Khammam

News August 23, 2024

ప్రజావాణి దరఖాస్తులకు ప్రాధాన్యత ఇవ్వాలి: అదనపు కలెక్టర్

image

ధరణి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ డి. మధుసూదన్ నాయక్ తెలిపారు. శుక్రవారం మధిర మండల తహసీల్దార్ కార్యాలయంలో అదనపు కలెక్టర్, ధరణి పెండింగ్ దరఖాస్తులు, ప్రజావాణి అర్జీల పరిష్కారం, ఓటరు జాబితా సవరణ పై రెవెన్యూ అధికారులతో మధిర నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రజావాణి దరఖాస్తులకు మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.

News August 23, 2024

HYDలో హత్యకు గురైన ఎర్రుపాలెం యువకుడు

image

ఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెంకి చెందిన ఓ యువకుడు HYDలో దారుణ హత్యకు గురయ్యాడు. యువతి ప్రేమ విషయంలో ప్రశాంత్‌ను దుండగులు హత్య చేశారు. HYDబాలాపూర్‌లో మండి 37 హోటల్ వద్ద ప్రశాంత్‌ను కత్తితో పొడిచి దారుణంగా హతమార్చారు. కాగా హత్య చేసి పరారైన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో తల్లి గుండెలు పగిలేలా రోదించింది.

News August 23, 2024

అధికారులు మీకు లంచం డిమాండ్ చేస్తే ఇలా చేయండి.!

image

ఖమ్మం, భద్రాద్రి జిల్లాలో ప్రభుత్వ అధికారులు ఏమైనా పని కోసం లంచం అడిగితే వెంటనే ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని ఏసీబీ డీఎస్పీ రమేష్ తెలిపారు. డీఎస్పీ నెంబర్: 9154388981, అటు ఏసీబీ ఇన్స్పెక్టర్ ల నెంబర్లు: 9154388984, 9154388986, 915488987, టోల్ ఫ్రీ నెంబర్ 1064 కు ఫోన్ చేసి పిర్యాదు చేయాలన్నారు. పిర్యాదుదారుని వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందని పేర్కొన్నారు.

News August 23, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కొత్త నమూనా

image

ప్రధాన మార్కెట్లో ఒకటి ఖమ్మం వ్యవసాయ మార్కెట్. 1954లో 15.28 ఎకరాల్లో ఈ మార్కెట్‌ను ప్రారంభించారు. పెరిగిన క్రయవిక్రయాలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యాధునిక సౌకర్యాలతో, విశాలమైన షెడ్లు, గోదాములు, శీతల గిడ్డంగులతో దేశంలోనే అతిపెద్ద హరిత మార్కెట్‌‌గా త్వరలోనే నిర్మాణం చేపట్టనుండగా మార్కెట్ నమూనా బయటకొచ్చింది. రూ.148 కోట్ల అంచనాతో రూపొందించిన సమగ్ర ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

News August 23, 2024

బీర్ బాటిల్‌తో ఆర్టీసీ బస్సుపై దాడి

image

గుంటూరు నుంచి భద్రాచలం వెళ్తున్న కొత్తగూడెం డిపోకి చెందిన డీలక్స్ బస్సుపైకి మందుబాబులు బీరు బాటిల్ విసిరారని ప్రయాణికులు తెలిపారు. V.M బంజార సమీపంలో ఈ ఘటన జరిగినట్లు చెప్పారు. బాటిల్ విండో గ్లాస్‌కు తగిలి సీట్లో కూర్చున్న మహిళ కంటికి గాయమైంది. ఆమెను V.M బంజార ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆర్టీసీ అధికారుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు V.M బంజర పోలీసులు తెలిపారు.

News August 23, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజులు సెలవులు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు మూడు రోజులు సెలవులు ప్రకటిస్తున్నట్లు మార్కెట్ అధికారులు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 24, 25 తేదీలు వారాంతపు సెలవులు కాగా, 26న కృష్ణాష్టమి సందర్భంగా సెలవు ప్రకటించడం జరిగిందన్నారు. తిరిగి ఈనెల 27 నుంచి మార్కెట్లో క్రయవిక్రయాలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని పేర్కొన్నారు.

News August 23, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

∆} పలు శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్ల సమీక్ష సమావేశం
∆} వైరాలో వృద్ధులకు ఉచిత వైద్య శిబిరం
∆} ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} సత్తుపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
∆} భద్రాచలంలో ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు పర్యటన
∆} ముదిగొండలో ఇంటింటి ఓటర్ సర్వే

News August 23, 2024

రియాక్టర్ పేలుడు ఘటనలో భద్రాద్రి జిల్లా వాసి మృతి

image

ఏపీలోని అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం వద్ద గల ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలుడు ప్రమాద ఘటనలో అశ్వారావుపేట మండలం గంగారం గ్రామానికి చెందిన మార్ని సురేంద్ర(37) మృతి చెందడంతో స్వగ్రామంలో విషాదం నెలకొంది. సురేంద్ర గాజువాకలో నివాసం ఉంటూ తొమ్మిదేళ్లుగా అచ్యుతాపురంలో గల ఫార్మా సెజ్ కంపెనీలో అసిస్టెంట్ మేనేజర్‌గా పని చేస్తున్నాడు. రియాక్టర్ పేలుడు ప్రమాదంలో చిక్కుకుని దుర్మరణం చెందాడు.

News August 23, 2024

ఖమ్మం: 1,73,329 మందికి రుణామాఫీ

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 1,73,329 మందికి రుణామాఫీ జరిగింది. ఖమ్మం జిల్లాలో 1,15,346మందికి, భద్రాద్రి జిల్లాలో 57,983 మంది రైతులకు రుణం మాఫీ అయింది. ఉమ్మడి జిల్లాలో ఇంకా 8వేల మందికి పైగా అర్హత ఉన్నా రుణమాఫీ జరగలేదు. కొత్త రుణాల జారీ ప్రక్రియలో తీవ్ర జాప్యం ఉంటోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News August 23, 2024

దేశ సంపదనంతా అదానీకి అంటగడుతోంది: పొంగులేటి

image

అదానీ గ్రూప్స్ సంస్థల విషయంలో కేంద్రంలోని బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బీజేపీ దొంగచాటుగా అదానీ గ్రూప్ ను కాపాడుతుందని, దేశ సంపదనంతా అదానీకి అంటగడుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు.