Khammam

News April 13, 2024

ఖమ్మం: భార్యపై వేటకొడవలితో దాడి

image

ఖమ్మం జిల్లా చింతకాని మండలం బస్వాపురం గ్రామంలో భార్యపై భర్త గొడ్డలి, వేట కొడవలితో శుక్రవారం అర్ధరాత్రి దాడికి పాల్పడ్డాడు. ఆమెకు తీవ్ర గాయాలు కావడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 13, 2024

ఈ మార్గాలలో రాత్రి రాకపోకలు బంద్

image

చింతూరు : మావోయిస్టు బంద్ నేపథ్యంలో ప్రయాణికుల భద్రత దృష్ట్యా మూడు రోజులపాటు చట్టి – భద్రాచలం, చట్టి – కుంట మార్గంలో రాత్రిపూట వాహన రాకపోకలను నిలిపివేస్తున్నట్లు స్థానిక ఎస్సై శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 13 నుంచి 15 వరకు మావోయిస్టులు బందుకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఈ రెండు మార్గాల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు రాకపోకలు నిలిపివేస్తున్నట్లు తెలిపారు.

News April 13, 2024

భద్రాద్రిలో శ్రీరామనవమి ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్

image

ఈనెల 17న జరగనున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవ ఏర్పాట్లను శనివారం జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా సంబంధిత శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా శ్రీరామనవమి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. కళ్యాణ మహోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రాద్రిలో అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఎండల దృష్ట్యా భక్తులకు సకలసౌకర్యాలు కల్పించాలన్నారు.

News April 13, 2024

సత్తుపల్లి: పోలీసులపై దాడి ఘటనలో 92 మంది అరెస్ట్

image

సత్తుపల్లి మండలం చంద్రయ్యపాలెం సర్వే నంబర్ 343 నుంచి 359 వరకు విస్తరించి ఉన్న 400 హెక్టార్ల భూమి హక్కులపై వివాదం నివురుగప్పిన నిప్పులా రగులుతోంది. మార్చి 31న జరిగిన ఘటనపై గిరిజనులకు అనుకూలంగా విడుదల చేసిన ఓ వీడియో వైరల్‌గా మారటం చర్చనీయాంశమైంది. పోలీసులపై దాడి జరిగినప్పటి నుంచి అప్పటి వీడియోలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ.. దాడి చేసిన వారిని గుర్తించి ఇప్పటివరకు 92 మందిని అరెస్టు చేసినట్లు తెలిపారు.

News April 13, 2024

ఏజెంట్లు నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం

image

ఖమ్మం: తపాలా బీమా పథకాల ఏజెంట్ల తాత్కాలిక నియామకానికి పదో తరగతి ఉత్తీర్ణులై, 18 ఏళ్లు పైబడిన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఖమ్మం డివిజన్‌ పోస్టల్‌ సూపరింటెండెంట్‌ బి.రవికుమార్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా చేయించేందుకు కమీషన్‌ పద్ధతిలో నియామకం ఉంటుందని తెలిపారు. ఆసక్తి గల వారు సంబంధిత పత్రాలతో మే 6లోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

News April 13, 2024

అథ్లెటిక్స్‌ పోటీలకు రేపు క్రీడాకారుల ఎంపిక

image

పాల్వంచ: ఈనెల 28న సూర్యాపేటలో జరిగే రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌ పోటీలకు ఆదివారం ఉదయం 8 గంటల నుంచి జిల్లా స్పోర్ట్‌ అథారిటీ మైదానంలో క్రీడాకారులను ఎంపిక చేయనున్నారు. ఈ మేరకు భద్రాద్రి జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ కె.మహీధర్‌ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. 14, 16, 18, 20 సంవత్సరాల వయసు గల బాలబాలికలకు పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. వివరాలకు 99636 59598ను సంప్రదించాలన్నారు.

News April 13, 2024

తల్లాడ: చికిత్స పొందుతూ యువతి మృతి

image

చికిత్స పొందుతూ యువతి మృతి చెందిన సంఘటన శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని నారాయణపురం గ్రామానికి చెందిన గూడూరు నవ్య (20) ఖమ్మంలో ఓ ప్రైవేట్‌ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్‌ చదువుతోంది. కుటుంబ సభ్యులు నవ్యకు వివాహం చేయాలని సంబంధాలు చూస్తున్నారు. తాను చదువుకోవాలని, పెళ్లి చేసుకోనని నవ్య చెప్పినా తల్లిదండ్రులు వినకపోవడంతో పురుగుమందు తాగింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది.

News April 13, 2024

భద్రాచలంలో 12 కిలోల గంజాయి పట్టివేత

image

భద్రాచలం పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని శుక్రవారం టౌన్ పోలీసులు పట్టుకున్నారు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా కనిపించిన వ్యక్తిని అదుపులోకి తీసుకొని అతని బ్యాగును పరిశీలించగా 12 కిలోల గంజాయి లభ్యమయింది. వెంటనే నిందితుని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.

News April 13, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

✓పలు శాఖలపై భద్రాద్రి, ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్షా సమావేశం
✓ఖమ్మం జిల్లాలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటన
✓వేంసూర్ మండలంలో ఎంపీ నామా నాగేశ్వరరావు పర్యటన
✓ఎర్రుపాలెం వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
✓వైరా మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓అశ్వారావుపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటన

News April 13, 2024

జిల్లాలో 2.36 లక్షల కనెక్షన్లకు ఉచిత విద్యుత్‌ 

image

ఖమ్మం జిల్లాలో గృహజ్యోతి పథకం కింద నెలకు రూ.6.69 కోట్ల విలువైన విద్యుత్‌ను వినియోగదారులకు ఉచితంగా సరఫరా చేస్తున్నట్లు సంస్థ గుర్తించింది. గత ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీ మేరకు.. అధికారంలోకి వచ్చాక ‘గృహజ్యోతి’ పథకాన్ని అమలు చేస్తోంది. తెల్ల రేషన్‌ కార్డు ఉండి, ఆధార్‌ కార్డు, ఫోన్‌ నంబర్‌తో అనుసంధానమైన విద్యుత్‌ కనెక్షన్లకు ఉచిత పథకాన్ని వర్తింపజేస్తామని ప్రకటించారు.