India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం జిల్లా వైద్యారోగ్య శాఖాధికారిగా డాక్టర్ వి.సుబ్బారావు బాధ్యతలు చేపట్టారు. ఇప్పటి వరకు పనిచేసిన మాలతిపై ఆరోపణలు రీత్యా కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ డిపార్ట్మెంట్‌కి సరెండర్ చేశారు. ఈ సందర్బంగా వైద్యా ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న సుబ్బారావుకి అదనపు భాద్యతలు ఇస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.

కారేపల్లి మండలంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. మండలంలోని బస్వాపురానికి చెందిన భార్యభర్తలు షమీనా, శ్రీను బట్టలు ఆరేస్తుండగా విద్యుత్‌ఘాతానికి గురై మృతి చెందారు. ఇంటిముందు బట్టలుఆరేస్తుండగా విద్యుత్ తీగలు తగిలి ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

శ్రావణమాసం, వర్షాకాలం చల్లగా ఉండాల్సిన వాతావరణం వేసవిని తలపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. అధిక వేడిమి, ఉక్కపోతతో జనం అల్లాడుతున్నారు. ఆదివారం నేలకొండపల్లిలో అత్యధికంగా 42.3 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదైంది. వేడిమి,ఉక్క పోత తట్టుకోలేక పగలే ఏసీలు వినియోగిస్తున్నారు. దీంతో విద్యుత్తు వినియోగం పెరుగుతోంది. జిల్లాలోని ఆటోమేటిక్ వెదర్ స్టేషన్లలో భారీగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

ఖమ్మం జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారిగా పనిచేస్తున్న డా.మాలతిని ప్రభుత్వానికి సరెండర్ చేస్తూ జిల్లా కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. ఆమెపై ఆరోపణలు రావడంతో సరెండర్ చేశారు. ఆరోపణలు ఉన్న అధికారిని పంద్రాగస్టు రోజున ఉత్తమ అధికారి అవార్డుకు ఎలా ఎంపిక చేశారని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఉత్తమ అధికారుల ఎంపిక విషయంలో కలెక్టర్ దృష్టి సారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఆన్ లైన్ లో షాపింగ్ చేసి ఓ యువకుడు మోసపోయిన ఘటన కారేపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. కారేపల్లికి చెందిన ఉపేందర్ రెండు కారు టైర్లు ఒరిజినల్ ప్రైస్ రూ.9,085 కాగా, ఆఫర్ కింద రూ.5,329 అని చూపించడంతో పేమెంట్ చేసి ఆర్డర్ చేశాడు. ఈ నెల 17న ఆర్డర్ రావడంతో పార్శిల్ ఓపెన్ చేసి చూడగా.. అందులో వాడిన పాతటైర్లు దర్శనమిచ్చాయి. దీంతో మోసపోయానని గ్రహించిన ఉపేందర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.

తెలంగాణ ప్రజలకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాఖీ పండుగ శుభాకాంక్షలను తెలిపారు. అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగను అందరూ ఆనందంగా జరుపుకోవాలని డిప్యూటీ సీఎం ఆకాంక్షించారు. మహిళల సాధికారతతో పాటు మహిళలను కోటీశ్వరులను చేసే సంకల్పంతో ప్రజా ప్రభుత్వం వినూత్న కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.

ఖమ్మం రూరల్ మండలం తల్లంపాడు కిట్స్ కళాశాల సమీపంలో ఆదివారం అర్ధరాత్రి రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. కూసుమంచి మండలం జీళ్ళచెరువుకి చెందిన ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను ఆసుపత్రికి తరలిస్తుండగా కుమ్మరి కుంట్ల మహేష్ అనే యువకుడు మృతి చెందాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లు పథకంపై కీలక ప్రకటన చేశారు. ఈ పథకం ఇచ్చే విషయంలో మొదటి ప్రాధాన్యత స్థలాలు ఉన్న పేదలకు ఉంటుందని తెలిపారు. ఆ తర్వాత విడతలో ఇంటి స్థలం అందజేస్తామని వెల్లడించారు. అందులో కూడా ఎవరి ఇళ్లు వారే నిర్మించుకుంటారని.. వారికి నిధులను నిర్దేశించిన సమయంలో విడతల వారీగా విడుదల చేస్తామన్నారు.

>ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా సర్వాయి పాపన్న జయంతి వేడుకలు
>తమ్ముడికి రాఖీ కట్టేందుకు వెళ్లి అక్క మృతి
>రెండు కార్లు ఢీ ఓ మహిళ మృతి
>ఇందిరమ్మ ఇళ్లపై మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
>ఎర్రుపాలెంలో ప్రేమ విఫలమైందని యువకుడు సూసైడ్
>సర్వాయి పాపన్న జీవితం ఆదర్శప్రాయం: డిప్యూటీ సీఎం భట్టి
>చింతూరు: పొదల్లోకి దూసుకెళ్లిన RTC బస్సు

తమ్ముడికి రాఖీ కట్టేందుకు వెళుతూ ఓ మహిళ మృతి చెందిన ఘటన కూసుమంచిలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాలు ప్రకారం.. కూసుమంచి మండలం చౌటపల్లికి చెందిన గాజులు మల్లమ్మ తన తమ్ముడికి రాఖీ కట్టేందుకు ఆదివారం సాయంత్రం ఖమ్మం కొత్త బస్టాండ్ చేరుకొని అక్కడ రాఖీ కొనేందుకు రోడ్డు దాటుతుండగా కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మల్లమ్మ అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Sorry, no posts matched your criteria.