Khammam

News April 10, 2024

బీఆర్‌ఎస్ నేతలకు భద్రాచలం ఎమ్మెల్యే హెచ్చరిక

image

బీఆర్‌ఎస్ నేతలు నోటికి వచ్చినట్లు మాట్లాడితే భద్రాచలంలో అడుగుపెట్టనివ్వమని ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హెచ్చరించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు.. రాజకీయ అనుభవం లేని MLC తాతా మధుకు తనను విమర్శించే స్థాయిలేదన్నారు. భద్రాచలం అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరానని స్పష్టం చేశారు. ఇటీవల వెంకట్రావు BRS నుంచి కాంగ్రెస్లో చేరిన విషయం తెలిసిందే. పార్టీ మారిన వెంకట్రావుపై BRSనేతలు ఫైర్ అవుతున్నారు.

News April 10, 2024

ఫారెస్ట్ బీట్ అధికారి‌పై దాడి..

image

ములకలపల్లి మండల పరిధిలోని గుండాలపాడు పంచాయతీ చలమన్న నగర్‌లో ఫారెస్ట్ బీట్ అధికారిపై దాడి జరిగిన ఘటన బుధవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే పోడుభూములకు ఆనుకొని ఉన్న ఫారెస్ట్ భూములను చదును చేస్తున్నారని సమాచారం మేరకు బీట్ అధికారి వెంకన్న అక్కడికి చేరుకున్నారు. అక్కడే ఉన్న 15 మంది అతనిపై ముకుమ్మడి దాడి చేసినట్లు ఫారెస్ట్ అధికారులు తెలిపారు. అధికారికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు.

News April 10, 2024

తల్లంపాడు, పొన్నెకల్లులో భారీగా దోపిడీ..?

image

తల్లంపాడు, పొన్నెకల్లు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన సీసీఐ కేంద్రాల్లో నాణ్యత సాకు చూపి దోపిడీకి పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్వింటాకు 5-10 కిలోల తరుగు తీసినట్లు రైతులు చెబుతున్నారు. తాత్కాలిక రిజిస్ట్రేషన్‌ కోసం రూ.1,000-2,000 చొప్పున దండుకున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మార్కెటింగ్‌ శాఖ, సీసీఐ అధికారులు ఈ అక్రమాలకు పాల్పడినట్లు సమాచారం.

News April 10, 2024

కేయూ డిగ్రీ కోర్సుల పరీక్షల టైం టేబుల్

image

KU పరిధి డిగ్రీ కోర్సుల పరీక్షలకు సంబంధించి KU పరీక్షల నియంత్రణాధికారి నర్సింహాచారి నోటిఫికేషన్ విడుదల చేశారు. BA, Bcom, BSC, BCA BBA BA(ఎల్ఎం)కు సంబంధించిన 2వ, 6వ సెమిస్టర్ పరీక్షలు మే 6 నుంచి ప్రారంభం కానున్నాయి. డిగ్రీ కోర్సుల 4వ సెమిస్టర్ పరీక్షలు మే 7 నుంచి జరగనున్నాయి. 2వ సెమిస్టర్ పరీక్షలు 6, 8, 10, 16, 18, 21, 23, 25 తేదీలలో మధ్యాహ్నం 2నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.

News April 10, 2024

ఖమ్మం: వడదెబ్బతో ఒకే రోజు ముగ్గురు మృతి

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వడదెబ్బతో ఒకే రోజు ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు.  కారేపల్లి మండలం తొడితలగూడెంకి చెందిన వెంకటేశ్వర్లు (55) వ్యవసాయ కూలీ పనికి వెళుతుంటారు. సోమవారం వడదెబ్బ కొట్టగా మంగళవారం చనిపోయారు. బోడు పంచాయతీ లాక్యాతండాకు చెందిన బాలాజీ, కొత్తగూడేనికి చెందిన 14,15 డివిజన్ల సీపీఐ కార్యవర్గ సభ్యుడు బక్కయ్య ఎండదెబ్బతో మృతిచెందారు. 

News April 10, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో TODAY HEADLINES

image

✓ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
✓ఖమ్మంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పర్యటన
✓భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
✓అశ్వారావుపేట మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
✓ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
✓కల్లూరు మండలంలో ఎమ్మెల్యే మట్టా రాగమయి పర్యటన
✓వైరా మండలంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన

News April 10, 2024

భద్రాచలం: రాముడి ఆదాయం 14, వ్యయం 2

image

దేవస్థానంలో మంగళవారం క్రోధినామ తెలుగు సంవత్సరాది వేడుకలను వైభవోపేతంగా జరిపారు. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని వేపపూత పచ్చడి నివేదన చేసి భక్తులకు పంచారు. ఈ ఏడాది రాముడి ఆదాయం 14, వ్యయం 2, రాజ పూజ్యం 6, అవమానం6గా ఉందని తెలిపారు. సీతమ్మవారి ఆదాయం 5, వ్యయం 5 అని, రాజపూజ్యం 5, అవమానం 2గా ఉంటుందని పేర్కొన్నారు. జ్యేష్టమాసం శుక్లపక్షంలో తొలకరులు ఉంటాయని, సస్యవృద్ధి ఉంటుందని వెల్లడించారు.

News April 10, 2024

ఖమ్మం: BRS, కాంగ్రెస్ నేతల ఘర్షణ.. ఉద్రిక్తత

image

కామేపల్లి మండలంలోని పండితాపురంలో BRS, కాంగ్రెస్ నేతలు ఘర్షణకు దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. బాధితుల వివరాలిలా.. ఉగాది పండుగ సందర్భంగా గ్రామంలో మంగళవారం ఎడ్లబండ్లతో ఊరేగింపు నిర్వహించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ నాయకుడు హరిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. ఇరువురికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. ఎస్సై ప్రవీణ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని బందోబస్తు ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు.

News April 10, 2024

ఖమ్మం: గుండెపోటుతో అంగన్వాడీ టీచర్ మృతి

image

రఘునాథపాలెం మండలంలోని వీవీ పాలెం ఎస్టీ కాలనీ అంగన్వాడీ టీచర్ బానోత్ రంగాబాయి (46) గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు. గ్రామస్థుల కథనం ప్రకారం.. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రంగాబాయి మంగళవారం గుండెపోటుకు గురికాగా ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో మృతి చెందినట్లు తెలిపారు. మృతురాలికి భర్త, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు.

News April 10, 2024

KMM: 1.62 లక్షల ఎకరాల్లో వరి సాగు

image

ఏడాది ఆశించిన స్థాయిలో నీటి సౌకర్యం లేక యాసంగిలో వరి సాగు గణనీయంగా తగ్గింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 1,62,391 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఖమ్మం జిల్లాలో 1,05,333 ఎకరాల్లో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 57,058 ఎకరాల్లో రైతులు వరి సాగు చేయగా.. నీటి వనరులు ఉన్న ప్రాంతాల్లో సన్న రకాల సాగుకే ప్రాధాన్యత ఇచ్చారు. నీటి సౌకర్యం ఉన్న ప్రాంతాల్లో ఎకరాకు 35 నుంచి 40 బస్తాల వరకు దిగుబడి వచ్చిందని రైతులు తెలిపారు.