Khammam

News August 20, 2024

దమ్మపేట: భారీగా గంజాయి పట్టివేత

image

దమ్మపేట మండలంలో మంగళవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు భారీగా గంజాయిని పట్టుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు పోలీసులు దమ్మపేట పోలీస్ స్టేషన్ పరిధిలో డీసీఎం వ్యానులో తరలిస్తున్న 5 క్వింటాళ్ల భారీ గంజాయిని పట్టుకున్నారు. పట్టుబడిన గంజాయిని పోలీస్ అధికారులు పోలీస్ స్టేషన్‌కు తరలించి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 20, 2024

KMM: ‘ఐటీ రంగానికి పునాదులు వేసిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ’

image

భారతదేశంలో ఐటి రంగానికి పునాదులు వేసిన మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం మాజీ ప్రధాని జయంతిని పురస్కరించుకొని కుసుమంచిలో రాజీవ్ గాంధీ విగ్రహానికి మంత్రి పొంగులేటి, ఎంపీ రామ సహాయం రఘురామిరెడ్డి పూలమాలతో నివాళులర్పించారు. తదనంతరం మాజీ ప్రధాని ఉద్దేశించి మంత్రి, ఎంపీ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

News August 20, 2024

కొత్తగూడెం: ప్రభుత్వ ఆసుపత్రిలో న్యాయమూర్తి ప్రసవం

image

కొత్తగూడెంకు చెందిన న్యాయమూర్తి స్వప్న ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించారు. సన్యాసిబస్తీ న్యాయవాది కార్తీక్‌, స్వప్న దంపతులు. ఆరేళ్లుగా నిడమనూరు జూ.సివిల్ జడ్జిగా ఆమె పనిచేస్తున్నారు. మొదటి కాన్పు కోసం పుట్టింటికి రాగా, రామవరంలోని ప్రభుత్వ మాతా, శిశు ఆరోగ్యకేంద్రంలో ఆడశిశువుకు జన్మనిచ్చారు. సామాన్య ప్రజలకు నమ్మకం వచ్చేలా ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రసవించిన స్వప్నను మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందించారు.

News August 20, 2024

ములకలపల్లి: టాక్టర్ బోల్తా పడి ఇద్దరు మృతి

image

ట్రాక్టర్ బోల్తా పడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన మలకలపల్లి మండలంలో నిన్న రాత్రి 11గం.కు చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. అశ్వాపురం మండలం తుమ్మల చెరువు గ్రామానికి ప్రసాద్ చెందిన నాగమణిలు దంతలబోరు వైపు నుంచి ములకలపల్లి వైపు ట్రాక్టర్ పై వస్తుండగా కొత్తూరు శివారులోని కోళ్లఫారం వద్ద అదుపుతప్పి పల్టీకొట్టింది. ట్రాక్టర్ ఇంజను వారిపై పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు.

News August 20, 2024

కారేపల్లి: బట్టలు ఆరేస్తుండగా విద్యుత్ షాక్‌.. భార్యభర్తలు మృతి

image

కారేపల్లి మండలం బస్వాపురంలో రాఖీ పండుగ రోజున విషాదం చోటుచేసుకుంది. బానోత్ షమీనా అనే మహిళ బట్టలు ఆరేస్తుండగా.. ప్రమాదవశాత్తు తీగకు విద్యుత్‌ షాక్ తగిలింది. దీంతో ఆమె ఒక్కసారిగా కుప్పకూలింది. ఆమె అరుపులు విన్న భర్త శ్రీను.. ఆమెను కాపాడే ప్రయత్నంలో అతను కూడా విద్యుదఘాతానికి గురై భార్యాభర్తలు అక్కడికక్కడే మృతి చెందారు. ఇద్దరినీ ఇల్లందు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోలీసులు కేసు నమోదు చేశారు.

News August 20, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

*ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి పర్యటన
*వివిధ శాఖల అధికారులతో ఖమ్మం భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
*భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా రుణమాఫీపై ప్రజావాణి కార్యక్రమం
*ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
*పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాయం పర్యటన
*భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు

News August 20, 2024

KMM: త్వరలో ‘ధరణి’ సమస్యలకు చరమగీతం: మంత్రి పొంగులేటి

image

గత బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్ వల్ల తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న కష్టాలు, బాధలకు త్వరలోనే చరమగీతం పాడబోతున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. దేశానికే ఆదర్శంగా ఉండేలా నూతన రెవెన్యూ చట్టం తీసుకొస్తామని చెప్పారు. ‘రెవెన్యూ’ను కంటికి రెప్పలా కాపాడుకుంటామని వివరించారు. చట్టాలు సరిగా లేకపోతే ఫలితాలు ఎలా ఉంటాయో గత ప్రభుత్వంలోనే తెలిసిందని పేర్కొన్నారు.

News August 20, 2024

రైతు రుణమాఫీపై ప్రజావాణి కార్యక్రమం: జిల్లా కలెక్టర్

image

ఇటీవల ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రుణమాఫీ కార్యక్రమంలో రుణమాఫీ కానీ రైతులు సంబంధిత మండల కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితిష్ వి పాటిల్ తెలిపారు. భద్రాద్రి జిల్లాలోని 23 మండలాల్లో వ్యవసాయ అధికారులు రేపటి నుంచి ఈనెల 30 వరకు రుణమాఫీపై ప్రజావాణి నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ప్రతిరోజు ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దరఖాస్తులు అందజేయాలన్నారు.

News August 19, 2024

దసరా సెలవుల్లో వండర్లా, రామోజీ ఫిల్మ్ సిటీకి తెలుసుకువెళ్తా: కలెక్టర్

image

జీవితంలో ఎప్పుడు నిరుత్సాహ పడొద్దని, ఆశావాహ దృక్పధంతో ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. సోమవారం నగరంలోని బాలల సదనంలోని బాలికలతో ముచ్చటించిన కలెక్టర్, వారితో ఒక అన్నగా భావించి, ఏ ఏసమస్యలు ఉన్నాయో చెప్పాలన్నారు. బాలల సదనంలో ఉన్న తల్లి దండ్రులు లేని 31మంది పిల్లలని దసరా సెలవుల్లో వండర్ లా, రామోజీ ఫిల్మ్ సిటీకి తెలుసుకు వెళ్తామని విద్యార్థులకి హామీ ఇచ్చారు.

News August 19, 2024

బావిలో పడి వ్యక్తి మృతి

image

ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలం భైరవునిపల్లిలో రాఖీ ఫౌర్ణమి రోజు విషాదం చోటు చేసుకుంది. ప్రమాదవ శాత్తు వ్యవసాయ బావిలో పడి జువ్వెన బోయిన పుల్లారావు (48)అనే వ్యక్తి మృతి చెందారు. సోమవారం ఉదయం బావిలో పడినట్లుగా స్థానికులు భావిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.