India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.
ద్విచక్ర వాహనం అదుపుతప్పి ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడు మృతి చెందిన ఘటన కూనవరం మండలంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండాయిగూడెం గ్రామ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి కింద పడటంతో సోయం సాంబయ్య ఉపాధ్యాయుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
∆} ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} దుమ్ముగూడెం పర్ణశాలలో హుండీ లెక్కింపు
∆} మధిర మండలంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} ఓటు నమోదుపై అవగాహన కార్యక్రమాలు
∆} అశ్వాపురంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పర్యటన
∆} కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే కూనంనేని పర్యటన
∆} భద్రాద్రి రామాలయంలో ప్రత్యేక పూజలు
ఎస్సెస్సీ పరీక్షకు మంగళవారం 77మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని ఖమ్మం జిల్లా డీఈఓ సోమశేఖరశర్మ తెలిపారు. మొత్తం 16,779 మంది విద్యార్థులకు గాను 16,702 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. కలెక్టర్‌తో పాటు అదనపు కలెక్టర్, జిల్లా పరిశీలకుడు , అసిస్టెంట్ కమిషనర్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలను పలు కేంద్రాలను తనిఖీ చేశాయని ఆయన తెలిపారు.
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భూగర్భ జలాలు అడుగంటిపోవడంతో రైతన్నలు గగ్గోలు పెడుతున్నారు. 2,3 బోర్లు వేయిస్తున్నా ఫలితం ఉండట్లేదని, తడి లేక పంట ఎండిపోతోందని రైతులు వాపోతున్నారు. అనేక ప్రాంతాల్లో 500 అడుగుల మేర తవ్వినా నీటి జాడ లభించకపోవడం గమనార్హం. దీంతో ఆరు తడులతో ఎలాగో నెట్టుకొస్తున్నామని రైతన్నలు చెబుతున్నారు. ఎండల తీవ్రతతో మున్ముందు పరిస్థితి మరింత దిగజారే ప్రమాదముందన్న ఆందోళనలూ వ్యక్తమవుతున్నాయి.
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఏప్రిల్ 17న జరగనున్న సీతారాముల కళ్యాణం, పట్టాభిషేకం సెక్టార్ టికెట్లను ఆన్లైన్లో అందుబాటులో ఉంచినట్లు ఈవో రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. ఉభయ దాతల కళ్యాణోత్సవ టికెట్ల ధరలు రూ.7500, 2500, 2000, 1000, 300, 150, పట్టాభిషేకానికి టికెట్ల ధరలు రూ.1500, రూ.500 నిర్ణయించినట్లు పేర్కొన్నారు. ఆయా టికెట్లను భక్తులు ఆన్లైన్ లో పొందవచ్చు అని చెప్పారు.
ఖమ్మం: రానున్న లోకసభ ఎన్నికల నిర్వహణకై పోలింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ ను జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వి.పి. గౌతమ్ మంగళవారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లాలోని 1459 పోలింగ్ కేంద్రాలకు సంబంధించి పీవో, ఏపీవో, ఎంవోల జాబితా సిద్ధం చేయాలన్నారు. వాస్తవ సిబ్బంది ఆవశ్యకతతో పాటు, రిజర్వ్ సిబ్బంది జాబితాలో ఉండాలని అధికారులను సూచించారు.
ఖమ్మం: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగేందర్ మంగళవారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కలయికలో యుగేందర్ పలు అంశాలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. కాగా రేపు కాంగ్రెస్ పార్టీ సీఈసీ మీటింగ్ ఢిల్లీలో జరుగుతున్న నేపథ్యంలో తనను పార్టీ అభ్యర్థిగా ఖరారు చేయాలని యుగేందర్ సీఎంను కోరినట్లు సమాచారం.
కారేపల్లి మండలం గిద్ద వారిగూడెం ప్రభుత్వ పాఠశాలలో మంగళవారం క్షుద్ర పూజల కలకలం రేపింది. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల ఆవరణలో ముగ్గులు వేసి కోళ్లతో పూజలు చేసినట్టు గ్రామస్తులు గుర్తించారు. ఉదయం పిల్లలను పాఠశాలకు తీసుకువచ్చిన తల్లిదండ్రులు పరిస్థితిని చూసి భయాందోళనకు గురైయ్యారు. ఇలా ఉంటే పిల్లలను పాఠశాలకు ఎలా పంపించాలి అంటూ అసహనం వ్యక్తం చేశారు.
అశ్వరావుపేట మండలం నందమూరి కాలనీలో ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ నెలకొంది. రంజాన్, చిన్నా అనే ఇద్దరు స్నేహితుల మధ్య ఘర్షణ చెలరేగి రంజాన్ గొడ్డలి తీసుకువచ్చి చిన్నాపై విచక్షణ రహితంగా దాడి చేశాడు. దాడిని అడ్డుకున్న స్థానికులు గాయపడ్డారు. చిన్నాను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
భద్రాద్రి ఆలయ ఆఫీసులో మృతదేహం కలకలం సృష్టించింది. రామాలయం సీఆర్ఓ కార్యాలయం పైఅంతస్తులోని బాత్రూంలో ఆఫీస్ సిబ్బంది మృతదేహాన్ని మంగళవారం ఉదయం గుర్తించారు. మృతుడు ఖమ్మంకి చెందిన జాఫర్‌గా గుర్తించారు. ఆయన రామాలయం ఆధ్వర్యంలో కొత్తగా నిర్మిస్తున్న వసతి భవనాల్లో టైల్స్ పనికి వచ్చినట్టు చెబుతున్నారు. కార్యాలయ సిబ్బంది ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.