Khammam

News August 11, 2024

అశ్వారావుపేట: బాలికను వేధిస్తున్న బాలుడిపై పోక్సో కేసు

image

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం ఓ గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికను వేధిస్తున్న బాలుడిపై శనివారం పోక్సో కేసు నమోదు చేశారు. కొంతకాలంగా బాలికను అదే గ్రామానికి చెందిన బాలుడు(18) ప్రేమ పేరుతో వెంటబడుతూ అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. బాలిక తల్లిదండ్రులకు తెలపడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్టు ఎస్సై శివరామకృష్ణ తెలిపారు.

News August 11, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

> నేడు ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రుల పర్యటన
> సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఎమ్మెల్యే రాగమయి పుట్టిన రోజు వేడుకలు
> కారేపల్లి మండలంలో ఎమ్మెల్యే రాందాస్ నాయక్ పర్యటన
> భద్రాద్రి రామయ్య, పాల్వంచ పెద్దమ్మతల్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు
> ఉమ్మడి జిల్లాలో పర్యటించనున్న ఇరు జిల్లాల కలెక్టర్లు
> భద్రాద్రి జిల్లాలోని పలు గ్రామాల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు

News August 11, 2024

పాల్వంచ హమాలీ కాలనీలో భారీ కొండచిలువ

image

పాల్వంచ మునిసిపాలిటీ హమాలీ కాలనీలో శనివారం కొండచిలువ హల్చల్ చేసింది. కాలనీలోకి కొండచిలువ రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వారు స్నేక్ క్యాచర్ పావురాల సంగయ్యకు సమాచారం అందించారు. స్నేక్ క్యాచర్ 10 అడుగుల కొండచిలువను పట్టుకొని మైలారం అటవీ ప్రాంతంలో వదిలివేయడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.

News August 11, 2024

‘కోర్టు డ్యూటీ అధికారులు సమర్థవంతంగా పనిచేయాలి’

image

ప్రతి కేసులోనూ నిందితులకు శిక్ష పడేలా కోర్టు డ్యూటీ అధికారులు సమర్ధవంతంగా పని చేయాలని సీపీ సునీల్ దత్ అన్నారు. కోర్టు డ్యూటీ ఆఫీసర్ల శిక్షణా కార్యక్రమంలో సీపీఐ మాట్లాడారు. నేరస్తులను కట్టడి చేయాలంటే సరైన సాక్ష్యాధారాలు, సాక్షుల వాంగ్మూలాలు, సాంకేతిక, వైద్యపరమైన ఆధారాలను సేకరించి సరైన పద్ధతిలో కోర్టుకు సమర్పించాలన్నారు. సీసీ నంబర్లు పొందేలా సాక్షులు ముద్దాయిలు కోర్టుకు హాజరయ్యేలా చూడాలన్నారు.

News August 10, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యంశాలు

image

>దుమ్ముగూడెం రోడ్డు ప్రమాదం.. విద్యార్థి మృతి
>ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేస్తాం: మంత్రి తుమ్మల
>విద్యుత్ షాక్‌తో సాఫ్ట్వేర్ ఉద్యోగి మృతి
>కోర్టు డ్యూటీ అధికారులు సమర్థవంతంగా పనిచేయాలి: సీపీ
>పాల్వంచ హమాలీ కాలనీలో భారీ కొండచిలువ
>మంత్రి తుమ్మలను కలిసిన నీట్ విద్యార్థులు
>ఈ భూమాత మరో ధరణి కారాదు: హై కోర్ట్ అడ్వకేట్

News August 10, 2024

విద్యుత్ షాక్‌తో సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మృతి

image

ఖమ్మం జిల్లా వైరా మండలంలోని విప్పలమడకలో సాఫ్ట్ వేర్ ఉద్యోగి బూరుగు సురేశ్ (29)విద్యుత్ షాక్‌తో మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం.. మూత్ర విసర్జన చేసిన ప్రదేశంలో 11 కేవి అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్ ఉండటంతో అతనికి విద్యుత్ షాక్ తగిలిన వెంటనే లైన్ ట్రిప్ అయినది. సబ్ స్టేషన్‌లో ఉన్న
సిబ్బంది 5 నిమిషాల తర్వాత లైన్ ఆన్ చేశారు. అక్కడే పడిపోయి ఉన్న సురేశ్‌కు మరోసారి విద్యుత్ షాక్ తగిలి మృతి చెందారు.

News August 10, 2024

ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రుల పర్యటన

image

మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు రేపు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయం నుంచి శనివారం మధ్యాహ్నం ఒక ప్రకటన విడుదల చేశారు. ములకలపల్లి, వైరాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.

News August 10, 2024

ఖమ్మం జిల్లాలో ముగ్గురు మంత్రుల పర్యటన

image

మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు రేపు ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి క్యాంపు కార్యాలయం నుంచి శనివారం మధ్యాహ్నం ఒక ప్రకటన విడుదల చేశారు. ములకలపల్లి, వైరాలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు.

News August 10, 2024

రోడ్డు ప్రమాదం.. విద్యార్థి మృతి

image

దుమ్ముగూడెం మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కొత్తపల్లి ఆశ్రమ పాఠశాలకు చెందిన ఎనిమిదో తరగతి విద్యార్థులు శుక్రవారం ఆటోలో వెళుతుండగా తునికిచెరువు దగ్గర ఆటో అదుపుతప్పి పల్టీ కోట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న కుంజా దీపక్ అనే విద్యార్థి మృతి చెందాడు. మృతదేహాన్ని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 10, 2024

దారుణం.. దోమల మందుతాగి మహిళ మృతి

image

కొత్తగూడెంలో మున్సిపల్ కాంట్రాక్టు కార్మికురాలు బత్తుల ఓదమ్మ దోమల మందు తాగి మృతి చెందింది. ఆమె నిన్న మంచినీళ్లు అనుకుని వాటర్ బాటిల్‌లోఉన్న దోమల మందును తాగింది. ఆమె అస్వస్థతకు గురికావడంతో స్థానికులు ఆమెను కొత్తగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది.