Khammam

News August 22, 2024

KTDM:అత్తవారింటికి వచ్చి అల్లుడు సూసైడ్

image

మణుగూరులో రాఖీ పండుగకి అత్తగారింటికి వచ్చిన అల్లుడు మద్యం మత్తులో కలుపు మందు తాగిన విషయం తెలిసిందే. ఖమ్మంకు చెందిన ఓంకార్ కు మణుగూరుకు చెందిన యువతితో ఏడాది కిందట వివాహమైంది. రాఖీపౌర్ణమికి అత్తగారి ఇంటికి వచ్చిన ఓంకార్ మద్యం మత్తులో కలుపు మందు తాగాడు. గమనించిన స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై ఎస్సై మేడాప్రసాద్ కేసు నమోదు చేశారు.

News August 22, 2024

ఇల్లందు: ఈతకు వెళ్లి ఇద్దరు మృతి

image

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థులు మృతిచెందిన ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. భద్రాద్రి జిల్లా ఇల్లెందుకు చెందిన హేమంత్, నిశాంత్ కొండపాక మండలం సిరిసినగండ్లలోని తమ బంధువుల ఇంట్లో గృహాప్రవేశానికి వచ్చారు. అనంతరం సరదాగా చెరువులోకి ఈతకు వెళ్లారు. చెరువు లోతు తెలియకపోవడంతో ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. అనంతరం స్థానికులు గమనించి వారి మృతదేహాలను బయటకు తీశారు.

News August 22, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

✓మధిర నియోజకవర్గ అభివృద్ధిపై డిప్యూటీ సీఎం భట్టి సమీక్ష
✓ఖమ్మం జిల్లాలో ఎంపీ రఘురాం రెడ్డి పర్యటన
✓వివిధ శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓భద్రాచలంలో అటవీ శాఖ సంస్థ చైర్మన్ పోదెం వీరయ్యకు సన్మాన కార్యక్రమం
✓పినపాకలో ఎమ్మెల్యే పాయం పర్యటన
✓కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు

News August 22, 2024

ఇల్లెందు: పెద్దల సమక్షంలో ప్రేమవివాహం

image

కొత్తగూడెంకు చెందిన నాగభవాని,ఇల్లెందు ఇందిరానగర్ కు చెందిన ప్రశాంత్ బుధవారం ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరిద్దరి పెళ్లికి గతంలో పెద్దలు మాట్లాడుకున్నారు. కానీ పెళ్లి కుదరలేదు. ఆ తర్వాత నాగభవాని, ప్రశాంత్ ప్రేమించుకున్నారు. స్నేహితుల సహకారంతో బుధవారం వారు నాయకులగూడెం శ్రీకృష్ణుడి ఆలయంలో గ్రామపెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు.

News August 22, 2024

ఖమ్మం జిల్లాలో అంతులేని రోగాలతో ఇబ్బందులు

image

సాధారణంగా జ్వరం లక్షణాల ఆధారంగా అది ఏరకమో వైద్యులు అంచనాకు వస్తారు. జ్వరంతోపాటు కీళ్ల నొప్పులుంటే డెంగ్యూ, శరీరంపై దద్దుర్లుంటే గన్యా,తీవ్రమైన జ్వరమైతే మలేరియా, టైఫాయిడ్ అని ప్రాథమికంగా భావిస్తారు. కొద్దిరోజులుగా ఖమ్మం జిల్లాలో ప్రబలుతున్న జ్వరాలు వైద్యులను గందరగోళానికి గురి చేస్తున్నాయి. వైరస్ కారణంగా జ్వరాలు వ్యాపిస్తున్నాయని గుర్తించినా వ్యాధి కారక వైరస్ ఏంటనేది తెలియడం కష్టంగా మారుతోంది. 

News August 22, 2024

ఈనెల 23న ఖమ్మంలో జాబ్ మేళా…!

image

ఖమ్మం టేకులపల్లి ప్రభుత్వ ఐటిఐ మోడల్ కెరీర్ సెంటర్ నందు ఈనెల 23న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి మాధవి ఓ ప్రకటనలో తెలిపారు. శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ సంస్థలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు. విద్యార్హత ఏదైనా డిగ్రీ అని, 20-33 ఏళ్లు వయసు కలిగిన వారు అర్హులన్నారు. ఉ.10 గంటలకు ప్రారంభమయ్యే జాబ్ మేళాకు విద్యార్హత పత్రాలతో హాజరుకావాలన్నారు.

News August 21, 2024

అజ్ఞాత వ్యక్తులకు పాత మొబైల్స్ ఫోన్లు అమ్మొద్దు: CP

image

అజ్ఞాత వ్యక్తులు ఎవరైనా పాత మొబైల్స్, పాడైన మొబైల్స్ కొంటామంటూ మీ దగ్గరికి వస్తే అప్రమత్తంగా ఉండాలని ఖమ్మం సిపి సునీల్ దత్ సూచించారు. సైబర్ నేరాల్లో వినియోగించేందుకు పాత మొబైల్ ఫోన్లను అక్రమంగా కొనుగోలు చేస్తున్నారన్నారు. పాత ఫోన్లను గుర్తుతెలియని వ్యక్తులకు విక్రయిస్తే సైబర్ మోసాలకు ఉపయోగించే అవకాశం ఉందన్నారు. సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు కలిసికట్టుగా పోరాడాలని సీపీ సూచించారు.

News August 21, 2024

చెరువులో పడి ఇద్దరు మృతి

image

సిద్దిపేట జిల్లా కొండపాక మండలం సిరిసినగండ్లలో ఇల్లెందు వాసులు మృతిచెందారు. బంధువుల ఇంటికి వచ్చిన ఇద్దరు చెరువులో ఈత కొడుతూ బుధవారం సాయంత్రం మృతి చెందారని స్థానికులు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 21, 2024

దళిత మహిళను హతమార్చడం హేయమైన చర్య : ఎస్పీ

image

ఇన్ఫార్మర్ నెపంతో ఒక దళిత మహిళను హతమార్చడం హేయమైన చర్య అని ఎస్పీ రోహిత్ రాజు అన్నారు. చర్ల(M)లోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతమైన చెన్నాపురం గ్రామ శివారులో స్థానికుల సమాచారం మేరకు ఒక మహిళ మృతదేహాన్ని పోలీసులు గుర్తించడం జరిగిందన్నారు. ఈ ఘటనపై చర్ల పోలీస్ స్టేషన్లో Cr.No.81/2024 క్రింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

News August 21, 2024

న్యాయవాదితో సహా ఏడుగురికి జైలు శిక్ష

image

న్యాయవాదితో సహా ఏడుగురుకి జైలు శిక్ష విధిస్తూ బుధవారం మూడో అదనపు జుడీషియల్ మొదటి శ్రేణి న్యాయమూర్తి వి.శివ నాయక్ తీర్పునిచ్చారు. ఓ కేసులో అసలు ముద్దాయికి బదులు నకిలీ వ్యక్తిని ప్రవేశ పెట్టినందుకు గాను న్యాయవాదితో సహా ఏడాది జైలు శిక్ష, 1,000 జరిమానా విధిస్తూ మొదటి శ్రేణి న్యాయవాది తీర్పునిచ్చారు.