India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో వరుస సెలవుల అనంతరం మంగళవారం క్రయవిక్రయాలు ప్రారంభమయ్యాయి. ఈరోజు క్వింటా ఏసీ మిర్చి ధర రూ.19,400 జెండా పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. గత వారం మిర్చి ధర రూ.19,300 ఉండగా ఈరోజు రూ.100 పెరిగినట్లు వ్యాపారస్థులు తెలిపారు. రైతుల తమ సరుకు మార్కెట్ తరలించే సమయంలో జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు.

కొడుకును పోలీసులు తీసుకెళ్తాన్నారనే భయంతో ఓ తల్లి గుండె ఆగిపోయింది. స్థానికుల కథనం ప్రకారం.. కొత్తగూడెం రామవరం 6వ వార్డులో కొందరు యువకులు మద్యం తాగుతున్నారు. అదే సమయంలో పెట్రోలింగ్‌కి వచ్చిన పోలీసు సిబ్బంది సంజయ్, అతడి స్నేహితులను తీసుకెళ్తున్నారు. అందులో చంద్రకళ కొడుకును చూసి తీవ్ర అస్వస్థతకు గురై కుప్పకూలింది. బంధువులు, స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందింది.

∆} వివిధ శాఖల అధికారులతో ఖమ్మం, భద్రాద్రి జిల్లా కలెక్టర్లు సమీక్ష సమావేశం
∆} ఖమ్మం వ్యవసాయ మార్కెట్ తిరిగి ప్రారంభం
∆} కొత్తగూడెం పట్టణంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం
∆} భద్రాద్రి ఏజెన్సీలో వరదలపై అధికారులు సమీక్ష సమావేశం
∆} పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు
∆} ఖమ్మం నగరంలో విద్యుత్ సరఫరాలో అంతరాయం

చింతూరు మండలం నిమ్మల గూడెం రహదారి మలుపు వద్ద సత్తుపల్లి నుం వస్తున్న టిప్పర్ అర్ధరాత్రి వరద నీటిలో చిక్కుకుంది. డ్రైవర్ మర్రి నవీన్ పక్కనే ఉన్న తాటి చెట్టుపైకి ఎక్కి రాత్రంతా ఉండిపోయాడు. ఆ గ్రామానికి చెందిన వారు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో ఎస్సై శ్రీనివాస్ సిబ్బందితో బోటుపై వెళ్లి డ్రైవర్‌ను సోమవారం ఒడ్డుకు తెచ్చారు. అతను నిడదవోలుకు చెందిన వ్యక్తి అని పోలీసులు తెలిపారు.

రామప్ప దేవాలయాన్ని పెద్దపల్లి అడిషనల్
కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్ కుటుంబ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రామప్ప ఆలయంలోని శిల్పకళా సంపదలను గైడ్ ద్వారా తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ముందు తరాల వారికి ఈ చారిత్రాత్మక సంపదను అందివ్వడం మన బాధ్యత అని అన్నారు.

అశ్వరావుపేట మండలం వినాయకపురం గ్రామ శివారులో సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ యువకుడు బైక్‌పై వెళుతుండగా అదుపుతప్పి కింద పడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని అశ్వరావుపేటకు తరలించారు. మృతుడు బుట్టాయిగూడెం మండలానికి చెందిన వ్యక్తి అని స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాల నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆదివారం నుంచి వారోత్సవాలు ప్రారంభం కావడంతో జిల్లాలో వాహనాల తనిఖీలను ముమ్మరంగా నిర్వహించారు. ప్రధానంగా ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి జిల్లాలోకి ప్రవేశించే మార్గాల్లో వాహన తనిఖీలు చేపట్టారు. మావోయిస్టులు ఎలాంటి దుశ్చర్యలకు పాల్పడకుండా సరిహద్దుల్లో పోలీసు అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ పేర్కొన్నారు.

ఢిల్లీ సివిల్స్ కోచింగ్ సెంటర్లో వరద నీటిలో పడి ముగ్గురు నిరుద్యోగులు మృతి చెందడం బాధాకరమని, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర సోమవారం రాజ్యసభలో ప్రస్తావించారు. కోచింగ్ సెంటర్ నిర్వాహకులకు ముందస్తు ఆలోచన లేకపోవడం వల్లే ఈ ఘటన జరిగిందని చెప్పారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాజ్యసభ సభ్యుడు కోరారు.

భద్రాచలం రామాలయ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయాలని ఎంపీ బలరాం నాయక్ పార్లమెంట్‌లో ప్రస్తావించారు. అనేక సంవత్సరాలు చరిత్ర కలిగిన శ్రీ సీతారామచంద్ర స్వామి వారి రామాలయం అభివృద్ధికి నోచుకోవడం లేదని చెప్పారు. అటు వరద ముంపు నుంచి భద్రాచలం కాపాడేందుకు తెలంగాణ నుంచి ఏపీలో విలీనమైన మండలాలను తిరిగి తెలంగాణలో కలపాలన్నారు.

ఖమ్మం నగరంలోని నయాబజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతున్న బొడ్డుపల్లి గౌతమ్ ఇంటర్నేషనల్ కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. నేపాల్‌లో జరిగే అండర్-17 పోటీలకు వెళ్లేందుకు తన వద్ద అంత స్తోమత (నగదు) లేదని విద్యార్థి గౌతమ్ తెలిపారు. ఎవరైనా స్పందించి తాను నేపాల్‌లో జరిగే అండర్ 17 కబడ్డీ పోటీల్లో పాల్గొనేందుకు సహాయం చేయాలని కోరాడు.
Sorry, no posts matched your criteria.