India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత రెండు రోజుల నుండి భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు వంతెనలు వద్ద వరద ప్రభావం భారీగా ఉండటం వల్ల జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని డిపోల బస్సు సర్వీసుల రద్దు చేయడం వల్ల బస్సుల అన్నీ డిపోలకే పరిమితమైనట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. వరద ప్రభావం తగ్గిన వెంటనే సర్వీసులను పునరుద్ధరణ చేయనున్నట్లు తెలిపారు.

> భద్రాద్రి, ఖమ్మం జిల్లాకు రెడ్ అలెర్ట్ జారీ
> ఖమ్మం మున్సిపాలిటీలో ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ ఏర్పాటు
> ఖమ్మం, భద్రాద్రి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు
> ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు, వంకలు
> భారీ వర్షాలతో అప్రమత్తమైన అధికార యంత్రాంగం
> జలకళను సంతరించుకుంటున్న చెరువులు

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా వర్షం దంచికొడుతుంది. భద్రాద్రి జిల్లా అశ్వాపురం మండలం వెంకటాపురం వద్ద వాగులో ఇద్దరు వ్యక్తులు గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో నీలయ్య మృతదేహం లభ్యమైంది. మరొకరైన ఆడెమ్మ ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో ఖమ్మం మున్సిపాలిటీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కమిషనర్ అభిషేక్ అగస్త్య సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో నగరపాలక సంస్థ నందు ఎమర్జెన్సీ హెల్ప్ లైన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో ఉన్న ప్రజలందరూ ఏమైనా ఇబ్బంది ఉంటే 7901298265 నెంబర్కు ఫోన్ చేసి సమస్యను తెలియజేయాలన్నారు.

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఎడతెరిపిలేని వర్షం కురుస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాలవాసులు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్లు, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ఎప్పటికప్పుడు జిల్లాలోని పరిస్థితులపై సమీక్షిస్తూ వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

ఖమ్మం: రాబోయే 2,3 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. కావున ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరం అయితే తప్ప ప్రయాణాలు చేయవద్దని కోరారు. లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉండే ప్రజలకు కావాల్సిన ఏర్పాట్లను సంబంధిత అధికారులు పర్యవేక్షించాలని ఆదేశించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఆర్టీసీ డ్రైవర్లు అప్రమత్తంగా ఉండాలని TGSRTC రీజనల్ మేనేజర్ సరిరామ్ తెలిపారు. వాగులు, వంతెనలు దాటేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎట్టి పరిస్థితిలోనూ వాహనాలు నడిపేటప్పుడు సెల్ఫోన్ మాట్లాడొద్దని ఆదేశాలు జారీ చేశారు.

వైరా నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ కోసూరి శ్రీనివాసరావు శనివారం ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను ఆత్మ కమిటీ చైర్మన్ ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఎంపీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు పుల్లయ్య కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. భారీ వర్షాలతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, కావున అత్యవసరం అయితేనే ప్రజలు ఇంటి నుండి బయటకు రావాలని సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.

ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తాజాగా వాతావారణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. ఈ రెండు జిల్లాలకు పింక్ అలర్ట్ ప్రకటించారు. మరో 48 గంటల పాటు వర్షం దంచికొట్టే అవకాశం ఉందని, వరదలు ముంచెత్తే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.
Sorry, no posts matched your criteria.