India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఖమ్మం మెడికల్ కాలేజి నిర్మాణం కాంట్రాక్టర్, బిల్డింగ్ డిజైన్ కన్సల్టెన్సీ ప్రతినిధులతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు భేటీఅయ్యారు. తరగతి గదులు, హాస్టల్ బిల్డింగ్స్, ప్రొఫెసర్స్ క్వార్టర్స్, స్టాఫ్ క్వార్టర్స్, క్రీడా మైదానం నిర్మాణం కేటాయించిన స్థల ప్రాంగణంలో ఏ బిల్డింగ్ ఎక్కడ నిర్మిస్తే బాగుంటుందనే విషయం త్వరలో నిర్ణయం తీసుకోవాలని సూచించారు.
పాల్వంచ అంబేడ్కర్ సెంటర్ వద్ద శుక్రవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఆటోమొబైల్ వర్క్ షాప్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది వచ్చేలోపే షాపు మొత్తం అగ్నికి ఆహుతైంది. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఎన్నికల షెడ్యూలు విడుదలై దాదాపు నెల రోజులు కావస్తోంది. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించి ప్రచారం జోరుగా కొనసాగిస్తున్నారు. కానీ, కాంగ్రెస్ మాత్రం ఇప్పటివరకు అభ్యర్థి విషయంలో పీటమూడి వీడటం లేదు. కొద్ది రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలై నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుండగా కాంగ్రెస్ అధిష్ఠానం మాత్రం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఈ ఉత్కంఠకు ముగింపు ఎప్పుడా అని జిల్లా ప్రజలు ఎదురుచూస్తున్నారు.
భద్రాచలంలో కళ్యాణ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయి. భక్తుల సౌకర్యార్థం సౌమిత్రీ సదనం సమీపంలో రూ.3.6 కోట్లతో గ్రౌండ్ ప్లస్ 2పద్ధతిలో 34 గదులను నిర్మించారు. దీనికి జానకీ సదనం అని పేరు నిర్ణయించారు. ఇంకొన్ని పనులు మిగిలి ఉండగా వీలైనంత తొందరగా పూర్తిచేసి 17న ప్రారంభించాలని సమాలోచనలు చేస్తున్నారు. ఇప్పటికే ఉన్న సత్రాలకు తోడు ఇది అందుబాటులోకి వస్తే భక్తులకు వసతి సదుపాయం మెరుగుపడనుంది.
ఖమ్మం పార్లమెంట్ పరిధిలోని వివిధ శాఖల్లో విధులు నిర్వర్తించే ఉద్యోగులకు ఇతర పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఎన్నికల విధులు కేటాయించే అవకాశముంది. దీంతో వీరికి మాత్రం గతంలో మాదిరిగానే పోస్టల్ బ్యాలెట్లు ఇస్తారు. ఇతర జిల్లాల నుంచి ఇక్కడకు ఎవరైనా వస్తే వారు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉంటుంది. వీరు సంబంధిత ఆర్డీఓ కార్యాలయంలో ఏర్పాటుచేసే బ్యాలెట్ బాక్స్‌లో ఓటు వేయాలి.
అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో శుక్రవారం ఉదయం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. మండలం నాచేపల్లి గ్రామానికి చెందిన సట్టు నాగరాజు(29) గ్రామ శివారులోని వ్యవసాయ బావిలో పడి మృతి చెందాడు. గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
∆} పలు శాఖలపై ఉమ్మడి ఖమ్మం జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఖమ్మం నగరంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
∆} పెనుబల్లిలో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం
∆} దుమ్ముగూడెం మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} తల్లాడ మండలంలో ఎమ్మెల్యే రాగమయి పర్యటన
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సెలవు
ఖమ్మంలోని చెరువుకట్ట బజార్‌కు చెందిన రాములు మంగళవారం రాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా, విచారణలో ఆయనది హత్యేనని పోలీసులు తేల్చారు. రాములును ఆయన భార్య సత్యవతి కత్తిపీటతో ముఖంపై నరికి హత్య చేసినట్లు ఖమ్మం టూటౌన్ సీఐ బాలకృష్ణ తెలిపారు. దీంతో ఆమెను గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు.
భద్రాచలంలో ఈనెల 17, 18 తేదీలలో జరిగే శ్రీరామనవమి, మహా పట్టాభిషేక మహోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఆన్‌లైన్‌లో గదులు బుక్ చేసుకునే సౌకర్యం కల్పించబడిందని జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా ఒక ప్రకటన విడుదల చేశారు. https://book.bhadrachalamonline.com/book-hotel ఈ లింకు ద్వారా శ్రీరామ నవమి మహా పట్టాభిషేకానికి వచ్చే భక్తులు గదులు బుకింగ్ చేసుకోవాలని తెలిపారు.
కామేపల్లి మండలం గోవిందరాల గ్రామంలో ఆర్థిక సమస్యలు ఓ కుటుంబాన్ని చిదిమేశాయి. వ్యవసాయం చేస్తే లాభాలొస్తాయని అప్పులు తెచ్చిమరి సాగు చేస్తే చివరకు అప్పులే మిగిలాయి. ఆ అప్పులు ఎలా తీర్చాలో తెలియక 2నెలల క్రితం ఇంటి యజమాని పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తాళికట్టి అండగా నిలిచిన భర్త దూరం కావడంతో మనోవేదనకు గురైన అతడి భార్య తన కుమారుడితో కలిసి ఎలుకల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.
Sorry, no posts matched your criteria.