India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
భదాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలం సీఎస్పీ బస్తీ సింగరేణి సీ4 క్వార్టర్లో విషాదం జరిగింది. జిమ్మేదారి కామరాజు మనువరాలు అనిక (5) ఆదివారం అర్ధరాత్రి టాయిలెట్‌కు వెళ్లి వస్తుండగా జారిపడి చనిపోయింది. తల వెనుక భాగంలో బలమైన గాయమవ్వడంతో చిన్నారి కుప్పకూలిపోయింది. కుటుంబ సభ్యులు హుటాహుటిన సింగరేణి వైద్యశాలకు తరలించిగా పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు ధ్రువీకరించారు.
తెలంగాణలో లోక్ సభ నామినేషన్ల గడువు ఈనెల 25తో ముగియనుంది. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారం చేస్తున్నాయి. అయితే అధికార కాంగ్రెస్ మాత్రం ఖమ్మంతో పాటు 2 స్థానాల్లో అభ్యర్థులను పెండింగ్లో పెట్టింది. ఖమ్మం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపికపై సస్పెన్స్ కొనసాగుతోంది. దీంతో కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలియకుండా ప్రచారమెలా చేయాలని కార్యకర్తలు అడుగుతున్నారు.
ఖమ్మం జిల్లా కొణిజర్ల మండల పరిధిలోని అంజనాపురానికి చెందిన గ్రామ పంచాయతీ కార్మికుడు భూక్య ప్రసాద్ పంచాయతీ కార్యదర్శి వేధింపులకు గురి చేస్తున్నాడని మనస్థాపంతో గత కొద్ది రోజుల కిందట పురుగుమందు తాగాడు.. కాగా ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. ఆయన మృతి పట్ల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ జిల్లా నాయకులు పిట్టల మల్లయ్య సంతాపాన్ని వ్యక్తం చేశారు.
ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూములకు ఈవీఎంలను తరలిస్తున్నట్లు కలెక్టర్ గౌతమ్ తెలిపారు. ఖమ్మం కలెక్టరేట్లోని గోడౌన్ నుంచి నియోజకవర్గాలకు కేటాయించిన ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్‌లకు ఆదివారం తరలించారు. ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలకు సంబంధించి పొన్నెకల్‌లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో, సత్తుపల్లికి స్థానిక జ్యోతి నిలయం హైస్కూల్లో స్ట్రాంగ్ రూంలు ఏర్పాటు చేశామని వివరించారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో సోమవారం పత్తి, మిర్చి ధరలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. క్వింటా మిర్చి ధర రూ.19,000 జెండా పాట పలకగా, క్వింటా పత్తి ధర రూ.7,150 జెండాపాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు కంటే ఈ రోజు మిర్చి ధర రూ.500 తగ్గగా, పత్తి ధర మాత్రం స్థిరంగా కొనసాగుతుందని వ్యాపారస్తులు తెలిపారు. మార్కెట్ కు వచ్చే రైతులు నిబంధనలు పాటిస్తూ క్రయవిక్రయాలు జరుపుకోవాలని సూచించారు.
ప్రభుత్వ పాఠశాలలకు పోస్ట్పెయిడ్ సిమ్ కార్డులు అందజేసేందుకు తెలంగాణ సమగ్ర శిక్ష ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలకు ట్యాబులు అందజేశారు. సిమ్ కార్డులు ఇవ్వకపోవడంతో అవి వృథాగా ఉన్నాయి. రిలయెన్స్ జియో పోస్ట్పెయిడ్ సిమ్ కార్డులు అందజేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో వినియోగంలోకి తెచ్చేందుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా అధికారులు ఫోకస్ పెట్టారు.
ఎన్నికల షెడ్యూల్ వెలువడి దాదాపు నెల రోజులు అవుతోంది. నామినేషన్ ప్రక్రియ ప్రారంభమై 4రోజులైనా ఖమ్మం కాంగ్రెస్ MP అభ్యర్థిపై స్పష్టత రాలేదు. ఇదిలా ఉండగా BJP, BRS అభ్యర్థులు నెల కిందటే ఖరారై .. ప్రచారం కూడా ప్రారంభించారు. ఈ క్రమంలో ఇప్పటి వరకు ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిని ప్రకటించకపోవడంతో అభ్యర్థి ఎవరు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది.
దమ్మపేటలో అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందాడు. ఎస్సై సాయికిషోర్ రెడ్డి కథనం ప్రకారం.. ఆదివారం కొంతమందితో కలసి సదరు యువకుడు ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లాడు. కొద్దిసేపటికి పురుగుమందు తాగి మృతి చెందాడని తల్లిదండ్రులకు సమాచారం అందింది. అనుమానం వచ్చిన తల్లి పోలీసులకు పూర్వక ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు
ఖమ్మం ఎంపీ టికెట్‌పై సస్పెన్స్ కొనసాగుతోన్న వేళ తెరపైకి మరో పేరు వచ్చింది. జిల్లాకు చెందిన రాయల నాగేశ్వరరావును ఎంపీ అభ్యర్థిగా కొందరు ప్రతిపాదించినట్లు సమాచారం. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఆయనను గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌గా నియమించింది. ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో బాధ్యతలు స్వీకరించలేదు. ఈ స్థానానికి తీవ్ర పోటీ నెలకొన్న వేళ కొందరు రాయల పేరును ప్రతిపాదిస్తున్నారు.
∆} ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} అన్నపురెడ్డిపల్లి శివాలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన
∆} ఇల్లెందు మండలంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య పర్యటన
∆} ఖమ్మం రూరల్ మండలంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం
Sorry, no posts matched your criteria.