Khammam

News March 17, 2024

ఖమ్మంలో పాగా వేసేదెవరు..?

image

KMM, MHBDలో పాగా వేయాలని కాంగ్రెస్‌ వ్యూహాలు రచిస్తోంది. MHBD స్థానం నుంచి బలరాంనాయక్‌ బరిలో ఉండగా.. ఖమ్మం అభ్యర్థిని ప్రకటించలేదు. అటూ BRS ఈ రెండు స్థానాలను నిలబెట్టుకోవాలని అడుగులు వేస్తోంది. సిట్టింగ్‌ ఎంపీలు నామా నాగేశ్వరరావు, కవితకు మళ్లీ టికెట్లు ప్రకటించింది. మరో పక్క BJP సత్తాచాటాలని ఉవ్విళ్లూరుతోంది. MHBD నుంచి అజ్మీరా సీతారాంనాయక్‌ను బరిలో నిలిపింది. ఖమ్మం అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది.

News March 17, 2024

మువ్వా విజయ్‌బాబుకు కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి

image

మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రధాన అనుచరుడిగా కొనసాగుతున్న మువ్వా విజయ్‌బాబును కార్పొరేషన్‌ ఛైర్మన్‌ పదవి వరించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు నియోజకవర్గ ఇన్‌ఛార్జి బాధ్యతలను విజయ్‌బాబు నిర్వర్తించి కాంగ్రెస్‌ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఆయనకు ప్రభుత్వం గృహనిర్మాణ అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌ పదవిని కట్టబెట్టింది.

News March 17, 2024

ఎన్నికల షెడ్యూల్‌పై కలెక్టర్ ప్రత్యేక సమావేశం

image

లోకసభ సాధారణ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో విధివిధానాలను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వీపీ గౌతమ్ ఆదివారం వెల్లడించనున్నట్లు డిపిఆర్ఓ శనివారం ప్రకటన విడుదల చేశారు. ఖమ్మం జడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 11 గంటలకు జరిగే ఈ సమావేశానికి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులందరూ హాజరుకావాలని సూచించారు.

News March 16, 2024

ఉమ్మడి జిల్లాలో ఎన్నికల నగారా.. అనుమతులు తప్పనిసరి!

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో లోక్‌సభ ఎన్నికల నగారా మోగింది. నియోజకవర్గాల వ్యాప్తంగా ఎన్నికల కోడ్ తక్షణం అమలులోకి వచ్చిందని ఆయా జిల్లాల కలెక్టర్లు తెలిపారు. సభలు, సమావేశాలు, ర్యాలీలు, మైక్ అనుమతులు, వాహన అనుమతులను ఆయా జిల్లాల కలెక్టర్ల నుంచి పొందాలని స్పష్టం చేశారు. ఎవరైనా ఎన్నికల నియమ నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

News March 16, 2024

భట్టి పీపుల్స్ మార్చ్ పాదయాత్రకు నేటికి ఏడాది

image

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పేరుతో నాటి కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత హోదాలో చేపట్టిన పాదయాత్రకు ఏడాది పూర్తయింది. గతేడాది మార్చి 16న ఆయన ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని పిప్పిరి గ్రామం నుంచి ఈ పాదయాత్రను చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ క్యాడర్‌ను కదిలించి అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయమే లక్ష్యంగా ఆయన చేపట్టిన యాత్ర 109 రోజులపాటు 1,364 కిలోమీటర్లు సాగింది.