India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం జిల్లాలో సోమవారం కూడా అధిక వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో అధికారులు కేఎంసీ కార్యాలయంలో ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ కంట్రోల్ యూనిట్ ను ఏర్పాటు చేశారు. నగరంలో వర్షాల కారణంగా ప్రజలకు ఇబ్బందులు తలెత్తితే కాల్ సెంటర్ నంబర్లు 7901298265, 9866492029 ను సంప్రదించాలని కేఎంసీ కమిషనర్ అభిషేక్ అగస్త్య సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచినా వెంటనే ఈ నంబర్లకు సమాచారం అందించాలన్నారు.

ఖమ్మం జిల్లా నుండి హైదరబాద్‌కు ఆర్టీసీ బస్సులను నడుపుతున్నట్లు రీజనల్ మేనేజర్ సరిరామ్ తెలిపారు. జిల్లాలోని ఏడు డిపోల నుండి హైదరాబాదుకు బస్సులు నడుపుతున్నట్లు ఆయన తెలిపారు. నిన్న వర్షాల కారణంగా హైదరాబాద్ రూట్ ను రద్దు చేసిన అధికారులు తిరిగి ఈ రూట్లో బస్సులను పునరుద్ధరణ చేశారు.

ఖమ్మం నగరాన్ని అతలాకుతలం చేసిన మున్నేరు వరద కాస్త శాంతించింది. నిన్న వాగు సామర్థ్యం కంటే అత్యధికంగా వరద పెరిగి 36 అడుగుల ఎత్తుకు చేరుకోవడంతో పరీవాహక ప్రాంతాలు మొత్తం నీటిలో మునిగిపోయాయి. తాజాగా నీటిమట్టం 23.50 అడుగులకు చేరింది. సుమారు 12 అడుగులు మేర తగ్గింది.

భారీ వర్షాల నేపథ్యంలో సోమవారం ఖమ్మం జిల్లాలోని అన్ని విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రయివేటు యాజమాన్య విద్యాసంస్థలకు జిల్లాలో నెలకొన్న తుఫాను, భారీ వర్ష పరిస్థితుల దృష్ట్యా సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

వరదలతో అతలాకుతలమైన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లాల్లో తక్షణమే సహాయక చర్యలు చేపట్టి ప్రజల్ని ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్నేరు నది పోటెత్తడంతో కనీవినీ ఎరుగని వరదల వల్ల ఐదుగురు మృత్యువాత పడడంపై ఆయన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఖమ్మంలో వందలాది ఇల్లు ముంపునకు గురై ప్రజలు నిరాశ్రయులయ్యారని చెప్పారు.

చర్ల మండలంలోని తాలిపేరు మధ్యతరహా ప్రాజెక్టులో ఆదివారం 25 గేట్లను ఎత్తి ఎగువ నుంచి వస్తున్న వరదను దిగువ గోదావరి విడుదల చేస్తున్నారు. తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ఇక్కడి ప్రాజెక్టులో వరద ఉద్ధృతి పెరిగింది. ఎగువ ప్రాంతమైన ఛత్తీస్‌గఢ్ సైతం వర్షాలు కురుస్తుండటంతో జలాశయానికి 44,700 క్యూ సెక్కుల మేర వరద నీరు వస్తోంది. దీంతో ప్రాజెక్టు నుంచి 40,962 క్యూసెక్కుల మేర గోదావరికి విడుదల చేస్తున్నారు.

తుఫాను ప్రభావంతో ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు నరకయాతన పడుతున్నారని ఎంపీ రేణుకా చౌదరి అన్నారు. మేమున్నాం మీకేం కాదనే ధైర్యాన్ని వారికి ఇవ్వాలని అధికారులను, నాయకులను కోరారు. ప్రజలకు కావాల్సిన అన్ని ఏర్పాట్లను అధికారులతో కలిసి సమన్వయం చేయాలని సూచించారు. జిల్లాలో వరద పరిస్థితిపై ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇలాంటి పరిస్థితి రావడం దురదృష్టకరమని విచారం వ్యక్తం చేశారు.

ఖమ్మం నుంచి ఆదిలాబాద్ వరకు గోదావరి నది తీరం వెంబడి అధికారులు 24/7 అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక ఆదేశాలు జారీచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఖమ్మం నుంచి అన్ని జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మంత్రి పొంగులేటి, చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి పాల్గొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు.

భారీ వర్షాల వలన ఏర్పడిన అత్యవసర పరిస్థితుల దృష్ట్యా అధికారులు అందరూ తమ సెలవలను రద్దు చేసుకుని క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి పునరావాస చర్యల్లో నిమగ్నం అవ్వాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. ఉద్ధృతి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు పునరావాస కేంద్రాలను వాడుకోవాలని సూచించారు. ప్రజలు హెల్ప్‌లైన్‌లను వినియోగించుకోవాలని అత్యవసర పరిస్థితి ఉంటే తప్పా బయటకు రావద్దని కోరారు.

ఖమ్మం జిల్లాలో రెండురోజులుగా వర్షాలు దంచికొడుతున్నాయి. ఖమ్మం గ్రామీణ మండలం వాల్యతండాలో చెరువు తెగింది. దీంతో తండాలోని ఓ ఇంట్లో 6 వ్యక్తులు చిక్కుకున్నారు. ఆ కుటుంబాన్ని కాపాడేందుకు వెళ్లి మరో నలుగురు అదే వరదలో చిక్కుకున్నారు. అటూ తీర్థాల వద్ద మరో ఆరుగురు చిక్కుకున్నారు. 16 మంది బాధితులు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు.
Sorry, no posts matched your criteria.