Khammam

News August 5, 2024

శ్రమదానం చేసిన జిల్లా కలెక్టర్

image

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమాన్ని సోమవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ప్రారంభించారు. అధికారులు, పారిశుద్ధ్య సిబ్బందితో కలిసి స్థానిక 7వ వార్డు నందు పిచ్చి మొక్కలను తొలగించి జిల్లా కలెక్టర్ శ్రమదానం చేశారు. ప్రజలందరూ స్వచ్ఛదనం- పచ్చదనం కార్యక్రమంలో భాగస్వాములై పరిసరాలను శుభ్రం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు.

News August 5, 2024

కొత్తగూడెం: పాఠశాలకు తాళం వేసి విద్యార్థుల నిరసన

image

అశ్వాపురం మండలం కొత్తూరు ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సోమవారం పాఠశాలకు తాళం వేసి నిరసన కార్యక్రమం చేపట్టారు. 48 మంది విద్యార్థులకు ఏకైక ఉపాధ్యాయుడు ఉన్నారని చెప్పారు. దీనివల్ల విద్యార్థులకు సరైన విద్య బోధన అందడం లేదని అన్నారు. కావున మండల అధికారులు స్పందించి, పాఠశాలలో సరిపడా ఉపాధ్యాయులను నియమించాలని కోరారు.

News August 5, 2024

ఖమ్మం: ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రికల్ స్కూటీ దగ్ధం

image

ఛార్జింగ్ పెట్టిన ఎలక్ట్రికల్ స్కూటీ దగ్ధమైన ఘటన ముదిగొండ మండలం సువర్ణపురంలో ఆదివారం జరిగింది. బాధితుడి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన వేల్పుల వెంకటరామారావు తన ఎలక్ట్రిక్ స్కూటీకి ఛార్జింగ్ పెట్టారు. ఒక్కసారిగా బైక్ నుంచి మంటలు వచ్చాయి. క్షణాల్లో దగ్ధమైంది. 

News August 5, 2024

దోస్ట్ రిజిస్ట్రేషన్లకు ఇవాళే లాస్ట్: ప్రిన్సిపల్ మహ్మద్ జాకీరుల్లా

image

డిగ్రీలో చేరేందుకు ‘దోస్త్’ ప్రత్యేక విడతకు నేడు తుది గడువని ఖమ్మం ఎస్ఆర్&బీజీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ మహ్మద్ జకీరుల్లా తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ నెల 7న సీట్లు కేటాయిస్తారని.. 9 వరకు కళాశాలల్లో చేరాల్సి ఉంటుందని చెప్పారు. 

News August 5, 2024

రైతుల భూములను ఆక్రమించుకునే వారిని వదలొద్దు: మంత్రి

image

ఖమ్మం: రైతుల భూములను ఆక్రమించుకునే వారిని వదలొద్దని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కు సూచించారు. ఆదివారం పోలీస్ కమిషనర్‌తో మంత్రి సమావేశమై శాంతి భద్రతలపై చర్చించారు. జిల్లాలో గంజాయి విక్రయాలు.. వాడకంపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. వారిపై ఉక్కుపాదం మోపాలని పేర్కొన్నారు. గంజాయి మూలంగా యువత పెడదోవ పడతున్నారని దీన్ని అంతమొందించేందుకు తగిన చర్యలు చేపట్టాలన్నారు.

News August 4, 2024

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఈరోజు ముఖ్యంశాలు

image

✓ ముగిసిన మావోయిస్టుల వారోత్సవాలు
✓కార్పొరేషన్ చైర్మన్‌లతో మంత్రి తుమ్మల సమీక్ష
✓నా చివరి శ్వాస వరకు పాలేరు ప్రజల కోసమే పనిచేస్తా: మాజీ ఎమ్మెల్యే
✓మణుగూరులో రెండున్నర కిలోల గంజాయి పట్టివేత
✓రైతుల భూములను ఆక్రమించుకునే వారిని వదలొద్దు: మంత్రి పొంగులేటి

News August 4, 2024

ఖమ్మం: రేపటి నుంచి సందడే సందడి

image

మూడంతో మూడు నెలలు నిలిచిపోయిన శుభ కార్యక్రమాలు రేపటి నుంచి మళ్లీ ప్రారంభం కానున్నాయి. రేపటి నుంచి శ్రావణ మాసం మొదలవుతుంది. ఈనెల 8,9,10,11, 15,17,18,22,23,24,28,30 తేదీలలో వివాహ ముహూర్తాలు ఉన్నాయని ఇప్పటికే చాలామంది శుభ ముహూర్తాలు నిర్ణయించినట్లు అర్చకులు తెలిపారు. పెళ్లిళ్ల కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కళ్యాణ మండపాలను సిద్ధం చేస్తున్నారు. శ్రావణ మాసం సెప్టెంబర్ 3తో ముగుస్తుంది.

News August 4, 2024

ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇండ్లు:మంత్రి

image

ఖమ్మం: ఈ నెలాఖరులోగా ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్య, వైద్యానికి పెద్దపీట వేస్తుందని చెప్పారు. రైతులను రాజులు చేయాలని, రైతు ముఖంలో ఆనందం చూడాలని నెల రోజులలోపే రూ. 31 వేల కోట్లు రైతు పంట రుణమాఫీ చేశామన్నారు. ధరణి తో ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని పేర్కొన్నారు.

News August 4, 2024

దళిత బంధు దారి తప్పితే సహించేది లేదు: డిప్యూటీ సీఎం

image

దళిత బంధు దారి తప్పితే సహించేది లేదని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అన్నారు. దళిత బంధు దుర్వినియోగంలో లబ్ధిదారునికి ఎంత పాత్ర ఉంటుందో, ప్రత్యేక అధికారులకు అంతే పాత్ర ఉంటుందన్నారు. మొదటి దశ విజయవంతంగా పూర్తి చేసిన దళితబంధు లబ్ధిదారులకు వారంలోగా రెండో దశ నిధులు విడుదల చేస్తామని చెప్పారు. దళితబంధు కింద మంజూరైన యూనిట్లు లబ్ధిదారుల వద్ద ఉన్నాయా? లేదా? విచారణ చేయాలని అధికారులకు సూచించారు.

News August 4, 2024

ఖమ్మం: పోడు రైతులకు తిరిగి రుణాలు

image

పోడు, అసైన్డ్ పట్టాలు కలిగి రుణమాఫీ పొందిన రైతులకు తిరిగి రుణాలు ఇవ్వనున్నట్లు ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంక్(డీసీసీబీ) సీఈఓ అబీద్ ఉర్ రెహమాన్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని పీఏసీఎస్ నుంచి కల్పిస్తున్న ఈ సౌకర్యాన్ని రైతులు సద్వినియోగం సూచించారు. కాగా, డీసీసీబీ పరిధిలో తొలి విడత 37,625 మంది రైతులకు రూ.121.63 కోట్లు, రెండో విడతలో 19,504 మంది రైతులకు రూ.88.09 కోట్లు రుణమాఫీ అయిందని తెలిపారు.