Khammam

News August 21, 2024

ములకలపల్లి: కళ్యాణానికి ముందే దుర్మరణం

image

ములకలపల్లి మండలం కొత్తూరు శివారులో నిన్న రాత్రి ట్రాక్టర్ బోల్తాపడి తాటి ప్రసాద్, నాగమణిలు దుర్మరణం చెందిన విషయం తెలిసిందే. అశ్వాపురం మండలం తుమ్మలచెరువుకి చెందిన తాటి ప్రసాద్(25), ములకలపల్లి మండలం కమలాపురానికి చెందిన నాగమణితో వివాహం నిశ్చయమైంది. వ్యవసాయం పనులు పూర్తయిన తర్వాత మంచి రోజు చూసుకుని నిశ్చితార్థం, వివాహం జరిపించాలని నిర్ణయించుకున్నారు. అంతలోనే వారిని కాలం కాటేసింది.

News August 21, 2024

ప్రభుత్వాసుపత్రిలో ప్రసవం చేయించుకున్న జడ్జి

image

నల్గొండ జిల్లా నిడమనూరు మున్సిఫ్ కోర్టు జూనియర్ సివిల్ జడ్జిగా విధులు నిర్వహిస్తున్న టి.స్వప్న ప్రసవం కోసం కొత్తగూడెంలోని మాతా శిశు సంరక్షణ కేంద్రంలో అడ్మిట్ అయి ఆదివారం ఆడబిడ్డకు జన్మనిచ్చారు. వైద్య సిబ్బంది పనితీరు పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె డిశ్చార్జి అయ్యారు. ఆసుపత్రి అంటే పునర్జన్మ ఇచ్చే దేవాలయం అని అన్నారు. ఆసుపత్రికి అవసరమైన సౌకర్యాలపై కలెక్టర్‌కి నివేదిక ఇస్తానన్నారు

News August 21, 2024

సినీ రంగంలో రాణిస్తోన్న మన సత్తుపల్లి బిడ్డ

image

సత్తుపల్లికి చెందిన పరిమి లోకేశ్‌కుమార్‌ వెండితెరపై దూసుకెళ్తున్నాడు. లఘు చిత్రం నుంచి వెండితెర స్థాయికి ఎదిగి అందరి మన్ననలు పొందుతున్నాడు. తాజాగా విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాలో ‘ఆత్రం’ పాత్ర పోషించి తన నటనతో ప్రేక్షకుల్ని మంత్రముగ్దుల్ని చేశాడు. విడుదలకు సిద్ధమైన సుడిగాలి సుధీర్‌ హీరోగా నటించిన ‘గోట్‌’ చిత్రంలోనూ నటించాడు. మరో నాలుగైదు చిత్రాల్లో నటించేందుకు అవకాశాలు దక్కాయి.

News August 21, 2024

అత్తగారింటికి వచ్చి.. అల్లుడు ఆత్మహత్యాయత్నం

image

మణుగూరులో రాఖీ పండుగకి అత్తగారింటికి వచ్చి ఓ వ్యక్తి మద్యం మత్తులో కలుపు మందు తాగాడు. హుటాహుటిన పోలీసుల సాయంతో స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. హుజురాబాద్‌కు చెందిన ఓంకార్(25) ఏడాది క్రితమే మణుగూరు యువతిని ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. ఈ ఘటనపై మణుగూరు ఎస్సై మేడా ప్రసాద్ కేసు నమోదు చేశారు.

News August 21, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్య అంశాలు

image

∆} ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారత్ బంద్
∆} నేలకొండపల్లి మండలంలో మంత్రి పొంగులేటి పర్యటన
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో వేలంపాట
∆} ఖమ్మం జిల్లాలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} వైరాలో ఎంపీ RRR పర్యటన
∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఎర్రుపాలెంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటన

News August 21, 2024

KU: కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ రెండో సెమిస్టర్ పరీక్షలు

image

కాకతీయ యూనివర్సిటీలోని ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, బయో టెక్నాలజీ విద్యార్థులకు రెండో సెమిస్టర్ పరీక్షలు ఈ నెల 27 నుంచి నిర్వహిస్తున్నట్లు ఇన్‌ఛార్జి పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య ముస్తాఫా, అదనపు పరీక్షల నియంత్రణాధికారి నాగరాజు ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27, 29, 31 సెప్టెంబర్ 2, 4, 6న పరీక్షలు మధ్యాహ్నం 2 గం.ల నుంచి సాయంత్రం 5 గం.ల వరకు జరుగుతాయన్నారు.

News August 20, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్య అంశాలు

image

>త్వరలో ‘ధరణి’ సమస్యలకు చరమగీతం: మంత్రి పొంగులేటి
>చండ్రుగొండ: ‘అప్పు చేసి డబ్బు కట్టాను.. మాఫీ చేయండి’
>భద్రాద్రి జిల్లాలో భారీగా గంజాయి పట్టివేత
>గ్రామపంచాయతీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి
>ఆశ్రమ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే పాయం
>ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా రాజీవ్ గాంధీ జయంతి వేడుకలు

News August 20, 2024

భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపడతాం: కలెక్టర్

image

ఖమ్మం: భూ నిర్వాసితులకు ప్రభుత్వ పరంగా న్యాయం జరిగేలా చర్యలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లోని అదనపు కలెక్టర్ ఛాంబర్లో ఖమ్మం-దేవరపల్లి నేషనల్ హైవే దంసలాపురం భూ నిర్వాసితులతో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఉత్తర్వులకు లోబడి, సాధ్యమైనంత వరకు అన్ని విధాల భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా చర్యలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు.

News August 20, 2024

ఖమ్మం: ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి 

image

ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి వద్ద మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్ పై ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులను వెనుక నుంచి బొలెరో వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన యువకుడిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

News August 20, 2024

చండ్రుగొండ: ‘అప్పు చేసి డబ్బు కట్టాను.. మాఫీ చేయండి’

image

రెండు లక్షల పైన ఉన్న మొత్తాన్ని చెల్లిస్తే రుణమాఫీ అవుతుందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పడంతో ఆ మొత్తాన్ని చెల్లించాలని చండ్రుగొండ మండలం మంగయ్య బంజరకు చెందిన రైతు మాలోతు లింగ్యా అన్నారు. మంగళవారం స్థానిక రైతు వేదికలో జరిగిన రైతు నేస్తంలో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అసలే రైతుబంధు రాక అప్పు చేసి పంటకు పెట్టుబడి పెట్టానని, మాఫీ అవుతుందన్న ఆశతో రూ.2 లక్షలపై మొత్తాన్ని అప్పు చేసి కట్టానని వాపోయారు.