Khammam

News August 26, 2024

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో మార్పులు

image

ఖమ్మం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అనేక మార్పులు జరగనున్నాయి. కొత్తగా మధిర డివిజన్‌ ఏర్పాటుతో పాటు పలు స్టేషన్ల డివిజన్లను మార్చనున్నారు. ఖమ్మం గ్రామీణంలోని పెద్దతండా పంచాయతీ కేంద్రంగా మున్సిపాలిటీ ఏర్పాటుకు ప్రతిపాదనకు రంగం సిద్ధమైంది. దీనికి అనుగుణంగా ఎం. వెంకటాయపాలెం, తిరుమలాయపాలెం మండలం సుబ్లేడులో ఇన్ స్పెక్టర్ స్థాయి కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు.

News August 26, 2024

ప్రధాని మోదీ గ్లోబల్ లీడర్: పొంగులేటి సుధాకర్ రెడ్డి

image

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓ గ్లోబల్ లీడర్ అని ఆయన అవలంభిస్తున్న విధానాల పట్ల అగ్ర దేశాలు సైతం ప్రశంసలు కురిపిస్తున్నాయని బీజేపీ జాతీయ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. ఖమ్మంలోని ఓ హోటల్లో ఆదివారం ఆ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, పొంగులేటి సుధాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ హాజరయ్యారు.

News August 26, 2024

రిజిస్ట్రేషన్ శాఖకు శాశ్వత భవనాలు: మంత్రి పొంగులేటి

image

రిజిస్ట్రేషన్ శాఖకు శాశ్వత భవనాలను త్వరలోనే ప్రభుత్వం అందుబాటులోకి తెస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. రిజిస్ట్రేషన్ & స్టాంపింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన ఇంటరాక్టివ్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. రిజిస్ట్రేషన్ల కోసం వచ్చే ప్రజలకు ఇబ్బంది కలగకుండా అధికారులు పారదర్శకంగా సేవలు అందించాలని సూచించారు. రెండేళ్లలో శాశ్వత భవనాలలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు జరుగుతాయని తెలిపారు.

News August 25, 2024

ఖమ్మం: గోల్డ్ మెడల్ సాధించిన కానిస్టేబుల్ దంపతులు

image

 HYDలో ఆదివారం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఎన్ఎండీసీ మారథాన్లో మద్దులపల్లికి చెందిన కానిస్టేబుళ్లు రేగళ్ల గోపీ, బీరెల్లి లక్ష్మీ దంపతులు గోల్డ్ మెడల్ సాధించారు. గోపీ 42.2 కిలోమీటర్ల పరుగు పందెంలో 4.17 ని.ల్లో విజయం సాధించగా, లక్ష్మీ 21.1 కి.మీ రేంజ్లో 2.38 ని.ల సమయంలో గమ్యం చేరుకుని విజయం సాధించారు. గోపీ గన్ మెన్‌గా, లక్ష్మీ తిరుమలాయపాలెం PSలో రిసెప్షనిస్ట్‌గా పని చేస్తున్నారు.

News August 25, 2024

ఖమ్మం జిల్లాలో సీఎంఆర్ఎఫ్‌లో భారీ కుంభకోణం

image

ముఖ్యమంత్రి సహాయనిధి పథకం ఖమ్మం జిల్లాల్లో పక్కదారి పట్టినట్లు సీఐడీ తెలిపింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రైవేటు ఆసుపత్రుల పేరిట నకిలీ బిల్లులు సృష్టించి సీఎంఆర్ఎఫ్‌కు దరఖాస్తు చేసినట్లు సీఐడీ గుర్తించింది. ఈ నెల 23న ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు. త్వరలోనే కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేయనున్నట్లు సిఐడి అధికారులు తెలిపారు.

News August 25, 2024

సీతారాం ప్రాజెక్టు కాలువలో పడి ఇద్దరి మృతి

image

సీతారాం ప్రాజెక్టు కాలువలో పడి ఇద్దరు మృతి చెందిన ఘటన ఆదివారం బూర్గంపాడు మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల ప్రకారం.. జింకలగూడెం సీతారాం ప్రాజెక్టు కాలువలో ఇద్దరు గల్లంతయ్యారని సమాచారం అందుకున్న ఎస్సై రాజేశ్ గజ ఈతగాళ్లతో గాలించి మృతదేహాలను బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. వీరు ప్రమాదవశాత్తు పడిపోయారా? లేక ఆత్మహత్య చేసుకున్నారన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది.

News August 25, 2024

రేపు ఉమ్మడి ఖమ్మం జిల్లాకి మంత్రి పొంగులేటి

image

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో సోమవారం మంత్రి పొంగులేటి పర్యటించనున్నట్లు మంత్రి పీఏ తెలిపారు. ముందుగా ఆయన పాల్వంచ, కొత్తగూడెం మున్సిపాలిటీలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారన్నారు. అనంతరం ఖమ్మం నగరంలో నిర్వహించే పలు ప్రైవేట్ కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. తదనంతరం కూసుమంచి క్యాంపు కార్యాలయంలో గీత కార్మికులకు కాటమయ్య సేఫ్టీ కిట్లను పంపిణీ చేస్తారని పేర్కొన్నారు.

News August 25, 2024

ఘనంగా రామయ్యకు సువర్ణ పుష్పార్చన

image

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో ఆదివారం స్వామివారికి అర్చకులు సువర్ణ పుష్పార్చన నిర్వహించారు. ఉదయం 4 గంటలకే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపి నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. నిత్య కళ్యాణంలో 75 దంపతులు పాల్గొన్నారన్నారు.

News August 25, 2024

ఖమ్మం: శ్రావణమాసం ఎఫెక్ట్.. తగ్గిన చికెన్ అమ్మకాలు

image

శ్రావణమాసం, విష జ్వరాలతో చికెన్ అమ్మకాలు గణనీయంగా తగ్గాయి. దీంతో కోళ్ల పరిశ్రమ ఒడిదొడుకులు ఎదుర్కొంటోంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో రోజుకు 2.8 లక్షల కిలోల చికెన్ వినియోగం జరిగేదని, ప్రస్తుతం అది సగానికి పరిమితం అయ్యిందని వ్యాపారస్థులు వాపోయారు. అమ్మకాలు తగ్గడంతో ధరలు పడిపోయాయని అంటున్నారు. కిలో బాయిలర్ చికెన్ ధర రూ.350 నుంచి రూ.170కి, రూ.150 పలికిన లైవ్ ధర రూ.100కి పడిపోయింది.

News August 25, 2024

ఈనెల 28, 29 తేదీల్లో సింగరేణి మెడికల్ బోర్డ్

image

ఈ నెల 28, 29 తేదీల్లో కొత్తగూడెంలోని సింగరేణి ప్రధానాసుపత్రిలో మెడికల్ బోర్డ్ నిర్వహించనున్నారు. మొదటిరోజు ప్రీ మెడికల్, రెండో రోజు మెడికల్ బోర్డ్ నిర్వహించి, కార్మికుల అనారోగ్య సమస్యలను గుర్తించి, మెడికల్ రిపోర్ట్ ఆధారంగా కార్మికులను అన్ ఫిట్(ఇన్వాలిడేషన్) చేయనున్నారు. మెడికల్ బోర్డులో ఇన్వాలిడేషన్ అయిన కార్మికుల పిల్లలకు కారుణ్య నియామకాల్లో ఉద్యోగ అవకాశం కల్పించనున్నారు.