Khammam

News August 7, 2024

ఖమ్మం, వరంగల్ రైల్వే అలైన్మెంట్ మార్చండి: మంత్రి పొంగులేటి

image

ఖమ్మం వరంగల్ జిల్లా మీదుగా దక్షిణ మద్య రైల్వే కొత్తగా ఏర్పాటు చేయనున్న రైలు మార్గాల్లోని అలైన్ మెంట్లో మార్పులు చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దక్షిణ మద్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్‌కు విజ్ఞప్తి చేశారు. పాలేరు నియోజకవర్గం మీదుగా రైల్వే మార్గం వెళ్తుందని దీనివల్ల సాగు భూములను రైతులు కోల్పోవాల్సి వస్తుందన్నారు. మరో మార్గంలో రైల్వేలైన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

News August 7, 2024

భద్రాచలం కాలువలో పడి వ్యక్తి గల్లంతు

image

భద్రాచలంలో చర్ల రోడ్డులోని భాను మెకానిక్ షెడ్ పక్కన ఉన్న కాలవలో వ్యక్తి పడి గల్లంతయ్యాడు. భద్రాచలం తహశీల్దార్ టి.శ్రీనివాస్, పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆ వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

News August 7, 2024

జడ్పీ ప్రత్యేక అధికారిగా కలెక్టర్ బాధ్యతల స్వీకరణ

image

ఖమ్మం జిల్లా ప్రజాపరిషత్ ప్రత్యేక అధికారిగా జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ బుధవారం పదవి బాధ్యతలను స్వీకరించారు. ఈ మేరకు ఆయన బుధవారం జిల్లా ప్రజాపరిషత్ కార్యాలయానికి వెళ్లి ప్రత్యేక అధికారిగా బాధ్యతలను చేపట్టారు. ఖమ్మం జిల్లా ప్రజాపరిషత్ ఛైర్మన్ పదవీకాలం ఈ నెల 6తో ముగిసి పోవడంతో రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ప్రజాపరిషత్ లకు ప్రత్యేక అధికారులను నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేసింది.

News August 7, 2024

విద్యార్థులపై దాడి చేసిన నిందితులు అరెస్ట్

image

పోలీసులమని బెదిరించి విద్యార్థులపై దాడి చేసిన నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు సీఐ రమేశ్ తెలిపారు. ఆకాష్, తరుణ్, జస్వంత్ రాజు అనే విద్యార్థులు రుద్రంపూర్ నేషనల్ హైవే మెయిన్ రోడ్డు దగ్గర రీల్స్ తీస్తుండగా, నలుగురు వ్యక్తులు అక్కడికి వెళ్లి తాము పోలీసులమని వారిపై దాడికి పాల్పడ్డారు. దీంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. నిందితులను అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్లు CI పేర్కొన్నారు.

News August 7, 2024

శ్రావణ మాసం ఎఫెక్ట్.. తగ్గిన చికెన్ ధరలు

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో శ్రావణ మాసం ఎఫెక్ట్ చికెన్ ధరలపై పడింది. ఈ క్రమంలో వైరా మండలంలో బుధవారం మరోసారి చికెన్ ధరలు తగ్గాయి. గత నెల 27 వరకు కిలో స్కిన్ చికెన్ ధర రూ.180, స్కిన్ లెస్ చికెన్ రూ.200లుగా ఉంది. ప్రస్తుతం కిలో స్కిన్ చికెన్ రూ.160, స్కిన్ లెస్ చికెన్ ధర రూ.180కి పడిపోయింది.

News August 7, 2024

KU: 12 వరకు పరీక్ష ఫీజు చెల్లింపునకు గడువు

image

KU డిగ్రీ (థియరీ) 6వ సెమిస్టర్‌లో ఒక సబ్జెక్టు ఫెయిలైన విద్యార్థులకు ఆగస్టు 17న పరీక్ష నిర్వహిస్తున్నట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య నరసింహ చారి, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ ఎం.తిరుమల దేవి తెలిపారు. ఇందుకు సంబంధించిన ఫీజు నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. ఈ నెల 12వ తేదీ లోపు సంబంధిత కళాశాలలో ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు పరీక్ష ఉంటుందన్నారు.

News August 7, 2024

వైరా: రికార్డుస్థాయిలో నీటి మట్టం!

image

వైరా జలాశయం నీటిమట్టం భారీగా పెరిగింది. రికార్డు స్థాయిలో ఒకేరోజు 2.50 అడుగుల మేర పెరిగింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరద పోటెత్తడంతో ఒక్కరోజులోనే దాదాపు3 అడుగులు పైగా రిజర్వాయర్‌లోకి నీరు చేరింది. రిజర్వాయిర్ పూర్తిస్థాయి నీటి మట్టం 18.9 అడుగులకు గాను 15.9 అడుగులకు పైగా చేరినట్లు అధికారులు తెలిపారు.

News August 7, 2024

‘గడువులోగా జాతీయ రహదారుల నిర్మాణాలు పూర్తి చేయాలి’

image

గడువులోగా జాతీయ రహదారుల నిర్మాణాలు పూర్తి చేయాలని మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. రోడ్డు భవనాల శాఖ ప్రత్యేక అధికారితో జాతీయ రహదారుల నిర్మాణంపై సమీక్షించారు. KMM నుండి సూర్యాపేట ఎంట్రీ వద్ధ ఫై ఓవర్ నిర్మాణ పనులు సత్వరమే ప్రారంభిచాలని చెప్పారు. అటు ధ్వంసలపురం వద్ద ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్ల కోసం అయ్యే భూసేకరణ ఖర్చులు రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని దానికి అనుగుణంగా NHAI కి రేఖ రాయాలన్నారు.

News August 6, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లా నేటి ముఖ్యంశాలు

image

☆ ప్రజల ఆర్జీలను త్వరితగతిన పరిష్కరించాలి: ఖమ్మం కలెక్టర్
☆ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షపాతం నమోదు
☆ భద్రాచలంలో 57.56 కేజీల గంజాయి పట్టివేత
☆ జల శక్తి అభియాన్ కార్యక్రమంపై భద్రాద్రి జిల్లా కలెక్టర్ సమావేశం
☆ గడువులోగా జాతీయ రహదారుల నిర్మాణాలు పూర్తి చేయాలి- తుమ్మల
☆ ఉమ్మడి జిల్లాలో ప్రొ. జయశంకర్ జయంతి కార్యక్రమం
☆ పాల్వంచలో దారిదోపిడి దొంగలు అరెస్ట్

News August 6, 2024

భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా జలశక్తి అభియాన్ కార్యక్రమం

image

కొత్తగూడెం: భూగర్భ జలాలను పెంచడమే లక్ష్యంగా జలశక్తి అభయాన్ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు జల జీవన మిషన్ కేంద్ర నోడల్ అధికారి ఆసిఫ్ ఇస్మాయిల్ ఖాన్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్ నందు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. క్యాచ్ థ రైన్ వెన్ ఇట్ ఫాల్స్ అంశం పై కేంద్రం ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించారు.