Khammam

News April 4, 2024

ఖమ్మం: ఉన్నతాధికారుల కో-ఆర్డినేషన్ సమావేశం

image

అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోని ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో రెండు తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారుల కో-ఆర్డినేషన్ సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీ రావు, విజయవాడ సీపీ క్రాంతి రాణా టాటా, ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి గౌతమ్, ఖమ్మం సీపీ సునీల్ దత్, అడిషనల్ కలెక్టర్ మధు సూధన్ నాయక్ రెండు సరిహద్దు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

News April 4, 2024

ఫోన్ ట్యాపింగ్ పై డిప్యూటీ సీఎం భట్టి కీలక వ్యాఖ్యలు

image

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం విపక్ష నేతల ఫోన్ ట్యాపింగ్ చేసి పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛను హరించిందని మండిపడ్డారు. మంత్రులు, జడ్జిల ఫోన్లు సైతం ట్యాపింగ్‌కు గురయ్యాయంటే బీఆర్ఎస్ పాలనలో పరిస్థితి ఎలా ఉండేదో అర్ధం చేసుకోవచ్చు అని అన్నారు.

News April 4, 2024

మాదిగ జేఏసీ భద్రాద్రి జిల్లా అధ్యక్షులుగా రమేష్

image

పాల్వంచ మండలంలోని దంతేలబోర్ర గ్రామ మాజీ సర్పంచ్ గద్దల రమేష్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మాదిగ జేఏసీ అధ్యక్షులుగా నియమితులయ్యారు. దీనికి సంబంధించిన నియామక పత్రాలను మాదిగ జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు, మాజీ ఎస్సీ కార్పొరేషన్ ఛైర్మన్ పిడమర్తి రవి చేతుల మీదగా గద్దల రమేష్ అందుకున్నారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. మాదిగల పక్షాన ప్రశ్నించే ప్రజా గొంతుకనై మాదిగ జాతి కోసం పోరాడుతానని పేర్కొన్నారు.

News April 4, 2024

భద్రాద్రిలో నిత్య కళ్యాణాలు నిలిపివేత

image

భద్రాచలం రామాలయంలో ఈనెల 9నుంచి 23వరకు శ్రీరామనవమి కల్యాణ బ్రహ్మోత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టినట్లు ఈవో రమాదేవి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకుని ఈనెల 9నుంచి నిత్య కల్యాణాలను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. 24నుంచి తిరిగి నిత్య కళ్యాణాలు ఉంటాయన్నారు. 9న ఉగాది సందర్భంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం ఉంటుందని వెల్లడించారు.

News April 4, 2024

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు 5 రోజులు సెలవు

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు రేపటి నుంచి ఐదు రోజులు సెలవు ఉన్నట్లు మార్కెట్ శాఖ కార్యదర్శి గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. శుక్రవారం బాబు జగ్జీవన్ రావ్ జయంతి, శనివారం వారంతపు సెలవు, ఆదివారం సాధారణ సెలవు, 8న అమావాస్య, 9న ఉగాది పర్వదినం ఉన్న నేపథ్యంలో సెలవులు ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. తిరిగి బుధవారం పదో తారీఖున మార్కెట్ ప్రారంభం అవుతుందని చెప్పారు.

News April 4, 2024

ఖమ్మంలో భారీగా పెరిగిన మిర్చి ధర

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో పంటల ధరల వివరాలను మార్కెట్ శాఖ అధికారులు గురువారం ఉదయం వెల్లడించారు. మిర్చి జెండా పాట క్వింటా రూ.20,000 ధర పలకగా పత్తి జెండా పాట క్వింటా రూ.7300 పలికినట్లు వెల్లడించారు. పత్తి ధర నిన్నటి కంటే 100 రూపాయలు తగ్గగా మిర్చి ధర 1,300 పెరిగింది.

News April 4, 2024

KMM: ఏసీబీకి చిక్కిన వాణిజ్య అధికారి

image

కల్లూరులో తిరువూరు క్రాస్ రోడ్డు వద్ద ఉన్న బార్డర్ చెక్ పోస్ట్ వద్ద ఏసీబీ అధికారులు రైడ్స్ చేశారు. వాణిజ్యశాఖ అధికారి ఏసీటీవో -1 శ్రీరామ్‌తో పాటు మరికొంత మంది సిబ్బంది కలిసి వాహనదారుల నుంచి అక్రమంగా నగదు వసూలు చేస్తున్న సమయంలో రెడ్ హ్యాండెడ్‌‌గా పట్టుకున్నారు. వారి వద్ద అనధికారికంగా రూ.10వేల నగదు ఉందని, ప్రస్తుతం ఎంక్వయిరీ చేస్తున్నామని ఏసీబీ అధికారులు వెల్లడించారు.

News April 4, 2024

ఖమ్మం: పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని యువకుడి మృతి

image

పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ యువకుడు మృతిచెందాడు. ఖమ్మం జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. బోనకల్‌కి చెందిన బండి సురేష్ అనే యువకుడు బుధవారం రాత్రి రైలు పట్టాలు దాటుతుండగా ట్రైన్ అతణ్ని ఢీకొట్టింది. దీంతో సురేశ్ అక్కడికక్కడే మృతి చెందాడు. సురేశ్ మృతితో బోనకల్‌లో విషాదం అలుముకుంది. 

News April 4, 2024

ఖమ్మం: టీజీ డ్రైవింగ్ లైసెన్స్ కార్డులు వచ్చాయి

image

వాహనదారులకు అందించే ఆర్‌సీ, డ్రైవింగ్‌ లైసెన్స్‌ కార్డుల్లో టీజీగా మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం 20 రోజుల క్రితం నిర్ణయం తీసుకున్న విషయం విదితమే. కాగా, టీజీ పేరుతో ప్రింట్‌ చేసిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ కార్డులు బుధవారం జిల్లా రవాణా శాఖ కేంద్రానికి చేరుకున్నాయి. అయితే 1,500 కార్డులు పంపిణీ చేయాల్సి ఉండగా 500 కార్డులు మాత్రమే వచ్చాయి. జిల్లాకు సరిపడా కార్డులు త్వరలోనే వస్తాయని అధికారులు చెబుతున్నారు.

News April 4, 2024

ఖమ్మం: పనిచేస్తూనే కుప్పకూలి మహిళ మృతి

image

ఇంటి వద్ద పనిచేసుకుంటున్న ఓ మహిళ ఒక్కసారిగా కుప్పకూలి అక్కడికక్కడే మృతి చెందిన ఘటన నేలకొండపల్లిలో బుధవారం జరిగింది. సుజాత(57) బుధవారం ఇంటి వద్ద పనిచేసుకుంటోంది . ఈ క్రమంలో ఒక్కసారిగా కుప్పకూలడంతో కుటుంబ సభ్యులు గమనించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు.