Khammam

News August 18, 2024

KMM:ప్రేమ విఫలమైందని యువకుడు సూసైడ్

image

ప్రేమ విఫలమైందని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఎర్రుపాలెం మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడుకి చెందిన బొగ్గుల మణిరాగ్ రెడ్డి(28)హైదరాబాదులో హెయిర్ హోస్టర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఓ యువతిని ప్రేమించి ప్రేమ విఫలం కావడంతో సూసైడ్ చేసుకున్నట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News August 18, 2024

KMM:ప్రేమ విఫలమైందని యువకుడు సూసైడ్

image

ప్రేమ విఫలమైందని ఆత్మహత్య చేసుకొని ఓ యువకుడు మృతి చెందిన ఘటన ఎర్రుపాలెం మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎర్రుపాలెం మండలం బనిగండ్లపాడుకి చెందిన బొగ్గుల మణిరాగ్ రెడ్డి(28)హైదరాబాదులో హెయిర్ హోస్టర్ గా పనిచేస్తున్నాడు. ఇటీవల ఓ యువతిని ప్రేమించి ప్రేమ విఫలం కావడంతో సూసైడ్ చేసుకొని మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

News August 18, 2024

భద్రాద్రి రామాలయానికి పోటెత్తిన భక్తులు

image

భద్రాచలం సీతారామచంద్ర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు కావడంతో ఆలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు క్యూ కట్టారు. భద్రాద్రి రామయ్యని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

News August 18, 2024

సర్వాయి పాపన్న జయంతి వేడుకల్లో మంత్రి పొంగులేటి

image

సబ్బండవర్గాల రాజకీయ, సామాజిక సమానత్వం కోసం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన కృషి చరిత్రలో సువర్ణాక్షరాలతో ఎప్పటికీ నిలిచి ఉంటుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. తెలంగాణ బహుజన ఆత్మగౌరవానికి, ధీరత్వానికి పాపన్న గౌడ్ ప్రతీకగా నిలిచారని తెలిపారు. ఆయన కృషి, పోషించిన చారిత్రక పాత్రను ప్రతిఒక్కరు స్మరించుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

News August 18, 2024

ఖమ్మం: ఒకే రోజు ఏడుగిరిపై కుక్కల దాడి

image

వెంకటాపురం మండలంలోని నూగురులో పిచ్చి కుక్కలు స్వైర విహారం చేశాయి. ఒకేరోజు ఏడుగురిపై దాడి చేయడంతో బాధితులను వెంకటాపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం ముగ్గురిని ఎటూరునాగారం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గ్రామంలో మనుషులు, పశువులపై కుక్కలు దాడి చేస్తున్నాయని గ్రామస్థులు భయాందోళనలకు గురవుతున్నారు. అధికారులు తక్షణమే స్పందించి కుక్కల కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు.

News August 18, 2024

కొత్తగూడెం వైద్య కళాశాలలో ఇంటర్వ్యూలు

image

కొత్తగూడెం వైద్య కళాశాలలో 19 క్యాటగిరీలలో 105 పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీకి ఇంటర్వ్యూలను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా.రాజకుమార్ తెలిపారు. ప్రొఫెసర్లు 10, అసోసియేట్ ప్రొఫెసర్ 35, అసిస్టెంట్ ప్రొఫెసర్ 16, ట్యూటర్లు 22, సీనియర్ రెసిడెంట్లు 22 మందిని భర్తీ చేయనున్నట్లు తెలిపారు. జిల్లా ఐడీవోసీలో కార్యాలయంలో ఈ నెల 22వ తేదీన ఇంటర్వ్యూలను నిర్వహిస్తున్నామన్నారు.

News August 18, 2024

ఖమ్మం: పర్యాటక అభివృద్ధికి రూ.600 కోట్లు

image

కనకగిరి గుట్టల ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం రూ.600 కోట్లు మంజూరు చేసింది. గతంలో టూరిజం శాఖ ప్రభుత్వానికి పలుమార్లు ప్రతిపాదనలు పంపించగా ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల చండ్రుగొండ, కల్లూరు, తల్లాడ, జూలూరుపాడు మండల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News August 18, 2024

కొత్తగూడెం: సింగరేణి కార్పొరేట్ సేఫ్టీ జీఎంగా శ్రీనివాస్

image

సింగరేణి సంస్థ కార్పొరేట్ సేఫ్టీ జీఎంగా చింతల శ్రీనివాస్ శనివారం బాధ్యతలు చేపట్టారు. గతంలో జీఎంగా ఉన్న గురువయ్య జూలై 31న ఉద్యోగ విరమణ చేయగా ఆయన స్థానంలో ఆర్-1 జీఎంగా ఉన్న శ్రీనివాస్‌ను నియమించారు. ఈ సందర్భంగా విధుల్లో చేరిన ఆయన మాట్లాడుతూ.. విలువైన కార్మికుల ప్రాణాలను కాపాడేలా ప్రమాదాల సంఖ్య తగ్గింపునకు కృషి చేస్తామని తెలిపారు. అలాగే, స్వీయరక్షణపై అందరూ దృష్టి సారించాలన్నారు.

News August 18, 2024

ఖమ్మం: అర్హులైన గిరిజనులకు పోడు భూముల హక్కులు

image

పోడు భూములలో వ్యవసాయ సాగు చేసుకుంటున్న అర్హులైన గిరిజనులకు హక్కులు కల్పించేందుకు విధి విధానాలపై రూపకల్పన చేస్తున్నట్లు మంత్రి కొండా సురేఖ అన్నారు. శనివారం హైదరాబాద్ నుంచి మంత్రి ధనసరి అనసూయ అటవీశాఖ ముఖ్య కార్యదర్శి, ఉన్నతాధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

News August 18, 2024

ఖమ్మం జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీ పొడిగింపు

image

ఖమ్మం జిల్లాలో రేషన్ బియ్యం పంపిణీ ప్రక్రియను మంగళవారం వరకు పొడిగించినట్లు అదనపు కలెక్టర్ మధుసూదన్నాయక్ శనివారం తెలిపారు. ప్రతినెలా 15 వరకే రేషన్ పంపిణీ చేసేవారని, కొన్ని సాంకేతిక కారణాలతో జాప్యం నెలకొన్నందున ఈనెల 20 వరకు అన్ని రేషన్ దుకాణాల్లో బియ్యం పంపిణీ చేస్తారని చెప్పారు. ఈమేరకు రేషన్ దుకాణాల్లోని ఈపాస్ యంత్రాల్లో మార్పులు చేశామన్నారు.