India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ఉమ్మడి జిల్లాలో లోక్ సభ ఎన్నికలకు అధికారులు సమాయత్తమవుతున్నారు. ఖమ్మం, మహబూబాబాద్ ఎంపీ స్థానాలకు లోక్ సభ ఎన్నికలు మే 13న జరగనున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలో నూతన ఓటు నమోదు, జాబితాలో మార్పులకు ఎన్నికల సంఘం ఈ నెల 15 వరకు గడువు విధించింది. ఓటరుగా నమోదు చేసుకోవడానికి మరో 4రోజుల సమయం ఉంది. ఈ నెల 25న ఓటరు తుది జాబితా విడుదల కానుంది.
కరకగూడెం మండలం బంగారు గూడెం గ్రామంలో గురువారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు ద్విచక్ర వాహనాలు గ్రామంలోని ప్రధాన రహదారిపై ఎదురెదురుగా ఢీకొనడంతో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉంది. క్షతగాత్రులు తోగ్గూడెం గ్రామానికి చెందిన వారిగా స్థానికులు గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో ఓ పసిబిడ్డ మృతి చెందిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాకు చెందిన సోమిడి – శుక్లాన్ దంపతుల ఏడాది కుమారుడికి జ్వరం, దగ్గు, ఆయాసం రావడంతో భద్రాచలం ఆస్పత్రికి తీసుకువచ్చారు. తీవ్ర అస్వస్థతకు గురై బాలుడు మృతి చెందాడు. బాలుడు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ మృతి చెందాడని ఆర్ఎంవో రాజశేఖర్ తెలిపారు.
అనుమానంతో కట్టుకున్న భార్యని హతమార్చిన ఘటన కూసుమంచి మండలంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల వివరాల ప్రకారం.. నర్సింహలగూడెం గ్రామానికి చెందిన మల్లమ్మ, మల్లయ్య దంపతులు వ్యవసాయ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే గత కొద్ది రోజులుగా వీరి మధ్యగొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో భార్యపై అనుమానం పెట్టుకున్న మల్లయ్య భార్యను పొడిచి హత్య చేశాడు అని తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
భార్యకు ఉరివేసి హత్య చేసిన సంఘటన తిరుమలయపాలెం మండలంలో బుధవారం జరిగింది. సుబ్లేడ్‌కు చెందిన పోలెపొంగు ఇస్తారి, ఆయన భార్య సరోజన (63) కుమారుడు సుమంత్‌తో కలిసి జీవిస్తున్నారు. సుమంత్ మంగళవారం ఉగాది పండుగకు భార్యతో కలిసి అత్తగారింటికి వెళ్లారు. అయితే మద్యం మత్తులో ఉన్న ఇస్తారి భార్యతో గొడవ పడి మెడకు ఉరివేశాడు. కుమారుడు ఇచ్చిన ఫిర్యాదుతో బుధవారం పోలీసులు కేసు నమోదు చేశారు.
> జిల్లావ్యాప్తంగా రంజాన్ వేడుకలు
> సత్తుపల్లిలో ఎమ్మెల్యే మట్టా రాగమయి పర్యటన
> కారేపల్లిలో కోట మైసమ్మ తల్లి జాతర
> ఖమ్మంలో ఎంపీలు నామా నాగేశ్వర రావు, వద్దిరాజు రవిచంద్ర పర్యటన
> మధిరలో సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశం
> ఎర్రుపాలెం మండలం అయ్యవారిపల్లి లో రెండు తెలుగు రాష్ట్రాల స్థాయి కబడ్డీ పోటీలు
> భద్రాచలం రామాలయంలో బ్రహ్మోత్సవాలు
> ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కు సెలవు
> జ్యోతిరావు పూలే జయంతి
కాంగ్రెస్ పార్టీలో మరోసారి గ్రూపు గొడవలు బయటపడ్డాయి. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వీహెచ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ టికెట్ తనకు రాకుండా భట్టి విక్రమార్క అడ్డుపడుతున్నారని ఆరోపించారు. ఆయన సతీమణికి ఎంపీ టికెట్ కోసం భట్టి ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
వడ దెబ్బ ప్రమాదకరమని జాగ్రత్తలతోనే నివారణ సాధ్యమని ఖమ్మం కలెక్టర్ గౌతమ్ అన్నారు. కలెక్టరేట్ లో జరిగిన కార్యక్రమంలో “వడదెబ్బ నుంచి రక్షించుకుందాం” అనే ప్రచార పోస్టర్ ను కలెక్టర్ ఆవిష్కరించారు. వేసవి జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ పేర్కొన్నారు. చిన్న, పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎండ వేడి నుంచి రక్షణ పొందాలన్నారు. కనీస జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
త్రాగునీటి సరఫరాలో వచ్చే ఇబ్బందులను సత్వరమే పరిష్కరించాలని, ప్రజలకు ఎక్కడా, ఎలాంటి ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు వహించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సంద్భంగా హైద్రాబాద్ నుండి రాష్ట్ర స్థాయి ఉన్నత స్థాయి అధికారులతో కలిసి ఆమె వేసవిలో త్రాగునీటి సరఫరాపై ఖమ్మం జిల్లా అధికారులతో వీడియో కాన్ఫిరెన్స్ నిర్వహించారు. నీటి సమస్యలపై సీఎస్ తెలుసుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరి రాజ్యసభ సభ్యురాలిగా బుధవారం ప్రమాణస్వీకారం చేశారు. రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ కార్యాలయంలో ఆమె ప్రమాణం చేశారు. రేణుకా చౌదరి వెంట పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అధికారిక ప్రక్రియ పూర్తవ్వడంతో ఎంపీగా ఆమె బాధ్యతలు స్వీకరించారు. కాగా మూడోసారి రాజ్యసభ ఎంపీగా ఆమె పనిచేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.