Khammam

News September 3, 2024

సర్టిఫికెట్స్ కోల్పోయిన వారు ఫిర్యాదు చేయండి: CM రేవంత్

image

మున్నేరు వరదల్లో సర్టిఫికేట్స్ కోల్పోయిన వారు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని వాటిని అందిస్తామని సీఎం రేవంత్ చెప్పారు. ఆకేరు వాగు వరద ఉద్ధృతి కారణంగా పట్టాదారు పాస్ పుస్తకాలు, ఆధార్ కార్డులు, ఇతర సర్టిఫికెట్స్ తడిచి పాడైన పోయిన వారు పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేయాలన్నారు. వారికి కొత్త కార్డులు, సర్టిఫికెట్స్ ఇవ్వవలసిందిగా అధికారులను అదేశించారు.

News September 3, 2024

సత్తుపల్లి చెరువులోకి దూకిన మహిళ.. కాపాడిన పోలీసులు..

image

ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళను పోలీసులు కాపాడిన ఘటన సత్తుపల్లిలో జరిగింది. జవహర్ నగర్‌కు చెందిన ఓ మహిళ కుటుంబ కలహాల నేపథ్యంలో సమీపంలోని తామర చెరువులోకి దూకింది. సమాచారం అందుకున్న సత్తుపల్లి పోలీసులు ఆమెను బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు. మహిళను కాపాడిన పోలీసులు ఇజ్జగాని చెన్నారావు, శ్రీనివాస్, ఇమ్రాన్, కరుణాకర్, రమాదేవిలను స్థానికులు అభినందించారు.

News September 3, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుస సెలవులు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు వరుసగా ఐదు రోజులు సెలవు ప్రకటించినట్లు మార్కెట్ ఉన్నత శ్రేణి కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. చాంబర్స్ ఆఫ్ కామర్స్ కోరిక మేరకు ఈ నెల 4,5,6న సెలవు, 7,8న (శని, ఆదివారాలు) వారంతపు సెలవు సందర్బంగా మొత్తం ఐదు సెలవు ప్రకటించినట్లు పేర్కోన్నారు. తిరిగి 9న (సోమవారం) నుంచి మార్కెట్లో పంట క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని ప్రకటించారు.

News September 3, 2024

ముంపు ప్రాంతాల ప్రజలకు అండగా ట్రైనీ పోలీసులు

image

ఖమ్మం రూరల్ మండలం కరుణగిరి పరిసరాలలోని రాజీవ్ గృహకల్ప, జలగం నగర్, ఖమ్మం టౌన్ పరిధిలోని బొక్కలగడ్డ, ధంసాలపూరం కాలనీ తదితర వరద ముంపు ప్రాంతాల్లో బాధితులకు అండగా 525 మంది ట్రైనీ కానిస్టేబుళ్లు పాల్గొంటున్నారు. సహాయ కార్యక్రమాల్లో పాల్గొని బాధితుల సాదారణ జన జీవనానికి సహాయ సహకారం అందిస్తున్నారని ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.

News September 3, 2024

కిన్నెరసానిలో పడి ఇద్దరు మృతి 

image

టేకులపల్లికి చెందిన సాయికుమార్, వెంకటేశ్వర్లు ఆదివారం సాయంత్రం రాయపాడు సమీపంలో గల్లంతవగా ఇవాళ వారి మృతదేహాలు లభ్యమయ్యాయి. సాయికుమార్ మృతదేహం బంగారుచిలక సమీపాన చింతకుంట వద్ద బోడిగుట్ట వాగు వద్ద లభించింది. వెంకటేశ్వర్లు మృతదేహం కిన్నెరసాని వాగు తోక బంధాల గ్రామ సమీపాన వాగు పక్కన ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

News September 3, 2024

పోయిన సర్టిఫికెట్లు అందిస్తాం: కలెక్టర్

image

ఖమ్మం మున్నేరు వరద ముంపు ప్రాంతాలను మంగళవారం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, ట్రైని కలెక్టర్‌లతో కలిసి జిల్లా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సందర్శించారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పలువురు బాధితులు ఇంట్లో సర్టిఫికెట్లు కొట్టుకుపోయాయని చెప్పగా, అధైర్య పడవద్దని, సర్టిఫికెట్లు అందిస్తామని చెప్పారు. డివిజన్ వారీగా ఎక్కువ వర్కర్లను పెట్టి త్వరగా శుభ్రపరచాలని అధికారులను ఆదేశించారు.

News September 3, 2024

అశ్విని కుటుంబాన్ని పరామర్శించనున్న సీఎం

image

నేడు MHBD జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ఈక్రమంలో పురుషోత్తమాయగూడెం శివారులోని ఆకేరువాగులో కొట్టుకుపోయిన సింగరేణి మండలం గంగారం తండాకు చెందిన యువ శాస్త్రవేత్త అశ్విని, మోతిలాల్ కుటుంబ సభ్యులను సీఎం పరామర్శించనున్నారు. ఉ10గం.కు అశ్విని, మోతిలాల్ చిత్రపటాలకు పూలమాలవేసి సీఎం నివాళులర్పిస్తారు. కాగా వీరు HYD వెళ్తుండగా ఆకేరువాగు వరద ప్రవాహానికి గల్లంతయిన విషయం తెలిసిందే.

News September 3, 2024

గణేశ్ మండపాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి: కలెక్టర్ జితేశ్

image

ప్రశాంత వాతావరణంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేశ్ వి పాటిల్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లో వినాయక చవితి నవరాత్రి ఉత్సవాల నిర్వహణ, నిమజ్జన ఏర్పాట్లపై రెవెన్యూ, పోలీస్, పంచాయతి రాజ్, అగ్నిమాపక, విద్యుత్, మున్సిపల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. గణేష్ మండపాలను తప్పని సరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు.

News September 2, 2024

ఇల్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలపై ఖమ్మం జిల్లా కలెక్టరేట్లో మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అంతకుముందు వరద బాధిత ప్రాంతాలను స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. భారీ వరదల కారణంగా ఇళ్లు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. నష్టపోయిన వారి వివరాలు సేకరించాలని అధికారులను ఆదేశించారు.

News September 2, 2024

ఖమ్మం జిల్లాలో విద్యాసంస్థలకు రేపు సెలవు 

image

భారీ వర్షాలు, వరదల కారణంగా ఖమ్మం జిల్లాలోని విద్యా సంస్థలకు రేపు సెలవు ప్రకటించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు మంగళవారం సెలవు ఇస్తూ ఖమ్మం జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఉత్తర్వులు జారీ చేశారు.