India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
పొంగులేటి ఏ పార్టీలో ఉంటే.. ఆ పార్టీ అభ్యర్థి ఖమ్మం ఎంపీగా గెలవడం పరిపాటిగా మారింది. 2014లో ఆయన YCPలో ఉండగా ఖమ్మం MPగా గెలిచారు. 2019లో TRSలో చేరగా.. ఆ పార్టీ నుంచి బరిలో నిలిచిన నామా విజయం సాధించారు. ప్రస్తుతం పొంగులేటి కాంగ్రెస్‌లో ఉండటంతో హస్తం పార్టీనే ఖమ్మం సీటును గెలుస్తుందని కాంగ్రెస్ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. మరి పొంగులేటి సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందా.. కామెంట్ చేయండి.
చర్ల మండల పరిధిలోని జీపీ పల్లి గ్రామంలో ఆదివారం రెండు తలలు, ఆరు కాళ్ళతో లేగదూడ జన్మించింది. గ్రామానికి చెందిన శ్రీనివాసరెడ్డికి చెందిన ఆవు ఆదివారం తెల్లవారుజామున ఈనింది. పుట్టిన లేగదూడ రెండు తలలు, ఆరు కాళ్ళతో ఉంది. దీంతో విషయం తెలుసుకున్న గ్రామస్తులు శ్రీనివాసరెడ్డి ఇంటికి తండోపతండాలుగా తరలి వచ్చి లేగ దూడను చూశారు. కాగా లేగదూడ పుట్టిన గంట తర్వాత మృతి చెందిందని బోరా శ్రీనివాసరెడ్డి తెలిపారు.
మధిర మండలంలో కరెంట్ షాక్‌తో సుతారి కూలీ మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. రామచంద్రాపురంకు చెందిన కాకర్ల తిరుపతిరావు అనే వ్యక్తి మధిరలో ఓ అపార్ట్మెంట్ నిర్మాణంలో సుతారి కూలీగా పనిచేస్తున్నాడు. ఈ సమయంలో ఇసుకను ఎలక్ట్రానిక్ జల్లెడతో జల్లెడపోస్తుండగా కరెంట్ షాక్ తగిలి మృతి చెందాడు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చరీకి తరలించారు.
BRS పై పొంగులేటి చేసిన శపథం నెరవేరింది. ఖమ్మం ఉమ్మడి జిల్లా నుంచి ఒక్క BRS ఎమ్మెల్యేను అసెంబ్లీ గేటు తాకనివ్వనని చెప్పి ఎన్నికల్లో కాంగ్రెస్ తొమ్మిది స్థానాలు గెలుచుకునేలా కృషి చేశారు. అయితే ఒకే స్థానం BRS గెలిచింది. ఆ ఒక్క MLA తెల్లం వెంకట్రావును కూడా నేడు కాంగ్రెస్‌లోకి చేర్చుకున్నారు. ప్రస్తుతం జిల్లాలో BRSకు ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. దీంతో పొంగులేటి శపథం నేరవేరిందని స్థనికంగా చర్చ జరుగుతుంది.
భద్రాచలం MLA తెల్లం వెంకట్రావు పార్టీ మార్పుపై కేటీఆర్ స్పందించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఒక పార్టీలో గెలిచి ఇంకో పార్టేకి వెళితే వెంటనే వారు అనర్హులయ్యేలా చట్ట సవరణ చేస్తామని చెబుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ ద్వంద నీతిని ప్రదర్శిస్తోందని మండిపడ్డారు. గెలవక ముందు ఒకలా గెలిచాక ఒకలా కాంగ్రెస్ పరిస్థితి ఉందని.. హస్తం పార్టీకి బీజేపీకి తేడా ఏంటని ప్రశ్నించారు.
భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు కాంగ్రెస్ సమావేశాలకు హాజరు కావడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని BRS పార్టీ జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు అన్నారు. తెల్లం వెంకటరావుపై అనర్హత వేటు వేయాలని స్పీకర్‌కు ఫిర్యాదు చేస్తున్నామని, స్పీకర్ చర్యలు తీసుకోకుంటే న్యాయపరంగా కోర్టులో తేల్చుకుంటామని చెప్పారు. బీఆర్ఎస్ లో గెలిచి కాంగ్రెస్‌లో చేరడం పార్టీ వ్యతిరేక చర్య కిందికి వస్తుందన్నారు.
ఖమ్మం జిల్లా ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్‌లో ఉంది. ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు పైగా నమోదవుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రానున్న రెండు నెలల్లో ఉష్ణోగ్రత మరింతగా పెరిగే అవకాశాలున్నందున అందుకు తగినట్లుగా జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. మధ్యాహ్న సమయంలో ప్రజలు తమ పనులను కూడా వాయిదా వేసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. వడదెబ్బ బారిన పడకుండా కాపాడుకోవాలని చెబుతున్నారు.
ఖమ్మం ఓటర్లు విలక్షణమైన తీర్పునిస్తుంటారు . 2014లో జరిగిన ఎన్నికల్లో ఎంపీగా వైసీపీ నుంచి పొంగులేటిని గెలిపించారు. 2019లో బీఆర్ఎస్ నుంచి నామాను లోక్ సభకు పంపారు. తెలంగాణ ఇచ్చినప్పటికీ ఈ రెండు సార్లు కాంగ్రెస్‌ను ఆదరించలేదు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం పరిధిలో అన్ని ఎమ్మెల్యే స్థానాలను కాంగ్రెస్ గెలుచుకుంది. మరి అదే ఊపును ఎంపీ ఎన్నికల్లో కొనసాగిస్తుందా.. కామెంట్ చేయండి.
వేసవిలో ఎండల తాకిడికి ప్రజలు అల్లాడుతున్నారు. అయితే నీడ పట్టున ఉండి పని చేసే వారికి సమస్య తీవ్రత తక్కువగా ఉండగా ఆర్టీసీ ఉద్యోగులు మాత్రం భానుడి ప్రతాపాన్ని ఎదుర్కొంటూనే విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఉదయం మధ్యాహ్నం తేడా లేకుండా డ్రైవర్లు, కండక్టర్లు విధులకు హాజరు కావాల్సిందే. ఎండ వేడిమి నుంచి ఉపశమనం కోసం తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా వడదెబ్బ బారిన పడకుండా కాపాడకోవాలని అధికారులు సూచిస్తున్నారు
భద్రాచలంలో శ్రీరామనవమి సందర్భంగా భక్తులకు పంపిణీ చేసేందుకు గతేడాది 150 క్వింటాళ్ల తలంబ్రాలు తయారుచేయగా, ఈ ఏడాది 250 క్వింటాళ్లకు పెంచుతున్నట్లు ఈఓ రమాదేవి ఆదివారం తెలిపారు. పంపిణీకి 60 కౌంటర్లు ఏర్పాటు చేయడంతో పాటు 600 బస్సుల్లో 600 కేజీలు పంచనున్నట్లు చెప్పారు. ప్రసాదాలు పోస్టల్ ద్వారా విక్రయిస్తుండగా, తలంబ్రాలు పోస్టల్, ఆర్టీసీ కార్గో ద్వారా సరఫరాకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.
Sorry, no posts matched your criteria.