India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా నామా నాగేశ్వరరావుకు ఆపార్టీ అధ్యక్షుడు కేసీఆర్ B-ఫారమ్ అందించారు. హైద్రాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో జరిగిన సమావేశంలో నామాకు B-ఫారమ్ అందుకున్నారు. మరోసారి గెలిచి రావాలని కేసీఆర్ పార్టీ నాయకులకు సూచించారు. B-ఫారమ్‌తో పాటు రూ.95లక్షల విలువచేసే చెక్కును ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పువ్వాడ, ఎంపీ వద్దిరాజు తదితరులున్నారు.
సీఎం కేసీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలలు ఉండదని ఆరు నెలల్లో పడిపోద్దని కలలు కంటున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య క్యాంపు కార్యాలయంలో మంత్రి మాట్లాడారు. మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బలరాం నాయక్‌ను భారీమెజార్టీతో గెలిపించాలన్నారు. రేపు మహబూబాబాద్‌లో జరిగే బలరాం నామినేషన్ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు హాజరుకావాలని తుమ్మల పిలుపునిచ్చారు.
శ్రీసీతారాముల కల్యాణ తలంబ్రాలు టిఎస్ ఆర్టిసి కార్గో ద్వారా ఆన్ లైన్, ఆఫ్ లైన్ లో రూ.151 చెల్లిస్తే భక్తుల ఇండ్ల వద్దకు చేరుస్తామని ఖమ్మం జిల్లా రీజినల్ మేనేజర్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఈ బుకింగ్స్ ఈనెల 25 వరకు పొడిగించడం జరిగిందని.. కావున భక్తులు తలంబ్రాలను బుక్ చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు
పాల్వంచ మున్సిపాలిటీ కార్యాలయంలో ఓ వ్యక్తి నుంచి రూ.15 వేలు లంచం తీసుకుంటూ గురువారం టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ రమణి, అసిస్టెంట్ ప్రసన్న ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. ఓ పని నిమిత్తం ఓ వ్యక్తి నుంచి అధికారులు లంచం డిమాండ్ చేయడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. కాగా బాధితుడి ఫిర్యాదు మేరకు అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అధికారులు వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఆడుకుంటుండగా.. ప్రమాదవశాత్తు కనుగుడ్డుకు పిన్నీసు గుచ్చుకున్న ఘటన గురువారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నేలకొండపల్లి మండల పరిధిలోని నాచేపల్లికి చెందిన పూజిత అనే చిన్నారి ఆడుకుంటుండగా కను గుడ్డుకు పిన్నిసు గుచ్చుకుంది . గమనించిన తల్లిదండ్రులు దగ్గరలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు.
ఖమ్మం లోక్‌సభకు సాధారణ ఎన్నికలను పురస్కరించుకుని తొలి నామినేషన్ పడింది. 17-ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గానికి ఆధార్ పార్టీ అభ్యర్థిగా కుక్కల నాగయ్య గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం పార్లమెంట్ నియోజక వర్గ ప్రజలు తమ పార్టీని బలపరిచి ఓటు వేయాలని కోరారు.
భద్రాద్రిలో గోదావరి ఎడారిని తలపిస్తోంది. కనుచూపు మేరలో ఎక్కడ చూసినా చుక్క నీరు కూడా కనిపించడం లేదు. నిన్న జరిగిన శ్రీరామ నవమి వేడుకలలో ఉమ్మడి తెలుగు రాష్ట్రల నుంచి వేలాది మంది భక్తులు వచ్చారు. వారి కోసం మోటార్లు ద్వారా తాత్కలికంగా ఏర్పాటు చేసిన వాటి కింద భక్తులు స్థానాలు చేశారు.
ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల ధరల వివరాలను మార్కెట్ శాఖ అధికారులు గురువారం ఉదయం వెల్లడించారు. మిర్చి క్వింటా జండా పాట రూ.20,000, పత్తి జెండా పాట క్వింటా రూ.7200 పలికినట్లు అధికారులు వెల్లడించారు. పత్తి, మిర్చికి మంచి ధర పలుకుతుండడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం సెలవు ఉండడంతో ఈరోజు పంట మార్కెట్ కు పెద్ద ఎత్తున వచ్చింది.
బయ్యారం మండలంలో బుధవారం సాయంత్రం ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు బలంగా వీచాయి. చిన్నపాటి వర్షం పడింది. కొయ్యగూడెం గ్రామ పంచాయతీలోని చుంచు బంధంతండాలో ఉరుములకు కొబ్బరి చెట్టుపై పిడుగు పడి కాలిపోయింది. పిడుగు పడిన ప్రాంతంలో ఆ సమయాన ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు తెలిపారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో గురువారం జరగనున్న రామయ్య మహా పట్టాభిషేకం
మహోత్సవంలో పాల్గొనడానికి వచ్చిన గవర్నర్ సిపి రాధాకృష్ణన్ బూర్గంపాడు మండలం సారపాకలోని ఐటిసి విశ్రాంతి భవనానికి చేరుకున్నారు. అక్కడ ఆయనకు పోలీస్ గౌరవ వందనం సమర్పించారు. అనంతరం అక్కడి నుంచి రోడ్డు మార్గంలో భద్రాచలం చేరుకున్నారు.
Sorry, no posts matched your criteria.