Khammam

News August 29, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓భద్రాద్రి జిల్లాలో ఎంపీ రామ సహాయం రఘురాం రెడ్డి పర్యటన
✓వివిధ శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష
✓పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
✓తల్లాడ లో ఎమ్మెల్యే రాగమయి దయానంద్ పర్యటన
✓బోనకల్లో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓నేలకొండపల్లిలో బీజేపీ కార్యకర్తలు సమావేశం
✓ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సీజనల్ వ్యాధిపై అవగాహన కార్యక్రమం

News August 29, 2024

ములకలపల్లి: 30న గురుకుల కళాశాలలో స్పాట్ అడ్మిషన్స్

image

ములకలపల్లి గురుకుల బాలికల కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ సునీత బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీలో ప్రథమ సంవత్సరంలో మిగిలిన సీట్ల భర్తీకి ఈనెల 30వ తేదీన స్పాట్ అడ్మిషన్లు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అసక్తి గల విద్యార్థులు ఒరిజినల్ సర్టిఫికేట్లతో పాటు, ఆధార్‌కార్డు, కుల ధ్రువీకరణ పత్రాలతో హాజరు కావాలని తెలిపారు.

News August 28, 2024

యూపీ వ్యవసాయ శాఖ మంత్రిని కలిసిన మంత్రి తుమ్మల

image

రాష్ట్ర పర్యటనకు వచ్చిన ఉత్తరప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సూర్యప్రతాప్ షాహిని బుధవారం ITC కోహినూర్ లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రస్తుత వ్యవసాయ పరిస్థితులపై ఇరురాష్ట్రాల మంత్రులు చర్చించారు. తెలంగాణలో రైతుల సంక్షేమం కోసం తీసుకొంటున్న చర్యలను మంత్రి తుమ్మల యూపీ మంత్రికి వివరించారు.

News August 28, 2024

కమనీయం భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో బుధవారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 4 గంటలకే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం రామయ్య నిత్య కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

News August 28, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} చుంచుపల్లిలో జాబ్ మేళా
∆} చండ్రుగొండలో ఎమ్మెల్యే జారే పర్యటన
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఖమ్మం జిల్లా కలెక్టర్ పలు శాఖలపై సమీక్ష
∆} సత్తుపల్లిలో డాక్టర్ దయానంద్ పర్యటన
∆} ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ఓటర్ సర్వే
∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News August 28, 2024

రుణమాఫీపై ఫిర్యాదులు, రంగంలోకి అధికారులు

image

రైతు రుణమాఫీ ఫిర్యాదులపై వ్యవసాయ అధికారులు రంగంలోకి దిగనున్నారు. ఖమ్మం జిల్లాలో మాఫీ వర్తించని కుటుంబాలను నిర్ధారించే ప్రక్రియ బుధవారం నుంచి చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. రూ.2లక్షల లోపు రుణాలు కలిగిన రైతు కుటుంబ సభ్యుల వివరాలను పంట రుణమాఫీ పోర్టల్‌లో అధికారులు నమోదు చేయనున్నారు. జిల్లాలో సుమారు 50వేల కుటుంబాలకు ఇవాల్టి నుంచి నిర్ధారణ ప్రక్రియ మొదలుకానుంది.

News August 28, 2024

ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలి: తుమ్మల

image

ఖమ్మం: ప్రభుత్వ భూముల పరిరక్షణకు పటిష్ట చర్యలు చేపట్టాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. మంగళవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గ రెవెన్యూ, హౌజింగ్ అధికారులతో రెవెన్యూ, హౌజింగ్ పై మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ స్థలాల పరిరక్షణ బాధ్యత మనపై ఉందన్నారు. ప్రభుత్వ భూములను గుర్తించి అట్టి స్థలం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని అధికారులను మంత్రి సూచించారు.

News August 27, 2024

ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ బోధన: జిల్లా కలెక్టర్

image

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీషు బోధన మెరుగుపరచడానికి ప్రణాళికాబద్ద చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో విద్యాశాఖ అధికారులు, ఇంగ్లీష్ మాధ్యమ ఉపాధ్యాయులతో ఇంగ్లీష్ బోధనపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రతి పాఠశాలలో అర గంట క్రీడలకు అన్ని తరగతుల వారికి, అరగంట ఇంగ్లీష్ బోధన ఎంపిక చేసిన తరగతుల వారికి తప్పక ప్రతిరోజు కేటాయించాలని పేర్కొన్నారు.

News August 27, 2024

మద్యం మత్తులో ఒంటిపై పెట్రోల్ పోసుకున్న వ్యక్తి

image

మద్యం మత్తులో ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆపై నిప్పంటించుకున్న ఘటన మంగళవారం కొత్తగూడెం పట్టణంలో చోటు చేసుకుంది. హనుమాన్ బస్తీకి చెందిన ఇమ్మానుయేల్(54) ఆటో డ్రైవర్ గా వృత్తి నిర్వహిస్తున్నాడు. కాగా మద్యం మత్తులో ఉన్న ఇమ్మానుయేల్ ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ ఘటనలో 90% శరీరం కాలిపోయింది. గాయపడిన వ్యక్తిని స్థానికులు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.

News August 27, 2024

భద్రాచలం: 28 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

image

ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి ప్రవాహం పెరుగుతుందని అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రం 27 అడుగుల వద్ద ఉన్న నీటి ప్రవాహం మంగళవారం ఉదయం 10 గంటలకు 28 అడుగులకు చేరుతుందని అధికారులు తెలిపారు. మంగళవారం సాయంత్రానికి గోదావరి 30 అడుగుల వరకు చేరే అవకాశం ఉందని అధికారులు తెలిపారు లోతట్టు ప్రాంత ప్రజల అప్రమత్తంగా ఉండాలి అధికారులు పేర్కొన్నారు.