Khammam

News September 4, 2024

వరద సాయం కోసం BRS ప్రజాప్రతినిధుల నెల జీతం: MP వద్దిరాజు

image

వరద విపత్తులో ఉన్న ఖమ్మం ప్రజానీకానికి అండగా ఉంటామని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ప్రకటించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల ఒక నెల జీతాన్ని వరద సాయం కోసం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులందరి ఒక నెల జీతాన్ని వరద సహాయనిధి అకౌంట్‌కు జమ చేస్తామన్నారు. కష్టాల్లో ఉన్న ఖమ్మం ప్రజలకు అండగా ఉంటామని చెప్పారు.

News September 4, 2024

ఏజెన్సీలో 21 మంది ఉత్తమ ఉపాధ్యాయులు: DEO

image

రంపచోడవరం డివిజన్ 7 గిరిజన మండలాల్లో 21 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేశామని ఏజెన్సీ DEO.మల్లేశ్వరావు బుధవారం తెలిపారు. విధుల పట్ల అంకితభావంతో పనిచేసే ప్రతి మండలం నుంచి 3 సీనియర్ టీచర్లను ఎంపిక చేయడం జరిగిందన్నారు. గురుపూజోత్సవం సందర్భంగా గురువారం ITDA కార్యాలయంలో వీరిని సన్మానిస్తామని ఆయన ఓ ప్రకటనలో తెలిపారు.

News September 4, 2024

7,480 గృహాలు దెబ్బతిన్నాయి: మంత్రి

image

వరద ఉధృతి తగ్గడంతో శానిటేషన్ పనులు చురుగ్గా సాగుతున్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు. పది డివిజన్లలో మొత్తం 7,480 గృహాలు దెబ్బతిన్నాయని తెలిపారు. 5 జీసీబీలు , 50 ట్రాక్టర్లు, 75 వాటర్ ట్యాంకర్లు, 8 ఫైర్ ఇంజిన్లు, 600 మంది శానిటేషన్ సిబ్బందితో పనులు సాగుతున్నాయన్నారు. ఇళ్లలో బురద తొలగించేందుకు వాటర్ ట్యాంకర్లు ద్వారా నీళ్ళు సరఫరా చేస్తున్నామన్నారు. 12 హెల్త్ క్యాంప్‌లు ఏర్పాటు చేశామన్నారు.

News September 4, 2024

ఖమ్మంలో సాధారణ పరిస్థితి: తుమ్మల

image

ఖమ్మంలో వరద బాధితులు ఎవరు ఇబ్బంది పడకుండా చర్యలు చేపట్టినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పారు. సుమారు 1000 మంది వర్కర్లతో 40 జెసీబీలు, 133 ట్రాక్టర్లతో సహాయక చర్యలు చేపట్టినట్లు మంత్రి తుమ్మల చెప్పారు. ప్రస్తుతం ఖమ్మం నగరం నార్మల్ స్థితికి వచ్చిందని అన్నారు.

News September 4, 2024

భారీగా తగ్గిన మున్నేరు వరద

image

ఖమ్మం మున్నేరు వరద ప్రవాహం భారీగా తగ్గింది. 2 రోజుల క్రితం 36 అడుగుల మేర ప్రవహించిన వరద తగ్గుకుంటూ తాజాగా 10 అడుగులకు చేరింది. దీంతో లోతట్టు ప్రాంతాలు వరదనీటి నుండి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాయి. మున్నేరు పరివాహక ప్రాంతాలలో ఉన్న ప్రజలు ఇళ్లకి చేరుకుంటున్నారు. తమ ఇంట్లోకి వెళ్లి పరిస్థితిని చూసుకుని కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

News September 4, 2024

ఖమ్మం విద్యాసంస్థలకు: కలెక్టర్

image

ఖమ్మం జిల్లాలోని భారీ వర్ష సూచన దృష్ట్యా ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు యాజమాన్య విద్యాసంస్థలకు శుక్రవారం వరకు సెలవులు ప్రకటించినట్లు జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ ఓ ప్రకటనలో తెలిపారు. సెలవు నిబంధనను అన్ని విద్యాసంస్థలు కచ్చితంగా పాటించాలని కలెక్టర్ ఆదేశించారు.

News September 4, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} వరద ప్రభావిత ప్రాంతాల్లో ఖమ్మం జిల్లా కలెక్టర్ పర్యటన
∆} వైరాలో కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయనున్న ఎమ్మెల్యే
∆} సత్తుపల్లి  ఎమ్మెల్యే రాగమయి పర్యటన ∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవులు  ∆} అశ్వరావుపేటలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన
∆} భద్రాచలం వద్ద పెరుగుతున్న గోదావరి
∆} కొత్తగూడెం పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News September 4, 2024

ఖమ్మం: వరదల్లో పోయిన సర్టిఫికెట్లు ఈ నెల 11న జారీ

image

ఖమ్మం జిల్లాలో వరదతో సర్టిఫికెట్లు కోల్పోయిన వారి
కోసం ఈనెల 11న కలెక్టరేట్లో ప్రత్యేక శిబిరం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. అయితే, విదేశాల్లో ప్రవేశాలు, తదితర అవసరాలకు అత్యవసరంగా సర్టిఫికెట్లు అవసరమైతే హాట్ లైన్ నంబర్ తెలియజేయాలని.. వారికి ప్రొవిజనల్ సర్టిఫికెట్లు సమకూరుస్తామని చెప్పారు. మిగతా వారు ఈనెల 11న జరిగే శిబిరానికి హాజరుకావాలని కలెక్టర్ సూచించారు.

News September 4, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుస సెలవులు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా ఐదు రోజులు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోరిక మేరకు ఇవాళ రేపు, 6న సెలవు, 7,8న (శని, ఆదివారాలు) వారంతపు సెలవు సందర్భంగా ఐదు రోజులు సెలవు ప్రకటించినట్లు పేర్కొన్నారు. తిరిగి 9న (సోమవారం) నుంచి మార్కెట్లో పంట క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని ప్రకటించారు.

News September 4, 2024

‘గ్రామపంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు చేయాలి’

image

త్వరలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించి జిల్లా అధికార యంత్రాంగం అన్ని విధాల ఏర్పాట్లు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో ఎంపీడీవోలు, ఎమ్మార్వోలతో పలు అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బందికి విధుల కేటాయింపు వంటి పనులను వేగవంతం చేయాలని సూచించారు.