో చిక్కుకున్న బాధితులను బయటకు తీసుకురావడంలో పాలుపంచుకున్న వారు ఇప్పుడు బురద, చెత్త పేరుకుపోయిన ప్రాంతాల్లో స్థానికులకు సహకరిస్తున్నారు. మొత్తంగా 11 వాహనాలతో మొత్తం వంద మందికి పైగా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇందిర కాలనీ వద్ద ఈరోజు తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. బూర్గంపహాడ్ మండలం మొరంపల్లి గ్రామానికి చెందిన శశికాంత్ రెడ్డి(17) బైక్‌పై పాల్వంచ నుంచి ఇంటికి వస్తున్నాడు. ఈక్రమంలో ప్రమాదవశాత్తు బైక్ డివైడర్‌ను ఢీకొనడంతో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల పర్యటన
∆} వరద ప్రభావిత ప్రాంతాల కొనసాగుతున్న సర్వే
∆} అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} భద్రాచలంలో ఎమ్మెల్యే వెంకట్రావు పర్యటన
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు

ఖమ్మం జిల్లాలో నేడు పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. వర్షాలకు మహబూబాబాద్ జిల్లా
కేసముద్రం తాళ్లపూసపల్లి, రాయనపాడు వద్ద దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పనులు జరుగుతున్న నేపథ్యంలో నేడు పలు రైళ్లను ద.మ. రైల్వే రద్దు చేసినట్లు ఖమ్మం రైల్వే చీఫ్ కమర్షియల్ ఇన్స్పె క్టర్ జాఫర్ వెల్లడించారు. పలు రైళ్లను రద్దు చేయగా మరికొన్నింటిని దారి మళ్లించనున్నారు.

వరదల వల్ల ఏపీలో జరిగిన నష్టానికి కేంద్రం ఎలా సాయం చేయాలనుకుంటుందో తెలంగాణకు కూడా అలానే సహాయం అందించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. నేలకొండపల్లి మండలంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. భారీ వర్షాలతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, ఈ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు, చెరువులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయని, వాటిని చూసేందుకు ప్రజలేవరు రావద్దని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ విజ్ఞప్తి చేశారు. గత ఐదు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు పట్టణాలతో పాటు గ్రామ పంచాయతీల పరిధిలో చిన్న, పెద్ద చెరువులు, వాగులు ప్రమాదకర స్థాయిలో నిండి పొంగి పొర్లుతున్నాయని చెరువులు, వాగులు, వంకలు చూసేందుకు వెళ్లవద్దన్నారు.

ఏండ్ల తరబడి కష్టపడి చదువుకున్న సర్టిఫికెట్లు మున్నేరు పాలు అయ్యాయని బాధిత విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుమారు 500 మంది విద్యార్థుల భవిష్యత్తు మున్నేరు వరద ప్రశ్నార్థకంగా చేసిందని అంటున్నారు. ప్రభుత్వం స్పందించి సర్టిఫికెట్లు పునర్ జారీ చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. కాగా చదువుకున్న విద్యార్థుల సర్టిఫికెట్లు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపిన విషయం తెలిసిందే

ఖమ్మం మున్నేరుకు వరద మళ్లీ పెరుగుతోంది. కాల్వఒడ్డు వద్ద ఉన్న మున్నేరు వాగు నీటిమట్టం ఉదయానికి 10 అడుగులుగా ఉండగా, ప్రస్తుతం 13 అడుగులకు చేరింది. క్రమంగా 3 అడుగుల మేర పెరిగింది. వరద నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. దీంతో నగర ప్రజలు భయాందోళన చెందుతున్నారు. ఇప్పటికే వరద ఉధృతికి సర్వం కోల్పోయామని, మళ్ళీ ముంపు ప్రాంతాలకు వరద చేరితే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు.

సత్తుపల్లి, వైరా నియోజకవర్గాల్లో రేపు పాఠశాలలు నడుస్తాయని ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. వరద ప్రభావితమైన పాలేరు, ఖమ్మం, మధిర నియోజకవర్గాల్లో రేపు విద్యాసంస్థలకు సెలవులు ఉంటాయని చెప్పారు. మండల విద్యాధికారులు అందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలన్నారు.

వైద్యం వికటించి నాలుగేళ్ల బాలుడు మృతి చెందిన సంఘటన పాల్వంచలో జరిగింది. మృతుడి బంధువులు తెలిపిన కథనం ప్రకారం.. పాల్వంచ పరిధిలోని సోనియా నగర్కు చెందిన ఆర్ఎంపీ చేసిన ఇంజక్షన్ కారణంగా తన కొడుకు చనిపోయాడని తల్లిదండ్రులు ఆరోపించారు. వైద్యుడి ఇంటి ముందు ధర్నా చేశారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
Sorry, no posts matched your criteria.