Khammam

News April 19, 2024

KTDM: ఎంపీటీసీ దారుణ హత్య

image

కన్నాయిగూడెం ఎంపీటీసీ పర్స బాలకృష్ణ దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు తలపై బండరాయితో మోది హత్య చేసినట్లు తెలుస్తోంది. స్థానికుల ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రాజకీయ కక్షల నేపథ్యంలోని హత్య జరిగినట్లు తెలుస్తుంది.

News April 19, 2024

ఖమ్మం: కాంగ్రెస్ పార్టీలో అదే ఉత్కంఠ

image

ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవడంతో అభ్యర్థిని ప్రకటనపై కార్యకర్తలు ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటికే ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్‌ఛార్జిగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని నియమించారు. అలాగే డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అభ్యర్థి తరపున ప్రచారంలో పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.

News April 19, 2024

సింగరేణిలో 327 ఉద్యోగాలు.. అర్హతలివే

image

సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్(SCCL)లో ఖాళీగా ఉన్న 327 ఎగ్జిక్యూటివ్, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ను సింగరేణి అధికారులు విడుదల చేశారు. సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణులైన వారు మే 4వ తేదీలోపు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలు, దరఖాస్తు చేయడం కోసం https://scclmines.com/ వెబ్ సైట్‌ను సందర్శించవచ్చని సింగరేణి అధికారులు తెలిపారు.

News April 19, 2024

ఖమ్మం: ఎండిపోతున్న చెరువులు..

image

వర్షాభావానికి తోడు ఎండల తీవ్రతతో జిల్లాలో పలు చెరువుల్లో నీరు అడుగంటి నెర్రెలు బారుతున్నాయి. సాగునీటి కొరతతో రైతులు ఇప్పటికే ఆశలు వదిలేసుకున్నారు. చెరువులో ఉన్న కొద్దోగొప్ప నీటితో చేపలు బతుకుతాయని ఆశిస్తున్న మత్స్యకారులకు నిరాశే ఎదురవుతోంది. చెరువులు ఎండి లక్షల్లో చేపలు మృత్యువాత పడుతుండడంతో ఉపాది లేదని వారు ఆందోళన చెందుతున్నారు.

News April 19, 2024

గ్యాస్ సబ్సిడీ డబ్బు బ్యాంకు ఖాతాలో జమ కాలేదా..?

image

రూ.500 గ్యాస్ సిలిండర్ సబ్సిడీ డబ్బులను పౌరసరఫరాల శాఖ ఇప్పటికే చాలా మంది అకౌంట్లలో డబ్బులు జమ చేస్తున్నా.. ఖమ్మం జిల్లాలో కొంత మందికి ఇంకా గ్యాస్ డబ్బులు జమ కాలేదు. దీనికి లబ్దిదారులు LPG గ్యాస్ కనెక్షన్ కోసం e-KYC చేయకపోవడమే కారణమని తాజాగా పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. గ్యాస్ కనెక్షన్లు కలిగిన 30% మంది మాత్రమే e-KYC చేసుకున్నారని, మిగత వారు వెంటనే e-KYC చేసుకోవాలని సూచించింది.

News April 19, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఖమ్మంలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం
∆} సత్తుపల్లి మండలంలో కాంగ్రెస్ కార్యకర్తల సమావేశం
∆} బీజేపీ ఎంపీ అభ్యర్థి తాండ్ర వినోద రావు నామినేషన్ ర్యాలీ
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} మణుగూరులో విద్యుత్ సరఫరాలో అంతరాయం

News April 19, 2024

ఖమ్మంలో ఒకటే నామినేషన్

image

లోక్‌సభ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలైంది. ఖమ్మంలో తొలి రోజు ఒకటే నామినేషన్ దాఖలైంది. అలయెన్స్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఆదార్‌) అభ్యర్థిగా కుక్కల నాగయ్య గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఇక బీఆర్ఎస్ ఖమ్మం లోక్ సభ అభ్యర్థి నామా నాగేశ్వరరావుకు కేసీఆర్ బీ-ఫాం అందుజేశారు.

News April 19, 2024

ఖమ్మం: ‘ఎన్నికల వ్యయ పరిశీలన పారదర్శకంగా జరగాలి’

image

ఎన్నికల వ్యయ పరిశీలన పారదర్శకంగా చేపట్టాలని ఎన్నికల వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రసాత్ కృష్ణస్వామి, శంకర నంద్ మిశ్రాలు అన్నారు. ఈ సందర్భంగా వ్యయ పరిశీలకులు, ఖమ్మం ఎన్నికల అధికారి కలెక్టర్ గౌతమ్ తో కలిసి లోకసభ ఎన్నికలను పురస్కరించుకుని కలెక్టరేట్ లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూం, మీడియా సర్టిఫికేషన్ & మీడియా మానిటరింగ్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. కేంద్రంలో చేపడుతున్న చర్యలపై వారు ఆరా తీసారు.

News April 18, 2024

రాత్రి 11 గంటలలోపు దుకాణాలు మూసివేయాలి:సీపీ

image

ఖమ్మం కమిషనరేట్ పరిధిలో రాత్రి 10:30 నుండి 11 గంటలలోపు ఖచ్చితంగా వ్యాపార, వాణిజ్య దుకాణాలు మూసివేయాలని సీపీ సునీల్ దత్ తెలిపారు. అదేవిధంగా బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించడం, పబ్లిక్ న్యూసెన్స్, సమయానికి మించి షాపులు తెరవడం, పుట్టినరోజు పేరుతో నడిరోడ్డుపై వాహనాలు అడ్డం పెట్టి న్యూసెన్స్ చేస్తూ ప్రజలకు అసౌకర్యం కలిగించే వారిపై కేసులు నమోదు చేయాలని ఇప్పటికే పోలీస్ అధికారులకు ఆదేశించామని తెలిపారు.

News April 18, 2024

భద్రాచలం: ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఎస్సై, కానిస్టేబుల్

image

భద్రాచలంలో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పోలీస్ అధికారులు చిక్కారు. ఏసీబీ అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం.. భద్రాచలం టౌన్ ఎస్ఐ శ్రీనివాస్, కానిస్టేబుల్ శంకర్, నవీన్‌లు ఒకే విషయంలో 20,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.