India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

☛ అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం
☛ కొత్తగూడెంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
☛ ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
☛ వైరాలో ఉచిత వైద్య శిబిరం
☛ పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
☛ అశ్వరావుపేటలో ఎమ్మెల్యే ఆదినారాయణ పర్యటన
☛ సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన

ఖమ్మం జిల్లాకు వచ్చిన హైకోర్టు న్యాయమూర్తి కె.శరత్ ను పోలీసు కమిషనర్ సునీల్ దత్ మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. శనివారం సాయంత్రం ఖమ్మం నగరంలోని ఎన్ఎస్పీ గెస్ట్ హౌస్ చేరుకున్న న్యాయమూర్తి శరత్ జిల్లా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పలువురు పోలీస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం: రాష్ట్రవ్యాప్తంగా రెండు లక్షల లోపు రైతు రుణాలన్నీ మాఫీ చేయడం జరిగిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇప్పటివరకు 22,37,848 ఖాతాలకు 17933.19 కోట్ల నిధులు విడుదల చేశామని చెప్పారు. ఏదేని కారణాల వల్ల 2 లక్షలలోపు ఉన్న రుణం మాఫీ కానీ ఖాతాదారుల వివరాలు సేకరించి, పోర్టల్ లో అప్ లోడ్ చేసేందుకు వ్యవసాయాధికారులకు ఆదేశాలు జారీ చేశామని పేర్కొన్నారు.

ఖమ్మం జిల్లా పంచాయతీ అధికారి హరి కిషన్ పై జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వేటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి పంచాయతీ అధికారి హరి కిషన్ ను సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా వీరి స్థానంలో జడ్పీ ఉప సీఈఓ నాగలక్మికి DPO గా జిల్లా కలెక్టర్ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

ఖమ్మం జిల్లా పంచాయతీ అధికారి హరి కిషన్ పై జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ వేటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి పంచాయితీ అధికారి హరి కిషన్ ను సరెండర్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా వీరి స్థానంలో జెడ్పీ ఉప సీఈఓ నాగలక్మికి DPO గా జిల్లా కలెక్టర్ అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.

రుణమాఫీపై మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు చేశారు. రూ. 2 లక్షలకు పైగా ఉన్నవారు పై మొత్తాన్ని కడితేనే రూ. 2 లక్షల రుణమాఫీ అవుతుందని స్పష్టం చేశారు. రుణమాఫీ పై కొందరు కావాలనే రాద్ధాంతం చేస్తున్నారన్నారు. బీఆర్‌ఎస్ హయాంలోని బాకీలను కూడా చెల్లించామన్నారు. రైతులను మోసం చేసే సంస్కృతి తమ ప్రభుత్వానిది కాదని మంత్రి తుమ్మల పేర్కొన్నారు.

ఖమ్మం జిల్లా కలెక్టరేట్ ఎదుట శనివారం రుణమాఫీ కానీ రైతులు ధర్నా చేపట్టారు. కాగా రోడ్డుపై రాస్తారోకో చేయడంతో వాహనాలు నిలిచిపోయి. భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు నిరసనకారులను చెదరగొట్టి ట్రాఫిక్‌ను పునరుద్ధరించారు. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో రుణమాఫీ చేయాలని రైతుల డిమాండ్ చేశారు.

రాఖీ పౌర్ణమి సందర్భంగా సుదూర ప్రాంతాలలో ఉన్న తమ సోదరులకు మహిళలు ఆర్టీసీ కార్గో ద్వారా రాఖీలను పంపుకునేందుకు TGSRTC ఏర్పాట్లు చేసిందని ఉమ్మడి వరంగల్, ఖమ్మం ATM పవన్ తెలిపారు. రీజియన్ పరిధిలోని వివిధ మండలాలు గ్రామాలకు చెందిన మహిళలు రాఖీతో పాటు స్వీట్ బాక్సులు, బహుమతులు పంపేందుకు కార్గో సేవలను వినియోగించుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు
నెంబర్లు 9154298582, 9154298583 సంప్రదించాలని కోరారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో ఏరియా ఆసుపత్రులు-3, సీహెచ్సీలు -11, పీహెచ్సీలు-59, ప్రైవేటు ఆసుపత్రులు సుమారు 600 వరకు ఉన్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల్లో శనివారం అత్యవసర సేవలు మాత్రమే అందిస్తామని చెప్పటంతో ఆ ప్రభావం ప్రభుత్వ దవాఖానాలపై పడనుంది. జిల్లాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీకి ముందు లేదా ఓపీ తర్వాత ఒక గంటపాటు నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

*వివిధ శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం
*చింతూరు డివిజన్ ప్రభుత్వ పాఠశాలలో పేరెంట్స్ ఎన్నికలు
*అన్నపురెడ్డిపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
*ఖమ్మంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
*ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
*వైరాలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ పర్యటన
*సత్తుపల్లిలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
Sorry, no posts matched your criteria.