India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం జిల్లాలో రెండు నెలల కిందటి వరకు భగ్గుమన్న కూరగాయలు ధరలు నెమ్మదిగా దిగొస్తున్నాయి. పెరిగిన ధరలు సామాన్యులపై ప్రభావం చూపాయి. ఏ రకం కొనుగోలు చేయాలన్న కిలో రూ.40పైనే. ప్రస్తుత వాతావరణం అనుకూలంగా ఉండడంతో అన్ని ప్రాంతాల్లో దిగుబడి పెరగడంతో ధరలు తక్కువ ముఖం పట్టాయి. గత నెలలో టమాట రూ.68 ఉండగా ప్రస్తుతం రూ.29 రూపాయలకు చేరింది. కాకరకాయ రూ.58 రూపాయలు ఉండగా నేడు రూ.24 లభిస్తున్నాయి.

ఎన్నికలకు ముందు రైతుభరోసా కింద
ఎకరానికి రూ.7,500 చొప్పున.. రెండు సీజన్లకు కలిపి రూ.15వేలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే మరో నెలలో వానాకాలం పంటల సీజన్ ముగుస్తుండటంతో రైతు భరోసా ఇంకెప్పుడిస్తారని రైతన్నలు ఎదురుస్తున్నారు. ఇందుకు 5 లేదా 10 ఎకరాలకు సీలింగ్ విధించాలని సర్కార్ చూస్తోంది. ఖమ్మం జిల్లాలో 3,42,803 మంది రైతులు, భద్రాద్రిలో 1.70 లక్షల మంది ఉన్నారు.

తమ ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఏర్పాటుకు తొలి ఏడాదే ఐదు వేల కోట్లు కేటాయించినట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రెసిడెన్షియల్ స్కూల్స్ కు కేవలం ఏడాదికి రూ.3 కోట్లు మాత్రమే మౌలిక వసతుల కల్పన కోసం ఖర్చు చేసిందని, ఈ ఏడాది 3 కోట్ల నుంచి రూ.5 వేల కోట్లకు కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిందన్నారు.

ఖమ్మంకు రైల్వే వ్యాగన్ల ద్వారా సోమవారం
1,313 మెట్రిక్ టన్నుల యూరియా దిగుమతి అయింది. ఆర్సీఎఫ్ కంపెనీకి చెందిన ఈ యూరియాను ఖమ్మం, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని గోదాంలకు ఇక్కడ నుంచి లారీల్లో పంపించారు. భద్రాద్రి జిల్లాకు 700 మెట్రిక్ టన్నులు, ఖమ్మం జిల్లాకు 313, మహబూబాబాద్ జిల్లాకు 300 మెట్రిక్ టన్నుల చొప్పున యూరియా పంపించామని అధికారులు తెలిపారు.

> ఖమ్మంలో మంత్రి తుమ్మల పర్యటన
> నేడు అశ్వారావుపేట మండలంలో ఎమ్మెల్యే జారే పర్యటన
>నేడు ముదిగొండలో వృద్ధులకు ఉచిత వైద్య శిబిరం
> భద్రాద్రి రామయ్య, పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు
> ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్న ఇరు జిల్లాల కలెక్టర్లు
> భద్రాద్రి జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సివిల్స్ ప్రిలిమ్స్ లో ఉత్తీర్ణులైన విద్యార్థులకు రూ. లక్ష ఆర్థిక సాయం తమ సర్కార్ అందిస్తోందని డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చెప్పారు. సాయం తక్కువే అయినా అభ్యర్థులను ప్రోత్సహించడమే తమ లక్ష్యమన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణ నుంచి ఎక్కువ మంది సివిల్స్ లో ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు.

కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యాభర్తలు పురుగులు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన సోమవారం అశ్వాపురం మండలంలో చోటు చేసుకుంది. మల్లెల మడుగు గ్రామానికి చెందిన భార్యాభర్తలు పురుగులు మందు తాగి అపస్మారక స్థితిలో ఉన్నారు. వెంటనే స్థానిక ప్రజలు వీరిని చికిత్స నిమిత్తం భద్రాచలం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

హైదరాబాద్ పంజాగుట్టలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మణుగూరు బీటీపీఎస్‌కు చెందిన ఎస్పీఎఫ్ ఎస్సై శంకర్ రావు కూతురు ప్రసన్న మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్సై శంకర్ రావు తన కూతురు ప్రసన్నతో కలిసి బైక్‌పై వెళ్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో ఎస్సై శంకర్రావు గాయాలతో బయటపడగా, ప్రసన్నకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందింది.

గ్రామ పంచాయతీ ఎన్నికల కోసం ఆశావాహులు ఎదురుచూస్తున్నారు. గత ఫిబ్రవరి నెలలో సర్పంచుల పదవీకాలం ముగియగా, నాటి నుంచి గ్రామ సచివాలయాల పరిపాలన ప్రత్యేక అధికారుల చేతిలోకి వెళ్ళింది. లోకసభ ఎన్నికలు పూర్తికాగానే రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతుందని అందరూ ఊహించారు. అయితే బిసి జనాభా బీసీ గణన పూర్తయిన తర్వాతే ఎన్నికల నిర్వహిస్తారని సంకేతాలు రావడంతో ఆశావాహుల ఆశలపై నీళ్లు చల్లినట్లైంది.

హైదరాబాదులో చెరువులు, ప్రభుత్వ భూముల పరిరక్షణకు ఏర్పాటు చేసిన “హైడ్రా” మంచిదేనని, అయితే పేద ప్రజల జోలికి వెళ్లకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కొత్తగూడెం ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. అక్రమార్కులపై కొరడా ఝళిపించాలన్నారు. ఆ భూములను ప్రభుత్వ స్వాధీనం చేసుకోవాలన్నారు.
Sorry, no posts matched your criteria.