India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం జిల్లాలో రుణ మాఫీ పథకం- 2024 లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రెండొ విడతలో 33,942 మంది రైతులకు రూ.262,50,56,893 రుణమాఫీ చేసినట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఇప్పటికే మొదటి విడతలో 57,857 మంది రైతులకు గాను 258,25,75,452 రుణమాఫీ చేశామన్నారు. ఒకటి రెండు విడతల్లో రుణమాఫీ కానీ రైతులు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు.

ఖమ్మం: మహిళలను ఆర్ధికంగా బలోపేతం చేయడమే మహిళా శక్తి పధకం ముఖ్య ఉద్దేశ్యమని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ తెలిపారు. మంగళవారం నగరంలోని టేకులపల్లి మహిళా ప్రాంగణంలో మహిళా సమాఖ్యలకు నిర్వహించిన అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. సంఘసభ్యులు, మహిళలకు జీవనోపాధి కల్పించాలని, వారిని ఆర్థికంగా బలోపేతం చేయాలని పేర్కొన్నారు.

*ఖమ్మం, భద్రాద్రి కలెక్టర్ కార్యాలయంలో రైతు రుణమాఫీ కార్యక్రమం
*దమ్మపేట వాగులో పడి ఏడేళ్ల బాలుడు మృతి
*దుమ్ముగూడెం ఏజెన్సీలో పర్యటించిన భద్రాద్రి జిల్లా కలెక్టర్
*పార్టీ మార్పు పై క్లారిటీ ఇచ్చిన భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు
*అసెంబ్లీలో నియోజకవర్గ సమస్యలపై ప్రస్తావించిన ఎమ్మెల్యే రాగమయి
*భద్రాచలం గోదావరి వద్ద కొనసాగుతున్న మొదటి ప్రమాద హెచ్చరిక

తన చిత్రాన్ని గీసి బహుకరించిన సత్తుపల్లి ఎమ్మెల్యే రాగమయి దయానంద్ కుమార్తెలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. కుమార్తెలు నీలోత్పల, విపంచి, విరాజీలు స్వయంగా గీసిన సీఎం చిత్రాన్ని హైదరాబాదులోని ఆయనకు అందజేశారు. వారి నైపుణ్యానికి మెచ్చిన సీఎం ప్రశంసించారు. వారివెంట మంత్రి పొంగులేటి ఉన్నారు.

ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈరోజు అసెంబ్లీ ప్రాంగణంలో రుణమాఫీ రెండో విడత విడుదల చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ.. రైతుల అభ్యున్నతి కోసం కాంగ్రెస్ పార్టీ పాటుపడుతుందని తెలిపారు. ఏ రైతు కూడా ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవద్దు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందని చెప్పారు.

విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు కామ ముసుగులో దారుణానికి పాల్పడ్డాడు. వివరాల్లోకెళ్తే.. ఇల్లందు పట్టణంలోని గిరిజన వసతి గృహంలో 9వ తరగతి చదువుతున్న బాలికను ఓ ఉపాధ్యాయుడు వేధిస్తున్నాడు. ఈ విషయాన్ని బాలిక తల్లిదండ్రులకు చెప్పడంతో మంగళవారం సదరు ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేశారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో ఉపాధ్యాయుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

రెండో విడత రుణమాఫీ చాలా సంతోషాన్ని ఇచ్చిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు జమ అవుతున్నాయని మంగళవారం మీడియాతో తెలిపారు. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో చెప్పినట్టు మాఫీ చేస్తున్నామన్నారు. డిక్లరేషన్ ప్రకటించినప్పుడు చాలామంది అనుమానాలను వ్యక్తం చేశారన్నారు. బీఆర్ఎస్ రూ.లక్ష రుణమాఫీ నాలుగు విడతలుగా చేసిందని.. చివరి విడత సగం వదిలేసిందన్నారు.

భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామివారి దేవస్థానంలో మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 4 గంటలకే అర్చకులు ఆలయ తలుపులు తెరిచి స్వామివారికి సుప్రభాత సేవ నిర్వహించారు. అనంతరం ఆరాధన, సేవాకాలం, నిత్య బలిహరణం, పవిత్ర గోదావరి జలంతో అభిషేకం తదితర నిత్య పూజా కార్యక్రమాలు యథావిధిగా జరిపారు. అనంతరం రామయ్య నిత్యకల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

కార్గో సేవలను క్షేత్రస్థాయిలో విస్తరించేందుకు TGSRTC ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇంటి నుంచి ఇంటికి లాజిస్టిక్ విభాగాన్ని అభివృద్ధి చేయాలని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఇటీవల ఆదేశించారు. ఈ తరహా విధానాన్ని తొలుత హైదరాబాద్‌లో ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఉమ్మడి ఖమ్మం రీజియన్‌లో కార్గో సేవలను బలోపేతం చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని ATM(కార్గో) పవన్ తెలిపారు.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో మంగళవారం పత్తి ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి. క్వింటా పత్తి ధర రూ.7,200 జెండా పాట పలికినట్లు మార్కెట్ కమిటీ సభ్యులు తెలిపారు. గత రోజు (శుక్రవారం) కంటే ఈరోజు పత్తి ధర రూ.5లు తగ్గినట్లు చెప్పారు. కాగా, వ్యవసాయ మార్కెట్లో రైతులకు అసౌకర్యం కలిగించకుండా, క్రయవిక్రయాలు జరపాలని మార్కెట్ కమిటీ సభ్యులు పేర్కొన్నారు.
Sorry, no posts matched your criteria.